English Articles in Telugu | Types, Usage & Examples
Spoken English

English Articles in Telugu | Types, Usage & Examples

తెలుగులో సులభంగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ నేర్చుకోండి. తెలుగు వ్యాకరణంలో ఈ ఆర్టికల్స్ ప్రస్తావన లేదు. అందుకే దినికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధన తెలుగు భాషలో లేదు.

ఇంగ్లీషు వ్యాకరణంకు వచ్చేసరికి వాక్య నిర్మాణంలో ఈ ఆర్టికల్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. అలానే పోటీ పరీక్షల పరంగా కూడా ఈ అంశానికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి. అందువలన ఆర్టికల్స్ గురించి పూరి వివరాలు ఇక్కడ నేర్చుకుందాం.

ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్

Articles are words that define a noun as specific or unspecific and are used in undefined expressions.

ఇంగ్లీషు భాషలో "A, An, The" అనే మూడు మాటలను ఆర్టికల్స్ అని అంటారు. ఇవి adjective మాదిరిగానే నౌన్ యొక్క లక్షణాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. వీటిని సాధారణంగా Noun, Adjective మరియు Adverb వంటి భాష భాగాల ముందు ఉపయోగిస్తారు.

"A & An" అంటే "ఒక " అని అర్ధం. కొన్ని సార్లు ఏ అర్ధం లేకుండా కూడా ఉంటాయి. "The" అంటే "ఫలానా" అని అర్ధం. ఇది కూడా కొన్ని సార్లు ఏ అర్ధం లేకుండా కూడా ఉంటుంది. "A & An" లను Indefinite articles అంటారు. అలానే "The" నీ Definite article అంటారు. ఇప్పుడు ఏ సంధర్బాలలో దేన్నీ ఉపయోగించాలో చూద్దాం.

Article - A హల్లు (Consonant) అక్షరంతో ప్రారంభమయ్యే ఏక వచన పదాల (Singular nouns) ముందు ఆర్టికల్ A వస్తుంది. అలానే ఒక పదం అచ్చుతో ప్రారంభమైనా..దాన్ని పలికే సందర్భంలో అది హల్లు శబ్దం వచ్చే మాటల ముందు కూడా ఆర్టికల్ A వస్తుంది.
Article - An అచ్చు (vowel) అక్షరంతో ప్రారంభమయ్యే ఏక వచన పదాల ముందు ఆర్టికల్ An వస్తుంది. అంటే "A, E, I, O, U" అక్షర శబ్దాలతో ప్రారంభమయ్యే నామవాచకాల ముందు ఉపయోగిస్తారు.

అలానే ఒక పదం హల్లుతో ప్రారంభమైనా..దాన్ని పలికే సందర్భంలో అది అచ్చు శబ్దం వచ్చే మాటల ముందు కూడా ఆర్టికల్ An  వస్తుంది.

Article - The ప్రత్యేక నామవాచకాల (Unique or Specific Nouns ) ముందు The (ది or ద) ఆర్టికల్ ఉపయోగిస్తారు.

ఇంగ్లీష్ వ్యాకరణంలో ఆర్టికల్ A

హల్లు (Consonant) అక్షరంతో ప్రారంభమయ్యే ఏక వచన పదాల (Singular nouns) ముందు ఆర్టికల్ A ఉపయోగించాలి. అలానే ఒక పదం అచ్చుతో ప్రారంభమైనా..దాన్ని పలికే సందర్భంలో అది హల్లు శబ్దం వచ్చే మాటల ముందు కూడా ఆర్టికల్ A ఉపయోగించాలి.

ఇక్కడ ప్రధానంగా ఒక మాట ఏ అక్షరంతో ప్రారంభమౌతుందనే పాయింట్ కంటే, ఆ అక్షరం ఏ శబ్దంతో పలుకుతుందనేది ముఖ్యం. అనగా హల్లు (Consonant) అక్షర శబ్దాలతో ప్రారంభమయ్యే మాటల ముందు "A ఆర్టికల్" ఉపయోగించాలి.

 "This is a cat" - (correct)
"This is cat" - (worng)
a cat అంటే "ఒక పిల్లి" అయినా కావొచ్చు లేదా "పిల్లి" అయినా కావొచ్చు. పిల్లి అనే మాటను విడిగా చెప్పాలంటే a cat అనక్కర్లేదు. కానీ "ఇది పిల్లి" అని ఒక వాక్యంగా చెప్పాలంటే, అప్పుడు తప్పనిసరి a cat గా ఉండితీరాలి.
 A uniform (యూనిఫామ్ - యూ శబ్దం)
A unicorn (యునికార్న్ - యు శబ్దం)
A one rupee coin (వన్ - వ శబ్దం
ఈ మూడు ఉదాహరణలలో పదాల యొక్క మొదటి అక్షరం అచ్చులతో (vowels) తో ప్రారంభమైన..వాటిని పలికేటప్పుడు హల్లు శబ్దాలను ఇస్తున్నాయి. అందుకే వాటి ముందు "A" వచ్చి చేరింది.
A girl (Article + Noune)
A good girl (Article + Adjective +Noune)
A very good girl  (Article +Adverb + adjective+ Noune)
మొదట వాక్యంలో ఆర్టికల్ A, Noun పక్కన ఉంది. రెండవ వాక్యంలో Adjective (Good) పక్కన ఉంది. మూడవ వాక్యంలో Adverb (Very) పక్కన ఉంది. ఒక వాక్యంలో ఆర్టికల్'కు మరియు Noun కీ మధ్య ఇంకో మాట వచ్చి చేరింది అంటే, అది తప్పనిసరి Adjective అవుతుంది.

ఆంగ్ల వ్యాకరణంలో ఆర్టికల్ An

అచ్చు (vowel) అక్షరంతో ప్రారంభమయ్యే ఏక వచన పదాల ముందు ఆర్టికల్ An వస్తుంది. అంటే "A, E, I, O, U" అక్షర శబ్దాలతో ప్రారంభమయ్యే నామవాచకాల ముందు ఉపయోగిస్తారు. అలానే ఒక పదం హల్లుతో ప్రారంభమైనా..దాన్ని పలికే సందర్భంలో అది అచ్చు శబ్దం వచ్చే మాటల ముందు కూడా ఆర్టికల్ An వస్తుంది.

ఇక్కడ ప్రధానంగా ఒక మాట ఏ అక్షరంతో ప్రారంభమౌతుందనే పాయింట్ కంటే, ఆ అక్షరం ఏ శబ్దంతో పలుకుతుందనేది ముఖ్యం. అనగా అచ్చు (vowel) అక్షర శబ్దాలతో ప్రారంభమయ్యే మాటల ముందు "An ఆర్టికల్" ఉపయోగించాలి. ex: An Engineer, An excellent

 "This is an Eagle" - (correct)
"This is eagle" - (worng)
An eagle అంటే "ఒక డేగ" అయినా కావొచ్చు లేదా "డేగ" అయినా కావొచ్చు. డేగ అనే మాటను విడిగా చెప్పాలంటే an eagle అనక్కర్లేదు. కానీ "ఇది డేగ" అని ఒక వాక్యంగా చెప్పాలంటే, అప్పుడు తప్పనిసరి an eagle గా ఉండితీరాలి.
 An honor ( ఆనర్- ఆ శబ్దం)
An hour  (అవర్ - అ శబ్దం)
An wound (ఊండ్  - ఊ శబ్దం)
ఈ మూడు ఉదాహరణలలో పదాల యొక్క మొదటి అక్షరం హల్లులతో (Consonant) తో ప్రారంభమైన..వాటిని పలికేటప్పుడు అచ్చు శబ్దాలను ఇస్తున్నాయి. అందుకే వాటి ముందు "An" వచ్చి చేరింది.

ఆంగ్ల వ్యాకరణంలో ఆర్టికల్ The

The ఆర్టికల్ నీ డెఫినిట్ ఆర్టికల్ అంటారు. The ని పలానా అనే అర్థంతో వాడినప్పుడు అది definite (స్పష్టమైన) ఆర్టికల్ అవుతుంది. "ఆర్టికల్ the" ని ఒక నిర్దిష్ట గుర్తింపు లేదా ప్రత్యేకత కలిగిన నామవాచకాల ముందు మాత్రమే ఉపయోగిస్తారు ఉపయోగిస్తారు.

Article A మరియు An లను కేవలం ఏక వచన నామవాచకాల (singular noun) ముందు మాత్రమే ఉపయోగించాలి. కానీ ఆర్టికల్ the ని ఏక మరియు బహువచన నామవాచకాల ముందు ఉపయోగించవచ్చు.

Use the article the when a particular noun has already been mentioned previously I ate an apple yesterday. The apple was juicy and delicious.
Use the article the when the noun refers to something or someone that is unique the theory of relativity.
the 2003 federal budget.
Use the article the when an adjective, phrase, or clause describing the noun clarifies or restricts its identity The boy sitting next to me raised his hand.
Thank you for the advice you gave me.
Use before  particularly band names The Google, The  samsung, The Amazon
Use Before Job title or Ofice name The President, The Judge, The Director
The Parliament, The Court, The Accounts section
  • The ని సాధారణ పేర్ల ముందు ఉపయోగించకూడదు. అంటే వ్యక్తులు, దేశాలు, ఖండాలు, ఊర్లు, భాషల ముందు "The" ని ఉపయోగించకూడదు. కానీ ఈ పేర్ల ముందు ఏదైనా adjective ఉండే సందర్భాలలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు The ఇండియా అనకూడదు కానీ The beautiful India అనొచ్చు.
  • దేశాల పేర్ల ముందు the రాదు. కానీ, ఆ దేశాలు రిపబ్లిక్, స్టేట్స్, కింగ్డమ్ అనే పేర్లతో ఉంటె, వాటి ముందు The ని ఉపయోగించాలి. ఉదాహరణకు The republic of China. The united states of america, The united Kingdom.
  • అలానే దేశాల పేర్లను పొడి అక్షరాలతో చెప్పేటప్పుడు కూడా The ఉపయోగించాలి. Ex : The USA , The UK, The UAE
  • బహు వచనంగా ఉండే దేశాల ముందు, దీవుల పేర్ల ముందు కూడా The ఉపయోగించాలి. Ex : The Netherlands, The Phillippines.
  • అలానే నదులు, సముద్రాలు,  పర్వతాలూ వంటి ప్రకృతి సహజమైన ప్రాంతాల పేర్ల ముందు The వస్తుంది. Ex : The Ganga, The Himalayas, The Arebian sea etc.
  • ప్రకృతిలో ఏకైక అంశాలుగా ఉండే వాటి ముందు కూడా the ని ఉపయోగించాలి.  Ex : The Sun, The Sky, The Earth.
  • మత గ్రంథాల పేర్ల ముందు కూడా The ని ఉపయోగించాలి.  Ex : The Ramayana, The bible, The koran.
  • అందరికి తెలిసిన, అందరు వాడే స్థలాల పేర్ల ముందు కూడా The ని ఉపయోగించాలి. Ex : The Bank, The Bus Stand, The Post office
  • అందరికి తెలిసిన సంస్థల పేర్ల ముందు కూడా The ని ఉపయోగించాలి.  Ex : The Police, The Army, The Navy, The capital, The  assembly.
  • సంగీత వాయిద్యాల పేర్ల ముందు కూడా The ఉపయోగించాలి. Ex : The veena, The tabala.
  • ఇంతో గానీ, స్కూల్లో గానీ, పలానా ప్రదేశం అని చెప్పేటప్పుడు The ఉపయోగించాలి. Ex : The kitchen, The Bedroom, The Class room.

ఇంగ్లీషులో స్పెల్లింగుల తల నొప్పిలాగే, ఈ ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించాలనే నియమాలు కూడా ఒకరకమైన తికమక వ్యవహారమే. ముఖ్యంగా పరాయి భాష వాళ్లకు. వీటిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, నిరంతర అభ్యసన ఒక్కటే పరిస్కారం. ఇంతటితో ఆర్టికల్స్ చాప్టర్ ముగిసింది.

3 Comments

Post Comment