తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నియామక సమాచారం పొందండి. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, పోలీస్, టీచింగ్ ఉద్యోగ ప్రకటనల సమాచారం తెలుసుకోండి.
గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ 2023
దేశ వ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్టు ఆఫీసులల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఇండియన్ పోస్టల్ శాఖ దరఖాస్తు కోరుతుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రామీణ పోస్టు ఆఫీస్ బ్రాంచుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
పదో తరగతి ఉత్తీర్ణత పొంది, 18 నుండి 35 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారితంగా ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 11 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.
- ఖాళీలు : 12.328 పోస్టులు
- ఎలిజిబిలిటీ : టెన్త్ క్లాస్
- వయోపరిమితి : 18 నుండి 35 ఏళ్ళు మించకూడదు
- ఎంపిక : టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగా
- దరఖాస్తు గడువు : 12 జూన్ 2023
ఇండియన్ నేవీలో ఛార్జ్‌మెన్ (మెకానిక్) ఖాళీలు
ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మెన్ పోస్టుల భర్తీ కోసం భారతీయ నౌకాదళం దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఓడలు మరియు జలాంతర్గాములలోని ఆయుధాలు, యంత్రాలు మరియు ఇతర సాంకేతిక పరికరాల నిర్వహణకు బాధ్యత వహించే ఈ పోస్టులను ఇండియన్ నేవల్ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తారు.
ఎలక్ట్రికల్, వెపన్, ఇంజనీరింగ్, కంస్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్సు, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక రాతపరీక్ష మరియు ఫీజికల్, మెడికల్ టెస్ట్ ఆధారితంగా ఉంటుంది.
- ఖాళీలు : 372 పోస్టులు
- ఎలిజిబిలిటీ : డిప్లొమా & గ్రాడ్యుయేషన్
- వయోపరిమితి : 18 నుండి 23 ఏళ్ళు మించకూడదు
- ఎంపిక : రాతపరీక్ష & ఫీజికల్, మెడికల్ టెస్ట్
- దరఖాస్తు గడువు : 29 మే 2023
NDA & NA Exam 2023 (II) నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 2023 ఏడాదికి సంబంధించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ II (NDA & NA - II) ప్రకటన వెలువడింది. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సర్వీసుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు జరిగే ఈ నియామక పరీక్షకు ఇంటర్ పూర్తిచేసి, 16 నుండి 18 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా మొత్తం 395 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంబంధించి 370, నేవల్ అకాడమీ సంబంధించి 25 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు 06 జూన్ 2023 లోపు దరఖాస్తు చేసుకోండి.
- ఖాళీలు : 395 పోస్టులు
- ఎలిజిబిలిటీ : ఇంటర్మీడియట్
- వయోపరిమితి : 16 నుండి 18 ఏళ్ళు మించకూడదు
- ఎంపిక : రాతపరీక్ష & పర్సనల్ టెస్ట్
- దరఖాస్తు గడువు : 06 జూన్ 2023
యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామినేషన్ (II) నోటిఫికేషన్ 2023 విడుదల
2023 ఏడాదికి సంబంధించి భారతీయ త్రివిధ దళాల్లో వివిధ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ II నోటిఫికేషన్ విడుదల అయ్యింది. యూపీఎస్సీ నిర్వహించే ఈ నియామక ప్రకటనకు డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
ఈ నియామక ప్రకటన ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ మరియు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీల్లో దాదాపు 349 ఖాళీలను భర్తీచేయున్నారు. ఎంపిక పక్రియ రాత పరీక్ష మరియు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆయా అకాడమీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యతో పాటుగా సాయుధ దళాల ట్రైనింగ్ అందిస్తారు. అర్హులైన అభ్యర్థులు 06 జూన్ 2023 లోపు దరఖాస్తు చేసుకోండి.
- ఖాళీలు : 349 పోస్టులు
- ఎలిజిబిలిటీ : గ్రాడ్యుయేషన్
- వయోపరిమితి : 18 నుండి 23 ఏళ్ళు మించకూడదు
- ఎంపిక : రాతపరీక్ష & ఫీజికల్ టెస్ట్
- దరఖాస్తు గడువు : 06 జూన్ 2023
ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ 2023 నోటిఫికేషన్ విడుదల
ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్ కార్యాలయాల్లో లోయర్ డివిజనల్ క్లర్క్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లును నియమించేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నియామక పరీక్షను నిర్వహిస్తుంది.
ఇంటర్మీడియట్ పూర్తిచేసి, 18 నుండి 27 ఏళ్ళ మధ్య ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8 జూన్ 2023 లోపు దరఖాస్తు చేసుకోండి
- ఖాళీలు : 4,522 పోస్టులు
- ఎలిజిబిలిటీ : ఇంటర్మీడియట్
- వయోపరిమితి : 18 నుండి 27 ఏళ్ళు మించకూడదు
- ఎంపిక : రాతపరీక్ష & స్కిల్ టెస్ట్
- దరఖాస్తు గడువు : 08 జూన్ 2023
In 2024 how many jobs are there
I can job try