భారతదేశంలోని ఉత్తమ ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్‌లు 2023

ఫ్రీలాన్సింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఉపాధి వనరు. తమకు నచ్చిన ప్రదేశం నుండి, తమకు నచ్చిన సమయంలో, తమకు నచ్చే పనిని చేసుకునే ఫ్రీలాన్సింగ్ వర్క్ ఫార్మేట్ అంటే ఈ కాలం యువతకు మహా ఇష్టం.

చేతిలో నైపుణ్యం ఉండి, రోజువారీ వర్క్ ఫార్మేట్ నచ్చని వారికీ ఫ్రీలాన్సింగ్ చక్కని ప్రత్యామ్నాయం. వీరితో పాటుగా బయటకు పోయి ఉద్యోగాలు చేయలేని గృహాణిలు, ప్యాకెట్ మనీ కోసం పార్టుటైమ్ వర్క్ చేసే విద్యార్థులకు ఫ్రీలాన్సింగ్ గొప్ప ఉపాధి మార్గంగా చెప్పొచ్చు.

ఫ్రీలాన్సింగ్ నిజానికి ఉద్యోగం కాదు, అదో స్వేచ్చాపూర్వక ఆధునిక భావజాలం. ఈ పదం 18వ శతాబ్దం నాటి నుండే వాడుకలో ఉంది. ఆ కాలపు రాజులు యుద్ధ సమయంలో తాత్కాలిక అవసరాల కోసం కిరాయి సైనికులను నియమించే వారు.

ఈ కిరాయి సైనికులు తమకు ఎక్కువ పైకం చెల్లించే రాజు కోసం పోరాడేవారు. ఇప్పుడా ఆ రాజులు, సైనికులు లేకపోవచ్చు కానీ ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆనాటి రాజుల స్థానంలో ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు లేదా వ్యక్తులు ఉండగా, సైనికుల స్థానంలో నైపుణ్యం ఉండే ఫ్రీలాన్సర్లు ఉన్నారు.

ఫ్రీలాన్సర్ల వర్క్ ఫార్మేట్

సాధారణంగా, ఫ్రీలాన్సర్‌లను స్వతంత్ర కార్మికులుగా పరిగణిస్తారు. వీరు ఒక నిర్దిష్ట సమయ పరిధిలో ఒక కంపెనీ లేదా వ్యక్తితో పని చేసేందుకు లేదా చేసిన పనిని అమ్మెందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు.

ఉదాహరణకు ఒక సంస్థకు వెబ్సైటు రూపొందించేందుకు ఒప్పందం చేసుకున్న ఒక వెబ్ డిజైనర్ లేదా ఒక ఫ్రీలాన్సర్‌ జర్నలిస్ట్‌ తను స్వయంగా సేకరించిన కథనాలను అత్యధిక పైకం చెల్లించే మీడియా సంస్థలకు విక్రయించడం వంటివి ఈ కోవకు చెందుతాయి. ఫ్రీలాన్సర్‌ల పని ఒప్పందాలు లేదా చెల్లింపులు కొన్ని గంటలు లేదా రోజులు లేదా ఒక్కో ప్రాజెక్ట్ విలువ ఆధారితంగా ఉంటాయి.

నైపుణ్యం ఉండే ఫ్రీలాన్సర్లకు వృత్తి మార్కెట్ యందు డిమాండ్ ఉంటుంది. చెల్లింపులు కూడా వృత్తి నైపుణ్యం మరియు పనితీరు ఆధారంగానే లభిస్తాయి. నైపుణ్యం ఉండే ఫ్రీలాన్సర్లు సోషల్ మీడియా వేదికల యందు లేదా ఇతర ఫ్రీలాన్సర్ వేదికల యందు తమ నైపుణ్య సంబంధిత వివరాలు, ఇదివరకు పూర్తిచేసిన వర్క్ డెమోలు లేదా వర్క్ అనుభవాలతో కూడిన పోర్ట్‌ఫోలియో రూపొందించుకోవాలి.

వీటి ఆధారంగా ఫ్రీలాన్సర్ వర్క్ ప్రకటనలు ఇచ్చే యాజమానులను (బిడ్డర్‌) ఆకర్షించాల్సి ఉంటుంది. పని అనుభవం, వేచిన బిడ్ ఆధారంగా ఫ్రీలాన్సర్లతో బిడ్డర్ ఒప్పందం కుదుర్చుకుంటారు.

ఫ్రీలాన్సర్‌లకు డిమాండ్ ఉండే రంగాలు

నైపుణ్యం ఉండే ఫ్రీలాన్సర్లకు ప్రస్తుతం అన్ని రంగాల్లో డిమాండ్ ఉంది. ఫ్రీలాన్సర్లకు ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఈవెంట్ ప్లానింగ్, ఫోటోగ్రఫీ, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ట్యూటరింగ్, క్యాటరింగ్, ఫిల్మ్, ఆర్ట్, డిజైన్, ఎడిటింగ్, కాపీ రైటింగ్, ప్రూఫ్ రీడింగ్, మీడియా, మార్కెటింగ్, మ్యూజిక్, యాక్టింగ్, జర్నలిజం, వీడియో ఎడిటింగ్ మరియు ప్రొడక్షన్, ఇలస్ట్రేషన్, టూరిజం, కన్సల్టింగ్, సేవా రంగం వంటి సృజనాత్మక, నైపుణ్య సంబంధిత రంగాలు ఈ జాబితాలో ఉన్నాయి.

భారతదేశంలోని ఉత్తమ ఫ్రీలాన్సింగ్ సైట్‌లు

Post Comment