Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 29 మార్చి 2023
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 29 మార్చి 2023

29 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

యూఎన్ ఆహార వ్యర్థాల సూచిక నివేదిక 2024

యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ యొక్క ఆహార వ్యర్థాల సూచిక నివేదిక 2024 ఇటీవలే విడుదల అయ్యింది. తాజా నివేదిక మానవాళిలో మూడింట ఒక వంతు మంది ఆహార అభద్రతకు దూరంగా ఉన్నట్లు నివేదించింది.

ఈ నివేదిక 2022లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడిన ఆహారంలో 19 శాతం వృధా చేయబడినట్లు నివేదించింది. అదే సమయంలో 783 మిలియన్ల మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నాట్లు వెల్లడించింది. 2022లో 1. 05 బిలియన్ మెట్రిక్ టన్నుల ఆహారం తినకుండా పారబోసినట్లు లెక్కలు చూపించింది.

ఈ ఆహార వ్యర్థాల సూచిక నివేదిక ప్రపంచ ఆహార వ్యవస్థలో ఒక క్లిష్టమైన డిస్‌కనెక్ట్‌ను హైలైట్ చేస్తుంది. మిలియన్ల మంది తమ కనీస ఆహార భద్రత కోసం కష్టపడుతుండగా, మరోవైపు ఉత్పత్తి చేయబడిన ఆహారంలో గణనీయమైన భాగం వినియోగదారులకు చేరడం లేదు. ఈ ఆహార వ్యర్థాలు ఆకలిని పెంచడమే కాకుండా విలువైన వనరులను వృధా చేసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి.

అయితే ఈ నివేదికలో కొన్ని సానుకూల సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ నివేదిక ముఖ్యంగా తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలలో ఆహార వ్యర్థాలపై అవగాహన ఏర్పడినట్లు పేర్కొంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం మరియు ఆహార పునఃపంపిణీ కార్యక్రమాలు ఆశాజనక పరిష్కారాలుగా ఉద్భవించినట్లు తెలిపింది. ఫుడ్ బ్యాంకింగ్ కెన్యా వంటి కార్యక్రమాలు ఆహార వ్యర్థాలు మరియు దాని ప్రభావాలను తగ్గించడంలో వాకీలక పాత్ర పోషిస్తున్నట్లు నివేదించింది.

ప్రపంచ స్థాయిలో ఆహార వ్యర్థాలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక నొక్కి చెబుతోంది. ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ నుండి వినియోగం మరియు పారవేయడం వరకు మొత్తం ఆహార వ్యవస్థలో సమగ్ర చర్య కోసం ఇది పిలుపునిస్తుంది.

పర్యావరణ పర్యవేక్షణ కోసం కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

ఉత్తర చైనాలోని షాంగ్సీలోని తైయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి పర్యావరణ పర్యవేక్షణ కోసం చైనా కొత్త ఉపగ్రహాన్ని మార్చి 27న విజయవంతంగా ప్రయోగించింది. యున్‌హై-3 (02) పేరుతొ ప్రయోగించిన ఈ ఉపగ్రహం వాతావరణం మరియు అంతరిక్ష పర్యావరణ పర్యవేక్షణ కోసం ఉపయోగించబడుతుంది.

యున్‌హై-3 02 ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్-6 రాకెట్ ద్వారా ముందుగా నిర్ణయించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం లాంగ్ మార్చ్ సిరీస్ క్యారియర్ రాకెట్ల యొక్క 514వ మిషన్, ఇది వాతావరణ మరియు సముద్ర పర్యావరణ సర్వేలు, అంతరిక్ష పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు నివారణ మరియు శాస్త్రీయ ప్రయోగాల కోసం ఉపయోగించబడుతుంది.

ఈ ప్రయోగం చైనా యొక్క పెరుగుతున్న అంతరిక్ష కార్యక్రమంలో మరో పురోగతిని సూచిస్తుంది మరియు అంతరిక్షం నుండి భూమి యొక్క వాతావరణాన్ని పర్యవేక్షించే సామర్థ్యాన్ని బలపరుస్తుంది. యున్‌హై-3 (02) ద్వారా సేకరించబడిన డేటా వాతావరణ మార్పు, అంతరిక్ష వాతావరణం మరియు సంభావ్య ప్రకృతి వైపరీత్యాల గురించి మన అవగాహనను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది.

18 కొత్త గ్లోబల్ జియోపార్క్‌లను గుర్తించిన యునెస్కో

యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఇటీవల 18 కొత్త సైట్‌లను యునెస్కో గ్లోబల్ జియోపార్కులగా ప్రకటించింది. ఈ జియోపార్క్‌లు బ్రెజిల్, చైనా, క్రొయేషియా మరియు అనేక యూరోపియన్ దేశాలతో సహా 11 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఏ కొత్త సైట్ల చేరికతో మొత్తం జియోపార్క్‌ల సంఖ్య 195 కి చేరుకుంది.

యునెస్కో యొక్క ఈ గుర్తింపు ఈ 18 కొత్త సైట్‌లను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చింది, ఈ గుర్తింపు వాటి భౌగోళిక ప్రాముఖ్యతను ప్రోత్సహించడం మరియు స్థానిక కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూర్చే స్థిరమైన అభివృద్ధి పద్ధతులను అవలంభించడానికి తోడ్పడుతుంది. ఈ జాబితాలో ఇండియా నుండి ఒక్క సైట్ కూడా గుర్తించబడలేదు.

  1. కాకాపవా జియోపార్క్ (బ్రెజిల్)
  2. క్వార్టా కొలోనియా జియోపార్క్ (బ్రెజిల్)
  3. లావ్రోటికి జియోపార్క్ (గ్రీస్)
  4. ఇజెన్ జియోపార్క్ (ఇండోనేషియా)
  5. మారోస్ పాంగ్కెప్ జియోపార్క్ (ఇండోనేషియా)
  6. మెరాంగిన్ జంబి జియోపార్క్ (ఇండోనేషియా)
  7. రాజా అంపట్ జియోపార్క్ (ఇండోనేషియా)
  8. అరస్ జియోపార్క్ (ఇరాన్)
  9. తబాస్ జియోపార్క్ (ఇరాన్)
  10. హకుసన్ టెడోరిగావా జియోపార్క్ (జపాన్)
  11. కినాబాలు జియోపార్క్ (మలేషియా)
  12. వైటాకి వైట్‌స్టోన్ జియోపార్క్ (న్యూజిలాండ్)
  13. సన్‌హార్డ్‌ల్యాండ్ జియోపార్క్ (నార్వే)
  14. బోహోల్ ఐలాండ్ జియోపార్క్ (ఫిలిప్పీన్స్)
  15. జియోన్‌బుక్ వెస్ట్ కోస్ట్ జియోపార్క్ (రిపబ్లిక్ ఆఫ్ కొరియా)
  16. కాబో ఒర్టెగల్ జియోపార్క్ (స్పెయిన్)
  17. ఖోరత్ జియోపార్క్ (థాయిలాండ్)
  18. మోర్నే గులియన్, స్ట్రాంగ్‌ఫోర్డ్ (యునైటెడ్ కింగ్‌డమ్)

బ్రస్సెల్స్‌లో తొలి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024

బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో తొలి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024 నిర్వహించబడింది. ఈ ప్రారంభ అణుశక్తి సదస్సు కోసం 34 దేశాల నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంకు అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మరియు బెల్జియం ప్రభుత్వం సహా అధ్యక్షత వహించాయి.

ఈ సమ్మిట్ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో అణుశక్తి పాత్రకు సంబంధించిన సంభాషణను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అలానే శీతోష్ణస్థితి మార్పుల యొక్క ఆవశ్యకత మరియు ఇంధన భద్రత ఆవశ్యకత ఈ సమ్మిట్ అంతటా ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి, ఇంధన భద్రతను పెంపొందించడానికి మరియు ఆర్థికాభివృద్ధిని పెంచడానికి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో అణుశక్తి పాత్రను హైలైట్ చేయడానికి ఈ సమ్మిట్ యందు కీలక చర్చలు చోటు చేసుకున్నాయి.

ఈ సమావేశంలో బెల్జియం ప్రధాన మంత్రి అలెగ్జాండర్ డి క్రూ మరియు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో ​​గ్రాస్సీ సహ-అధ్యక్షుడులుగా వ్యవహరించారు. ఈ సమ్మిట్ ఇప్పటి వరకు అణుశక్తి అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అత్యున్నత స్థాయి సమావేశం.

2023 డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన యూఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్ 28)లో గ్లోబల్ స్టాక్‌టేక్‌లో అణుశక్తిని చారిత్రాత్మకంగా చేర్చిన నేపథ్యంలో ఈ సమ్మిట్ చోటు చేసుకుంది. అణు కర్మాగార భద్రత కోసం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇది ప్రధానంగా దృష్టి సారించింది.

తొలి స్వదేశీ స్వైన్ ఫీవర్ వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి

ఐఐటీ గౌహతి పరిశోధకులు స్వైన్ ఫీవర్ వైరస్ కోసం తొలి స్వదేశీ వ్యాక్సిన్ రూపొందించారు. ఇది భారతదేశంలో స్వైన్ ఫీవర్‌కు వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి రీకాంబినెంట్ వ్యాక్సిన్‌. అత్యంత ప్రమాదకరమైన ఈ అంటువ్యాధి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఈశాన్య మరియు బీహార్, కేరళ, పంజాబ్, హర్యానా మరియు గుజరాత్‌లలో పందుల మరణాలకు కారణమవుతుంది.

ఐఐటీ గౌహతి అస్సాం అగ్రికల్చరల్ యూనివర్శిటీ సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. వినూత్నమైన రివర్స్ జెనెటిక్స్‌ను ఉపయోగించి, స్వైన్ ఫీవర్ వైరస్ యొక్క కీలకమైన ప్రోటీన్‌లకు న్యూకాజిల్ వ్యాధి వైరస్‌ను క్యారియర్‌గా మార్చి ఈ నివారణ అభివృద్ధి చేసింది. ఈ పద్ధతి వేగంగా మరియు తక్కువ ఖర్చుతో కూడిన రోగనిరోధక శక్తిని అందిస్తుంది.

ఐఐటీ గౌహతి ఈ మార్గదర్శక పరిశోధన డేటాను బయోమెడ్ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థకు బదిలీ చేసింది. ఈ సంస్థ వీటిని మరింత మెరుగుపర్చి త్వరలో స్వైన్ ఫీవర్ వైరస్ టీకాను అందుబాటులోకి తేనుంది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు శాశ్వత వాక్సిన్ లేదు.

స్వైన్ ఫీవర్ అనేది దేశీయ మరియు అడవి పందుల యొక్క అత్యంత ప్రమాదకరమైన వైరల్ అంటువ్యాధి. దీని మరణాల రేటు 100 శాతం. దీనిని హాగ్ కలరా అని కూడా పిలుస్తారు. అయితే ఇది మానవ ఆరోగ్యానికి ముప్పు కాదు మరియు పందుల నుండి మానవులకు వ్యాపించదు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ & సీఈఓగా నిధు సక్సేనా

కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా నిధు సక్సేనా నియమితులయ్యారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో విజిలెన్స్ కమీషనర్‌గా నియమితులైన ఎఎస్ రాజీవ్ స్థానంలో ఆయన మార్చి 27, 2024న పదవీ బాధ్యతలు స్వీకరించారు. సక్సేనా ఇది వరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందించారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది పూణేలో ప్రధాన కార్యాలయంగా సేవలు అందిస్తున్న భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ బ్యాంక్ 2263 శాఖలతో దేశవ్యాప్తంగా 30 మిలియన్ల మంది కస్టమర్‌లను కలిగి ఉంది. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని జాతీయీకరించిన బ్యాంకుల యొక్క అతిపెద్ద నెట్‌వర్క్ బ్రాంచ్‌లను కలిగి ఉంది.

Post Comment