Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 28 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 28 మార్చి 2024

28 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

తెలంగాణాలో బ్యూరో డి ఫ్రాన్స్ ప్రారంభం

భారతదేశంలోని ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ, ఇటీవల హైదరాబాద్‌లో "బ్యూరో డి ఫ్రాన్స్"ను ప్రారంభించారు. ఇది ఫ్రాన్స్ మరియు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. బ్యూరో డి ఫ్రాన్స్ అనేది బెంగళూరులోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ యొక్క బ్రాంచ్ కార్యాలయం, దీనిని రాయదుర్గ్‌లోని టి-హబ్‌లో ఏర్పాటు చేశారు.

బ్యూరో డి ఫ్రాన్స్ తెలంగాణ మరియు ఫ్రాన్స్ మధ్య వారధిగా పని చేస్తుంది. ఇది ఇరువురి మధ్య వివిధ రంగాలలో జ్ఞాన మార్పిడి మరియు సహకారాన్ని సులభతరం చేయడానికి అనుమతి ఇస్తుంది. తెలంగాణ యొక్క అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

ఫ్రాన్స్ మరియు తెలంగాణ మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఈ బ్యూరో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బలమైన భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ఆధారమైన ప్రజల-ప్రజల సంబంధాలను బలపరుస్తుంది.

జూలై 2023లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్త ప్రకటనను అనుసరించి బ్యూరో డి ఫ్రాన్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ చొరవ , సహకార ఆవిష్కరణలు మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి, తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.

భారతదేశంలో కొత్త టీబీ కేసులలో 16% క్షీణత నమోదు

2015 నుండి భారతదేశం కొత్త టీబీ కేసులలో 16 % క్షీణత మరియు మరణాలలో 18% తగ్గుదలని నమోదుచేసినట్లు నివేదించబడింది. ఈ పురోగతి ప్రపంచ సగటు క్షీణత 9 శాతంను అధిగమించింది, ఈ నివేదిక టీబీ నిర్మూలన కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. అలానే ఈ తగ్గుదల చికిత్స కార్యక్రమాల ప్రభావాన్ని మరియు మెరుగైన రోగి ఫలితాలను ప్రతిబింబిస్తుంది.

ఈ నివేదిక ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించబడింది. అయితే, టీబీకి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం ఇంకా ముగియలేదు. 2023లో టీబీ కేసుల నమోదులో గణనీయమైన పెరుగుదలను ఈ నివేదిక వెల్లడించింది. గత ఏడాది 25.55 లక్షల క్షయ కేసులు నోటిఫై చేయబడినట్లు నివేదించబడింది.

1960 జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం తర్వాత ఇదే అత్యధికంగా బావించబడుతుంది. నోటిఫై చేసిన కేసుల్లో దాదాపు 32% ప్రైవేట్ హెల్త్ సెక్టార్ నుంచి వచ్చినవేనని ఈ నివేదిక పేర్కొంది. 2022 నుండి ఇది 17% పెరుగుదలను సూచిస్తుంది. అయితే టీబీ చికిత్స కవరేజీలో భారతదేశం అత్యుత్తమ అంచనాలను నమోదు చేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.

2025 నాటికి టీబీని పూర్తిగా నిర్మూలించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సవాళ్లు మిగిలి ఉండగానే..కొత్త కేసులలో గణనీయమైన తగ్గుదల మరియు మరణాల రేట్లు ఆశాజనకమైన దృక్పథాన్ని కల్పిస్తున్నాయి. అయితే డ్రగ్-రెసిస్టెంట్ టిబి జాతుల పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి పటిష్టమైన నిఘా, చికిత్సకు కట్టుబడి ఉండే ప్రోగ్రామ్‌లు మరియు కొత్త రోగనిర్ధారణ మరియు ఔషధాలపై పరిశోధన అవసరం.

గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ర్యాంకింగ్స్‌లో ఎల్‌ఐసికి అగ్రస్థానం

26 మార్చి 2024న ప్రచురించబడిన బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ నివేదిక ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే బలమైన బీమా బ్రాండ్‌గా అవతరించింది. ఎల్‌ఐసి బ్రాండ్ విలువ 9.8 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.

ఈ గుర్తింపు ఎల్ఐసి యొక్క బలమైన బ్రాండ్ ఇమేజ్ మరియు భారతీయ బీమా మార్కెట్లో ఆధిపత్య స్థానాన్ని నొక్కి చెబుతుంది. గత ఏడు దశాబ్దాల చరిత్రతో, ఎల్ఐసి భారతదేశంలోని మిలియన్ల మంది పాలసీదారులలో విశ్వసనీయత మరియు భద్రత కోసం ఖ్యాతిని నిర్మించింది. ఈ దీర్ఘకాల విశ్వాసం బ్రాండ్ యొక్క బలానికి మూలస్తంభం.

ఈ నివేదికలో ఎల్‌ఐసికి AAA రేటింగుతో, బ్రాండ్ స్ట్రెంగ్త్ స్కోర్ 88.3 ఇవ్వబడింది. దీని తర్వాత ఆస్ట్రేలియా యొక్క ఎన్ఆర్ఎంఎ బీమా సంస్థ ఉంది, దీని బ్రాండ్ విలువ 82% పెరిగి $1.3 బిలియన్లకు చేరుకుంది. తర్వాత మూడు స్థానాలలో చైనా బీమా సంస్థలు చోటు దక్కిచుకున్నాయి.

అయితే చైనీస్ బీమా బ్రాండ్‌లు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నివేదికలో, ప్రపంచంలోని మొదటి ఐదు బీమా కంపెనీలలో మూడు చైనాకు చెందినవి ఉన్నాయి. చైనా బీమా సంస్థ పింగ్ యాన్ బ్రాండ్ విలువలో నాలుగు శాతం పెరుగుదలతో $33.6 బిలియన్లతో అగ్రస్థానంలో ఉంది. జర్మనీ యొక్క అలియన్జ్ రెండవ స్థానంలో, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ మూడవ స్థానంలో ఉన్నాయి.

గ్లోబల్ ర్యాంకింగ్ బీమా కంపెనీ
1 పింగ్ యాన్ (చైనా)
2 అలియన్జ్ (జర్మనీ)
3 చైనా లైఫ్ ఇన్సూరెన్స్ (చైనా)
4 ఏఎక్స్‌ఏ (ఫ్రాన్స్)
5 సిపిక్ (చైనా)

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ 2013లో పుణె వారియర్స్ ఇండియాపై 263/5 స్కోరు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డును బద్దలు కొట్టింది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. ఏప్రిల్ 15, 2024న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ చారిత్రాత్మక ఫీట్ సాధించి చరిత్ర సృష్టించింది.

సన్‌రైజర్స్ తన అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 287/3 స్కోరు చేసింది. ఈ ప్రదర్శనతో ఈ సీజన్ యందు ఇప్పటికే ముంబై ఇండియన్స్‌పై నెలకొల్పిన 277/3 రికార్డును కూడా ఈ జట్టు అధిగమించింది. ఈ సీజన్ యందు సన్‌రైజర్స్ 263 దాటి స్కోరు చేయడం ఇది మూడవసారి.

ఈ జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ 108 పరుగుల భాగస్వమ్యం నెల్కొపడంతో ఈ రికార్డు సొంతం చేసుకుంది. ముఖ్యంగా హెడ్, ఐపీఎల్‌లో నాల్గవ వేగవంతమైన సెంచరీని ఈ మ్యాచ్ నమోదు చేసి ఏ రికార్డుకు కారకుడు అయ్యాడు.

ఓపెనర్ల నిష్క్రమణ తరువాత, హెన్రిచ్ క్లాసెన్ 67 పరుగులతో ఈ  స్కోరు వేగాన్ని కొనసాగించారు. ఐడెన్ మార్క్‌రామ్ మరియు అబ్దుల్ సమద్‌ల తదుపరి అతిధి పాత్రలతో జట్టు స్కోరు 287కి చేరువ అయ్యేలా సహకరించారు.

భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తనపై ప్రధాని మోదీ & బిల్ గేట్స్ చర్చ

మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరియు ప్రధాని మోడీ కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాధికారత సహా అనేక రకాల అంశాల గురించి ఇటీవలే చర్చాగోష్ఠి నిర్వహించారు. బిల్ గేట్స్‌తో జరిగిన ఈ సంభాషణలో, టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించడం, మహిళలకు సాధికారత కల్పించడం, పాలనలో ఎఐని సమగ్రపరచడం, ఎఐ సవాళ్లను పరిష్కరించడం మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల వంటి పునరుత్పాదక శక్తిలో పురోగతితో సహా భారతదేశ సాంకేతిక పురోగతిని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు.

ఇండోనేషియాలో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు భారతదేశంలో డిజిటల్ విప్లవం గురించి తమ ఉత్సుకతను వ్యక్తం చేశారు. గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి భారత ప్రభుత్వం సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించినట్లు వివరించారు. నూతన సాంకేతికత ప్రజలచే మరియు ప్రజల కోసం అనే భావనను ప్రధాని పంచుకున్నారు.

ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మరియు విద్యలో సాంకేతిక పురోగతి గురించి ప్రధాని మోదీ తన ఉత్సాహాన్ని వివరించారు. మరోవైపు, బిల్ గేట్స్ సాంకేతికతను స్వీకరించడంలో మరియు అభివృద్ధి చేయడంలో, ముఖ్యంగా పాలనలో భారతదేశం యొక్క నాయకత్వాన్ని ప్రశంసించారు.

Post Comment