యూజీసీ పీజీ స్కాలర్షిప్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ స్టూడెంట్స్
Scholarships

యూజీసీ పీజీ స్కాలర్షిప్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ స్టూడెంట్స్

యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గుర్తింపు కలిగిన యూనివర్సిటీలు మరియు ఇనిస్టిట్యూట్లలో గ్రాడ్యుయేషన్ యందు మొదటి రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉన్నత విద్య ప్రోత్సహకంగా స్కాలర్షిప్ అందిస్తుంది. ఈ స్కాలర్షిప్ స్కీమ్ పరిధిలో బీఏ, బీఎస్సీ, బీకామ్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచి, ఆ సబ్జెక్టులకు చెందిన పీజీ కోర్సులలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు యూజీసీ ప్రతి నెల 3,100/- చెప్పున ఏడాదికి 48 వేలు స్టైపెండ్ అందిస్తుంది. ఈ పథకం కింద రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 3000 మంది విద్యార్థులకు మాత్రమే లబ్ది చేకూర్చుస్తారు.

స్కాలర్షిప్ పేరు యూజీసీ పీజీ స్కాలర్షిప్ ఫర్ యూనివర్సిటీ ర్యాంక్ స్టూడెంట్స్
ఎవరు అర్హులు యూనివర్సిటీల 1st & 2nd ర్యాంక్ స్టూడెంట్స్
దరఖాస్తు ముగింపు తేదీ 15-01-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 31-01-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 31-01-2022

ప్రతిభావంతులైన యూనివర్సిటీ విద్యార్థులు ఆర్థిక కారణాలతో ఉన్నత విద్యకు దూరం కాకుండా ఉండేందుకు ఈ పథకాన్ని యూజీసీ ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్షిప్ యూజీసీ గుర్తింపు పొందిన స్టేట్ & సెంట్రల్ అనుబంధ యూనివర్సిటీలు, డ్రీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు మరియు అటానమస్ యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేషన్ చదివి, మొదటి రెండు ర్యాంకర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ స్కాలర్షిప్ గరిష్టంగా రెండేళ్లకు మాత్రమే అందిస్తారు. విద్యార్థి మొదటి ఏడాది అకాడమిక్ పరీక్షల్లో 60 శాతం కంటే తక్కువ మార్కులు సాధిస్తే, రెండవ ఏడాదికి ఈ స్కాలర్షిప్ రద్దు చేస్తారు.

Considered from Universities/ Institutions and non-affiliated/ autonomous colleges

Nature of Institution Number of students who appeared in examination at undergraduate level
Affiliating Universities (State/ Central) 100
Deemed Universities/ Private Universities / 25 Autonomous Colleges / Non-affiliated colleges 25

 

Identified Undergraduate courses
1.Life Sciences 2. Physical Sciences 3. Chemical Sciences 4. Earth Sciences 5. Mathematical Sciences 6. Social Sciences 7. Commerce 8. Languages

ఎలిజిబిలిటీ

యూజీసీ గుర్తింపు పొందిన స్టేట్ & సెంట్రల్ అనుబంధ యూనివర్సిటీలు, డ్రీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు మరియు అటానమస్ యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేషన్ చదివి, యూనివర్సిటీ మొదటి రెండు ర్యాంకర్లుగా నిలిచినా విద్యార్థులు అర్హులు. పీజీ అడ్మిషన్ పొందే సమయానికి విద్యార్థి వయస్సు గరిష్టంగా 30 ఏళ్ళు మించకూడదు. ఈ స్కాలర్షిప్ రెగ్యులర్ పీజీ స్టూడెంట్లకు మాత్రమే అందిస్తారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ కోర్సులకు వర్తించదు.

దరఖాస్తు విధానం

అర్హుత ఉండే విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని సక్రమంగా ఉండే దరఖాస్తులు, పలు దశల వెరిఫికేషన్ తర్వాత విద్యార్థి వయస్సు మరియు మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ అందిస్తారు. దరఖాస్తు చేసే ముందు మొబైల్ నెంబర్ లింక్డ్ ఆధార్ కార్డు, మొబైల్ లింక్డ్ బ్యాంకు అకౌంట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అకాడమిక్ సర్టిఫికెట్లు అందుబటులో ఉంచుకోండి. ఈ స్కీమ్ చెందిన పూర్తి సమాచారం యూజీసీ పోర్టల్ యందు అందుబాటులో ఉంటుంది.

Post Comment