Advertisement
భారతీయ రైల్వే ఉద్యోగాలు 2023 | లేటెస్ట్ రైల్వే రిక్రూట్‌మెంట్

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భారతీయ రైల్వే దేశంలోనే అత్యధిక మానవ వనురులను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 70 వేల కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలో 3వ పెద్ద రైల్వే నెట్వర్క్ గా నిలిచింది. 25 లక్షలకు పైగా ప్రయాణికులను ప్రతిరోజు గమ్యానికి చేరుస్తున్న భారతీయ రైల్వేకు అంతే మొత్తంలో మానవ వనరుల అవసరం ఉంది.

15 లక్షలకు పైగా సిబ్బందిని కలిగిన ఇండియన్ రైల్వే యేటా వివిధ పోస్టుల కోసం వేలాది మంది అభ్యర్థులను నియమిస్తుంది. రైల్వే నియామక ప్రకటనలు జాతీయ స్థాయిలో వెలువడేటప్పటికీ, తదుపరి భర్తీ ప్రక్రియ రాష్ట్రల పరిధిలో ఉండే బోర్డుల ఆదీనంలో జరుపబడతాయి. ఇండియన్ రైల్వేకు దేశవ్యాప్తంగా 21 బోర్డులు ఉన్నాయి.

ఇండియన్ రైల్వే బోర్డులు

అహ్మదాబాద్ చెండీఘర్ ముంబాయి
ఆజమీర్ చెన్నై ముజాఫ్ఫార్పూర్
అలాహాబాద్ గోరఖ్పూర్ పాట్నా
బెంగళూర్ గౌహతి రాంచీ
భూపాల్ జమ్మూ & కాశ్మీర్ సికింద్రాబాద్
భువనేశ్వర్ కోలకతా సిలిగురి
బిలాస్పూర్ మల్దా తిరుమనతపురం

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగ నియామక ప్రక్రియను వివిధ సెక్టర్ల వారిగా, సిబ్బంది చేసే విధులు, మరియు విద్యా అర్హుతను ఆధారంగా చేసుకుని గ్రూపు ఏ, గ్రూపు బీ, గ్రూపు సీ మరియు గ్రూపు డీ గా విభజించి నియామక ప్రకటన చేపడతారు. గ్రూపు ఏ, గ్రూపు బీ ఉద్యోగులు గెజిటెడ్ హోదా కలిగిఉంటారు. గ్రూపు సీ, గ్రూపు డీ ఉద్యోగాలు నాన్ గెజిటెడ్ హోదా కలిగిఉంటారు.

ఆర్‌ఆర్‌బి గ్రూపు ఏ ఉద్యోగాలు

రైల్వేలో ఉండే ఉన్నతస్థాయి ఉద్యోగాలను గ్రూపు ఏ కేటగిరిలో భర్తీచేస్తారు. గ్రూపు ఏ ఉద్యోగాలు యూనియన్ పబ్లిక్ కమిషన్ (UPSC) నిర్వహించే కంబైన్డ్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ మరియు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీచేస్తారు. ఈ నియామక ప్రక్రియలో రాతపరీక్ష మరియు గ్రూపు డిస్కర్షన్ నిర్వహించడం ద్వారా మెరిట్ అభ్యర్థులను ఒడపోస్తారు.

కంబైన్డ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్  సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 
ఇండియన్ రైల్వే సర్వీస్ ఇంజనీరింగ్ సర్వీస్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్
 ఇండియన్  రైల్వే స్టోర్ సర్వీస్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్
ఇండియన్ రైల్వే సిగ్నల్ ఇంజనీర్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్

ఇండియన్ రైల్వే గ్రూప్ బీ ఉద్యోగాలు

భారతీయ రైల్వే కు సంబంధించిన గ్రూపు బీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గ్రూపు సీ ఉద్యోగులకు ప్రమోషన్/డిప్యూటేషన్ కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు.

రైల్వే గ్రూపు సీ ఉద్యోగాలు

ఇండియన్ రైల్వే గ్రూపు సీ అధికారుల నియామక ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా చేపడతారు. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే బోర్డులు తమ జోన్ పరిధిలో ఈ నియామక ప్రక్రియ బాధ్యత వహిస్తాయి. గ్రూపు సీ పరిధిలో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ సంబంధిత ఉద్యోగాలు భర్తీచేస్తారు.

ఆర్‌ఆర్‌బి అసిస్టెంట్ లోకో పైలట్ &

టెక్నీషియన్ ఎగ్జామ్

ఆర్‌ఆర్‌బి టెక్నికల్ కేటగిరిలో అసిస్టెంట్ లోకో పైలెట్ (ALP) మరియు టెక్నిషియన్ సంబంధిత పోస్టులను భర్తీచేస్తారు. ఈ భర్తీ ప్రక్రియ RRB ALP/టెక్నీషియన్ రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. ఈ నియామక పరీక్ష నాలుగు దశలలో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు.

సీబీటీలో అర్హుత సాధించిన వారికీ రెండవ దశలో మరో కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్  టెస్ట్ జరుపుతారు. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు మూడు, నాల్గువ దశలో ధరఖాస్తు ధృవీకరణ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామక పత్రాలు జారీచేస్తారు. ఈ ఉద్యోగాలకు ఐటీఐ మరియు టెక్నికల్ గ్రాడ్యుయేషన్ ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ 2 పే స్కేల్ ఆధారంగా జీతాలు చెల్లిస్తారు.

ఆర్‌ఆర్‌బి ఎన్టీపీసీ ఎగ్జామ్

నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎన్టీపీసీ పరీక్ష నిర్వహించబడుతుంది. నాన్ టెక్నికల్ కేటగిరిలో తిరిగి గ్రాడ్యుయేషన్, మరియు అండర్ గ్రాడ్యుయేషన్ అర్హుత ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో క్లార్క్ కమ్ టైపిస్ట్, అకౌంటెంట్ క్లార్క్ కమ్ టైపిస్ట్ , ట్రైన్ క్లేర్క్స్, కమర్షియల్ క్లార్క్, టికెట్ ఎగ్జామినర్స్ వంటి వివిధ పోస్టులను ఇంటర్మీడియట్ (10+2) అర్హుతతో భర్తీచేస్తారు.

కమర్షియల్ క్లార్క్ (లెవెల్ 3) మినహా మిగతా అందరికి లెవెల్ 2 పే స్కేల్ ఆధారంగా జీతాలు చెల్లిస్తారు. నియామక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా చేపడతారు. క్లార్క్ కమ్ టైపిస్ట్, అకౌంటెంట్ క్లార్క్ కమ్ టైపిస్ట్ , ట్రైన్ క్లేర్క్స్, కమర్షియల్ క్లార్క్ సంబంధిత పోస్టులకు అర్హుత సాధించిన అభ్యర్థులు అదనంగా కంప్యూటర్ ఆధారిత స్కిల్ టెస్ట్ కు హాజరవ్వాల్సి ఉంటుంది.

ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ కేటగిరిలో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్స్, స్టేషన్ మాస్టర్లు, కమర్షియల్ క్లర్కులు, ఎంక్వరి కమ్ రిజర్వేషన్ క్లర్కులు, ట్రాఫిక్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటిస్ మొదలగు పోస్టులను భర్తీచేస్తారు. ఈ పోస్టులకు ధరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

నియామక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా చేపడతారు. సీనియర్ క్లార్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ క్లార్క్ కమ్ టైపిస్ట్ సంబంధిత పోస్టులకు అర్హుత సాధించిన అభ్యర్థులు అదనంగా కంప్యూటర్ ఆధారిత స్కిల్ టెస్ట్ కు హాజరవ్వాల్సి ఉంటుంది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సంబంధించి అర్హుత సాధించిన వారికీ రెండవ దశలో టైర్ 2 ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు.

ఆర్‌ఆర్‌బి పారామెడికల్ ఎగ్జామ్

ఇండియన్ రైల్వే హాస్పిటల్స్ లో విధులు నిర్వర్తించే స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్, మెడికల్ టెక్నిషియన్స్, ల్యాబ్ అటెండర్లు, ఫీజియోథెరపిస్టు, డైటీషియను, ఆప్టోమేట్రిస్ట్ సిబ్బందిని భర్తిచేసేందుకు పారామెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సెంట్రలైజడ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ లో ఉన్న నియమ నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఈ నియామకాలు చేపడతారు.

రైల్వే గ్రూపు డీ ఉద్యోగాలు

ఇండియన్ రైల్వే కు సంబంధించి భారీ మొత్తంలో చేపట్టే ఉద్యోగ నియామకాలలో అధికమొత్తంలో గ్రూపు డీ పోస్టులు ఉంటాయి. రైల్వే కు సంబంధించి క్షేత్రస్థాయి లో విధులు నిర్వర్తించే గేట్ మ్యాన్, ట్రాక్ మ్యాన్, ఇంజనీరింగ్ హెల్పర్లు, అటెండర్లు, హాస్పిటల్ అటెండర్లు, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్, పోర్టర్ మొదలగు సిబ్బందిని నియమిస్తారు.

ఈ నియామక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్టులు ఉంటాయి. ఈ దశల్ని పూర్తిచేసుకున్న అభ్యర్థులకు నియామక పత్రాలు జారీచేస్తారు. గ్రూపు డీ సిబ్బందికి లెవెల్ 1 పే స్కేలు ఆధారంగా జీతాలు చెల్లిస్తారు.

Post Comment