దూర విద్య కోర్సులను ప్రధానంగా కాలేజీ చదువులకు నోచుకోని విద్యార్థులు, ఉద్యోగస్తులు మరియు గృహాణిలకు ఉన్నత విద్య చేసే అవకాశం కల్పించేందుకు 1962 లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రారంభించింది. దూరవిద్య నిర్వహణ కోసం 1985 లో ప్రత్యేకంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ) ఏర్పాటు చేసింది. దీనిని 2012 లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డీఈబీ)గా పేరు మార్చారు.
దూరవిద్య కోర్సులు కొన్ని నెలలలో పూర్తిఅయ్యే సర్టిఫికేటెడ్ కోర్సుల నుండి పోస్టుగ్రాడ్యుయేట్, ఎంఫిల్ వరకు అందుబాటులో ఉన్నాయి. దూరవిద్య ద్వారా పూర్తిచేసే సర్టిఫికేటెడ్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ మరియు పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీలకు యూజీ దృవీకరణ ఉంటుంది. ఈ సర్టిఫికెట్లు ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతలలో చెల్లుబాటు అవుతాయి.
ఏయూ ఆఫర్ చేస్తున్న దూరవిద్య కోర్సులు
-
ఏయూ దూరవిద్య అడ్మిషన్ సమాచారం
-
ఏయూ దూరవిద్య స్టడీ సెంటర్లు
-
ఏయూ దూరవిద్య యూజీ కోర్సులు
-
ఏయూ దూరవిద్య పీజీ కోర్సులు
-
ఏయూ దూరవిద్య సర్టిఫికేటెడ్ కోర్సులు
-
ఏయూ దూరవిద్య డిప్లొమా కోర్సులు
-
ఏయూ దూరవిద్య ఎంబీఏ కోర్సులు
ఇగ్నో ఆఫర్ చేస్తున్న దూరవిద్య కోర్సులు
బీఆర్ఏఓయూ అందిస్తున్న దూరవిద్య కోర్సులు
ఇండియాలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్

స్వయం ఆన్‌లైన్ కోర్సులు : 3000 ఉచిత ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్
స్వయం (SWAYAM) ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికను 2017 లో భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న ఆధునీకరణకు అనుగుణంగా అందరికి ఆన్‌లైన్ విధానంలో నాణ్యమైన స్కూల్ మరియు కాలేజీ విద్యను అందించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు.

యూజీసీ మూక్ కోర్సులు : ఆన్‌లైన్ డిగ్రీ & పీజీ ప్రోగ్రామ్స్
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), స్వయం ఆన్‌లైన్ వేదిక ద్వారా 243 పైగా అండర్ గ్రాడ్యుయేషన్, 128 పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. నిరంతర అధ్యయనంలో భాగంగా స్టూడెంట్స్, టీచర్స్ మరియు పరిశోధన విద్యార్థులకు అన్ని వేళల ఉపయోగపడే విధంగా వీటిని రూపొందించారు.

ఈ-పీజీ పాఠశాల : 700 పైగా ఉచిత పీజీ కోర్సులు
ఈ-పీజీ పాఠశాల జాతీయ విద్య మిషన్‌లో భాగంగా భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2015 లో ఏర్పాటు చేసింది. భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యూజీసీ సహాయంతో ఐసిటీ ( ఎన్‌ఎంఇ - ఐసిటి ) ద్వారా ఉన్నత విద్యను అందరికి అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు.

స్వయం ప్రభ టీవీ : 34 ఉచిత డీటీహెచ్ ఎడ్యుకేషనల్ ఛానెల్స్
విద్యా వ్యవస్థ ఆధునికరణలో భాగంగా స్వయం ప్రభ టీవీని భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థులకు, ఇంటర్నెట్ సమకూర్చుకోలేని విద్యార్థులకు 34 DTH చానల్స్ ద్వారా 2017 జూన్ 9 నుండి విద్యా ప్రచారాలు ప్రారంభించింది.

నేషనల్ డిజిటల్ లైబ్రరీ : ప్రాంతీయ భాషల్లో డాకుమెంట్స్, జర్నల్స్
నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను 2016 లో భారత ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూపొందించింది. విద్యార్థులకు అపరితమైన డిజిటల్ విద్యా వనరులను అందించేందుకు, జాతీయ మరియు అంతర్జాతీయ డిజిటల్ లైబ్రరీల నుండి అపరిమితమైన విజ్ఙానాన్ని శోధించి, సేకరించి దీన్ని రూపొందించారు.

ఎన్‌పీటీఎల్ ఆన్‌లైన్ కోర్సులు : ఉచిత ఇంజనీరింగ్ కోర్సులు
నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్సడ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఎల్) ను 2003 లో ఏడు ఐఐటిలు (బొంబాయి, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, గువహతి మరియు రూర్కీ) మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు ఉమ్మడిగా ప్రారంభించాయి.