భారత త్రివిధ దళాలలో వివిధ ఉద్యోగ నియామక సమాచారం పొందండి. ఇండియన్ ఆర్మీ జాబ్స్, ఇండియన్ నేవీ జాబ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ అవకాశాల కోసం తెలుసుకోండి. అలానే త్రివిధ దళాలలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నిర్వహించే వివిధ నియామక పరీక్షల వివరాలు పొందండి.
- NDA & NA ఎగ్జామ్
- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్
- ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్
- కోస్ట్ గార్డు ఎగ్జామినేషన్
- కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్
- సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్
- టెరిటోరియల్ ఆర్మీ
- ఎస్ఎస్సీ కానిస్టేబుల్(జీడీ)
- అగ్నిపథ్ స్కీమ్ వివరాలు
- నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్
- ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు
- ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ
ఇండియన్ ఢిఫెన్స్ సర్వీసెస్ & పారామిలిటరీ ఫోర్సెస్
డిఫెన్స్ సర్వీసెస్ | పారామిలిటరీ ఫోర్సెస్ | |
ఇండియన్ ఆర్మీ | బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ | సశాస్త్ర సీమ బాల్ |
ఇండియన్ నేవీ | సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ |
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ | ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ | నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ |
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, గౌరవనీయమైన కొలువుల్లో చేరాలనుకునే వారికీ భారతీయ త్రివిధ దళాలు రెడ్ కార్పెట్ తో ఆహ్వానిస్తున్నాయి. ఉత్సాహం, సాహసం, సవాళ్లతో కూడిన వృత్తి జీవితం ఆశించే వారికి, త్రివిధ దళాలకు మించిన గొప్ప స్థలం మరొకటి లేదు. దేశం కొరకు సేవ చేస్తున్నామనే ఆనందం, వృత్తిపరంగా సమాజం నుండి వచ్చే గౌరవం, ఈ రెండు సరి సమానంగా దొరికే వృత్తి ఇదొక్కటే. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు దేశం కోసం సేవ చేయాలనే ఆలోచన పుడుతుంది. ఆ అదృష్టం సాయుధ దళాల్లో ఉన్నవారికి మినహా అందరికి దొరకదు. ఆ అదృష్టం అందిపుచ్చుకునే ఏకైక మార్గం ఏదొక ఇండియన్ ఆర్మడ్ ఫోర్స్ లో చేరాల్సిందే.
దేశంలో రెండవ అతిపెద్ద మానవ వనరులను కల్గిన భారతీయ సాయుధ దళాలు, ఏడాది పొడుగునా క్రమం తప్పకుండ జరిపే నియామక ప్రక్రియల ద్వారా భారతీయ నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తుంది. వారికీ ఉద్యోగంతో పాటు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా గౌరవంగా ముందుకు పోయేందుకు సకల సౌకర్యాలు కల్పిస్తుంది. సాయుధ దళాల నియామక పరీక్షల గురించి పూర్తి సమాచారం మీరు ఇక్కడ తెలుసుకుంటారు.
డిఫెన్స్ ఆర్గనైజషన్స్ లో అత్యధిక నియామకాలు చేపట్టే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డుతో పాటుగా వాటికి పరోక్షంగా సహకారం అందించే మరో పది రక్షణ దళాలు కూడా జాతీయ స్థాయిలో నియామకాలు చేపడతాయి. కనీస విద్య అర్హుత ఎస్ఎస్సి నుండి ఏ విద్య అర్హుతోనైనా భారత సాయుధ దళాల్లోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది.
దేశంలో ఉండే వివిధ దర్యాప్తు సంస్థలు | |
---|---|
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ | నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ |
సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ | నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో |
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ | సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ |
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ | నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో |
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ | రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ |
సెంట్రల్ ఎకనామిక్ ఇంటిలిజెన్స్ బ్యూరో | డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ |
జాయింట్ సైఫర్ బ్యూరో | వైల్డ్ క్రైమ్ ఇంటిలిజెన్స్ బ్యూరో |