దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్టు ఆఫీసులల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఇండియన్ పోస్టల్ శాఖ దరఖాస్తు కోరుతుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రామీణ పోస్టు ఆఫీస్ బ్రాంచుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
పదో తరగతి ఉత్తీర్ణత పొంది, 18 నుండి 35 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారితంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 11 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు 214 పోస్టులు
రాష్ట్రం | ఖాళీలు |
ఆంధ్రప్రదేశ్ | 118 పోస్టులు |
తెలంగాణ | 96 పోస్టులు |
ఎలిజిబిలిటీ
- ఎడ్యుకేషన్ : టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత.
- వయోపరిమితి : 18 నుండి 35 ఏళ్ళు లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- నైపుణ్యాలు : సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారితంగా ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లుగా ఎంపికైన వారికీ 12,000-29,380 పే స్కేల్ అమలు చేస్తారు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లుగా ఎంపికైన వారికీ 10,000-24,470 పేస్కేల్ అమలు చేస్తారు.
దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ వారి తుడుగడువు లోపు www.indiapostgdsonline.gov.in వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో అభ్యర్థి యొక్క వ్యక్తిగత, చిరునామా మరియు విద్యా అర్హుత వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. అలానే ఆధార్ నెంబర్, ఇమెయిల్ వివరాలు సరి చూసుకుని, ఎగ్జామ్ ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.
దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.
- వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
- మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
- ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
- దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
- నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.
దరఖాస్తు ఫీజు | 100/- |