Advertisement
ఎంట్రప్రెన్యూర్షిప్ గైడెన్స్ : స్టార్టప్ సమాచారం

తెలుగు విద్యార్థులలో ఎంట్రప్రెన్యూర్షిప్ ఐడియాలజీ పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ పేజీను మన వెబ్సైటులో పొందుపర్చడం జరిగింది. ఈ పేజీలో ఎంట్రప్రెన్యూర్షిప్ సంబంధించి సమస్త విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. మా ఈ ప్రయత్నం ఒకరిలోనైనా స్ఫూర్తి కలిగిస్తుందని ఆశపడుతునున్నాం.

ఎంట్రప్రెన్యూర్షిప్ గైడెన్స్

1994, వాల్ స్ట్రీట్'లో ఒక సాధారణ ఉద్యోగం చేసుకుంటున్నా 30 ఏళ్ళ యువకుడు. వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నెట్ ప్రభంజనాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. ఇంటర్నెట్ భవిష్యత్తు రూపాన్ని ఊహించిన ఆ యువకుడు ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని తల్లిదండ్రుల దాచుకున్న డబ్బుతో తన సొంత గ్యారేజీలో ఒక చిన్నపాటి ఇంటర్నెట్ కంపెనీ ప్రారంభించాడు.

అక్కడ కట్ చేస్తే ప్రస్తుతం 2020 ప్రపంచ కుబేరుల్లో ఆయన మొదటిస్థానంలో ఉన్నారు. ఆన్‌లైన్ రిటైల్ సంస్థల్లో ఆయన కంపెనీ అత్యధిక లాభాలతో దూసుకుపోతుంది. ఆయనే జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్. ఆయన స్థాపించిన కంపెనీ అమెజాన్. ఈ ఆర్టికల్ రాస్తున్న సమయానికి ఆయన వ్యక్తిగత సంపద 189.2 బిలియన్ డాలర్లు. అమెజాన్ ముఖ విలువ 1.9 ట్రిలియన్ డాలర్లు.

అమెజాన్ ప్రారంభించే సమయానికి 10 ఏళ్ళు కూడా సరిగా నిండని కుర్రోడు మార్క్ జుకర్‌బర్గ్. సరిగ్గా పదేళ్ల తర్వాత 2004 లో హార్వార్డ్ డార్మెటరీ రూమ్ నుండి  ప్రపంచ ఇంటర్నెట్ యూజర్లను కట్టిపడేచే ఆవిష్కరణ చేసాడు. అక్కడ కట్ చేస్తే నేడు ఆసంస్థ యూజర్ల సంఖ్యా అక్షరాలా 170 కోట్లు. ఆయన స్థాపించిన ఫేస్‌బుక్ ప్రస్తుత మార్కెట్ విలువ 700 బిలియన్ డాలర్లు.

ఇలా చెప్పుకుంటే పోతే ఈ సిలికాన్ వాలీ కథలు కొన్ని వేలల్లో ఉంటాయి. ప్రతి కథలో ఒక అనాముకుడు గొప్ప వ్యాపారవేత్తగా మారుతాడు. ఆ జీరో హీరోగా మారే ప్రక్రియ వెనుక ఒక బలమైన ఐడియాలజీ ఉంది. ఈ ఐడియాలజీ గత మూడు దశాబ్దాల కాలంలో ఈ ప్రపంచ స్థితిగతుల్ని అమాంతం మార్చేసింది. ఆ ఐడియాలజీ పేరు ఎంట్రప్రెన్యూర్షిప్.

ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే ఏంటి ?

ఎంట్రప్రెన్యూర్షిప్ తెలుగులో వ్యవస్థాపకత అంటారు. ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే లాభనష్టాలకు అతీతంగా నూతన వ్యాపార ఆలోచనను ఆవిష్కరించడం. ఒక కొత్త వ్యాపార సంస్థను స్థాపించడం. ఉన్న వ్యాపార ఆలోచనను ఉత్పాదకతగా మార్చడం. బిజినెస్ వెంచర్‌ను ప్రారంభించి దాన్నో లాభదాయక వ్యాపార సముదాయంగా అభివృద్ధి పరచడం.

నిజానికి ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే ఒక వ్యాపార ఆలోచన కాదు. అది వ్యక్తిగత లాభాపేక్ష సంబంధించింది కూడా కాదు. ఒక ఎంట్రప్రెన్యూర్ ఆలోచన విజయవంతమైతే వేలలో సంఖ్యలో ఉద్యోగాలు సృష్టిస్తుంది. దేశ ఉత్పాదకత పెంచుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుంది. చివరిగా పేదరికాన్ని నిర్మూలిస్తుంది. అందుకే ఎంట్రప్రెన్యూర్షిప్'ను ఒక వ్యాపార ఆలోచనగా నేను పరిగణించాను అది మానవాళి స్థితిగతులను మార్చే గొప్ప ఐడియాలజీ.

ఇండియాలో ఎంట్రప్రెన్యూర్షిప్

ఎంట్రప్రెన్యూర్షిప్ ఇండియాలో అంతగా వాడుకలో లేని పదం. భారతీయ విద్య సంస్థలు నిషేదించిన పదం. భారతీయ డిఎన్ఏలో ఎప్పటికి ఇమడని పదం. అంతర్జాతీయంగా అతిపెద్ద సంస్థలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నా, ప్రపంచం మెచ్చిన గొప్ప ఆవిష్కరణల వెనుక భారతీయుల హస్తం ఉండినప్పటికీ ఈ మూడు దశాబ్దల్లో ప్రపంచాన్ని శాసించే ఏ గొప్ప ఆవిష్కరణ భారత్ నుండి నోచుకోలేదు. కారణమేదైనా ఈ వాస్తవాన్ని జీర్ణించుకోక తప్పదు.

కాకుంటే గత ఆరేడేళ్లలో యువత  ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. వాల్ స్ట్రీట్ కథలు, సిలికాన్ వాలీ కార్పొరేట్ హీరోల విజయాలు వీరిలో స్ఫూర్తి కల్గించాయి. వీరు ప్రపంచాన్ని శాసించకపోయినా దేశీయ అవసరాలు తీర్చే పలు ఆవిష్కరణలు చేసారు. ఇందులో ఓలా క్యాబ్స్, ఫ్లిప్‌కార్ట్, మేక్ మై ట్రిప్, పేటీఏం. క్వికర్ వంటి సంస్థలు ఉన్నాయి. వాస్తవానికి ఇవి ఇప్పటికి శైశవ దశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.

మెజారిటీ సంస్థలు విదేశీ పెట్టుబడుల సహాయంతో నడుస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్ ఆప్ ఇండియా ప్రోగ్రాంలు ప్రారంభంలో ఉత్సుకతను, ఉత్సహాన్ని వీరిలో రేపిన స్థూలంగా పొందిన ప్రతిఫలం శున్యం. కానీ ఈ ప్రయత్నాలు భారతీయ యువతని వ్యవస్థాపకత ఆవైపుగా ఆలోచింపజేయటలో గొప్ప విజయాన్ని సాధించాయి.

Post Comment