Advertisement
ఎస్‌ఎస్‌సీ నిర్వహించే ప్రధాన పరీక్షలు | ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్లు 2023

కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి ఆధారిత కార్యాలయాలలో విధులు నిర్వర్తించే నాన్ గెజిటెడ్ (గ్రూపు బి), నాన్ టెక్నికల్ (గ్రూపు సి) ఉద్యోగాల నియామక ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహిస్తుంది. యూపిఎస్‌సీ మాదిరిగా ఎస్‌ఎస్‌సీ కూడా ముందుగానే యేడాది మొత్తానికి సంబంధించి నియామక క్యాలెండరు విడుదల చేస్తుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి ఆధారిత కార్యాలయాలలో విధులు నిర్వర్తించే నాన్ గెజిటెడ్ (గ్రూపు బి), నాన్ టెక్నికల్ (గ్రూపు సి) ఉద్యోగాల నియామక ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహిస్తుంది. వీటితో పాటుగా 2016 నుండి గ్రూపు బి గెజిటెడ్ పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ నియామక బాధ్యతను కూడా నిర్వర్తిస్తుంది.

ఈ నియామక సంస్థ న్యూ ఢీల్లీ ప్రధానకేంద్రంగా భారత ప్రభుత్వం యొక్క డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఎస్‌ఎస్‌సి యేటా 40 వేల నుండి 80వేల ప్రభుత్వ కార్యాలయ సిబ్బందిని నియమిస్తూ, దేశంలో ఒకానొక పెద్ద ప్రభుత్వ నియామక సంస్థగా వర్థిల్లుతుంది.

యుపిఎస్‌సి మాదిరిగా ఎస్‌ఎస్‌సి కూడా ముందుగానే యేడాది మొత్తానికి సంబంధించి నియామక క్యాలెండరు విడుదల చేస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకారం యేడాదిలో నిర్వహించవల్సిన నియామక పరీక్షలన్నీ పూర్తిచేసి, విధించిన గడువులోపు ప్రభుత్వకార్యాలలో అవసరమైన సిబ్బందిని భర్తీచేస్తుంది.

ఎస్ఎస్సి నియామక ప్రక్రియను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ మరియు ప్రొమోషన్ పద్దతిలో భర్తీచేస్తుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో వివిధ డిపార్టుమెంటులకు సంబంధించి జాతీయ స్థాయిలో నియామక ప్రకటన విడుదల చేసి, రాత పరీక్షా మరియు వివిధ నైపుణ్య పరీక్షల నిర్వహణ ద్వారా సిబ్బందిని భర్తీచేస్తుంది.

Post Comment