Advertisement
February 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023 Telugu Current Affairs

February 2023 Current Affairs Questions In Telugu

కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2023 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు సమాధానాలను సాధన చేయండి. ఫిబ్రవరి 2023 నెలలో  చోటుచేసుకున్న సమకాలిన అంశాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు జవాబులను మీ కోసం అందిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

1. డిజిటల్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన మొదటి కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు ?

  1. మన్మోహన్ సింగ్
  2. అరుణ్ జైట్లీ
  3. నిర్మలా సీతారామన్
  4. ఆర్కే షణ్ముఖం చెట్టి
సమాధానం
3. నిర్మలా సీతారామన్  

2. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రారంభించిన నూతన ప్రోగ్రామ్ ?

  1. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌
  2. ఆస్పిరేషనల్ విల్లెజ్ ప్రోగ్రామ్‌
  3. ఆస్పిరేషనల్ పంచాయత్ ప్రోగ్రామ్‌
  4. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌
సమాధానం
4. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌  

3. గిరిజన ఎస్టీ విద్యార్థుల కోసం దేశంలో నిర్వహిస్తున్న పాఠశాలలు ఏవి ?

  1. జవహర్ నవోదయ విద్యాలయలు
  2. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళు
  3. మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూళ్ళు
  4. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలు
సమాధానం
2. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళు 

4. రామ్‌సర్‌ సిటీ ఏ దేశంలో ఉంది ?

  1. ఇండియా
  2.  ఆస్ట్రేలియా
  3. ఇరాన్‌
  4. ఇరాక్
సమాధానం
3. ఇరాన్‌  

5. సరోజినీ నాయుడు పుట్టినరోజున నిర్వహించే జాతీయ వేడుక ఏది ?

  1. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్
  2. ఇంటర్నేషనల్ మథర్ లాంగ్వేజ్ డే
  3. నేషనల్ సివిల్ సర్వీస్ డే
  4. భారత జాతీయ మహిళా దినోత్సవం
సమాధానం
4. భారత జాతీయ మహిళా దినోత్సవం  

6. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ తోలి విజేత ఎవరు ?

  1. ఆస్ట్రేలియా
  2. ఇంగ్లాండ్
  3. ఇండియా
  4. దక్షిణాఫ్రికా
సమాధానం
3. ఇండియా 

7. రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ నూతన పేరు ఏంటి ?

  1. బృందావన్ గార్డెన్
  2. మహాత్మా గాంధీ ఉద్యాన్
  3. అమృత్ ఉద్యాన్
  4. రాయల్ గార్డెన్
సమాధానం
3. అమృత్ ఉద్యాన్  

8. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ?

  1. 6.0 శాతం నుండి 6.8 శాతం
  2. 5.4 శాతం నుండి 5.6 శాతం
  3. 6.5 శాతం నుండి 7.0 శాతం
  4. 5.6 శాతం నుండి 6.0 శాతం
సమాధానం
1. 6.0 శాతం నుండి 6.8 శాతం

9. తొలి షేన్ వార్న్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు విజేత ?

  1. డేవిడ్ వార్నర్
  2. ఆరోన్ ఫించ్
  3. నాథన్ లియోన్
  4. ఉస్మాన్ ఖవాజా
సమాధానం
4. ఉస్మాన్ ఖవాజా  

10. హాకీ ప్రపంచ కప్ 2023 కు ఆతిధ్యం ఇచ్చిన దేశం ఏది ?

  1. ఇండియా
  2. దక్షిణాఫ్రికా
  3. పాకిస్తాన్
  4. ఇండోనేషియా
సమాధానం
1. ఇండియా 

11. కొత్త డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ?

  1. ప్రశాంత్ అగర్వాల్
  2. రాజీవ్ సింగ్ రఘువంశీ
  3. వీజీ సోమాని
  4. కిషోర్ కుమార్ పోలుదాసు
సమాధానం
2. రాజీవ్ సింగ్ రఘువంశీ  

12. తెలంగాణలో తొలి కేజీ టు పీజీ క్యాంపస్‌ ఎక్కడ ప్రారంభించారు ?

  1. బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా)
  2. వనపర్తి (వనపర్తి జిల్లా)
  3. వడ్డాది గ్రామం (ఆదిలాబాద్ జిల్లా)
  4. గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా)
సమాధానం
4. గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల)  

13. కింది వారిలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరు ?

  1. కె. విశ్వనాథ్
  2. అక్కినేని నాగేశ్వర రావు
  3. డాక్టర్ రామానాయడు
  4. పై అందరూ
సమాధానం
4. పై అందరూ 

14. సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఏటా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?

  1. గుజరాత్
  2. రాజస్థాన్
  3. హర్యానా
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
3. హర్యానా 

15. 6వ షాంఘై సహకార సంస్థ నాయకుల సమావేశం ఏ నగరంలో నిర్వహించారు ?

  1. వారణాసి
  2. లక్నో
  3. బెంగుళూరు
  4. హైదరాబాద్
సమాధానం
2. లక్నో

16. యువ సంగం పోర్టల్ కింది వాటిలో దేనికి సంబంధించింది ?

  1. యూత్ ఎంటెప్రెన్యూర్ ఆస్పిరేషన్ ప్రోగ్రాం
  2. యువతకు క్రాస్ కల్చరల్ లెర్నింగ్ పేరిట దేశ వ్యాప్తంగా పర్యటించే అవకాశం
  3. ఈశాన్య ప్రాంత యువతతో మిగిలిన భారతదే యువత మమేకం
  4. ఆప్షన్ 2 మరియు 3 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 2 మరియు 3 సరైనవి  

17. రిక్టర్ స్కేల్ ఈ కింది వాటిలో దేనిని కొలిచేందుకు ఉపయోగిస్తారు ?

  1. సునామీ త్రీవ్రత
  2. తుపానుల తీవ్రత
  3. భూకంపాల తీవ్రత
  4. వరద ప్రవాహాల తీవ్రత
సమాధానం
3. భూకంపాల తీవ్రత 

18. ప్రపంచ పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది ?

  1. ఇండియా
  2. ఇండోనేషియా
  3. బ్రెజిల్
  4. చైనా
సమాధానం
1. ఇండియా

19. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసింది ఎవరు ?

  1. బిశ్వ భూషణ్ హరిచందన్
  2. రమేష్ బైస్
  3. గులాబ్ చంద్ కటారియా
  4. ఎస్. అబ్దుల్ నజీర్‌
సమాధానం
4. ఎస్. అబ్దుల్ నజీర్‌  

20. కెనరా బ్యాంకు కొత్త ఎండీ & సీఈఓ ఎవరు ?

  1. కె సత్యనారాయణ రాజు
  2. సంజీవ్ చద్దా
  3. అతుల్ కుమార్ గోయల్
  4. శ్యామ్ శ్రీనివాసన్
సమాధానం
1. కె సత్యనారాయణ రాజు  

21. ఇటీవలే రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డు అందుకున్న తెలుగు జర్నలిస్ట్ ?

  1. తెలకపల్లి రవి
  2. ఎబికె ప్రసాద్‌
  3. అల్లం నారాయణ
  4. కట్టా శేఖర్ రెడ్డి
సమాధానం
2. ఎబికె ప్రసాద్‌  

22. బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడు ఎవరు ?

  1. అబ్దుల్ హమీద్
  2. తారీక్ రెహమాన్
  3. షేక్ హసీనా
  4. మహ్మద్ షహబుద్దీన్
సమాధానం
4. మహ్మద్ షహబుద్దీన్  

23. ఇటీవలే టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?

  1. తెలంగాణ
  2. కేరళ
  3. ఆంధ్రప్రదేశ్
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
3. ఆంధ్రప్రదేశ్ 

24. ఖనన్ ప్రహరీ మొబైల్ యాప్ దేనికి సంబంధించింది ?

  1. అనధికార బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను నివేదించడం కోసం
  2. అనధికార డ్రగ్స్ కార్యకలాపాలను నివేదించడం కోసం
  3. అనధికార నల్లధన కార్యకలాపాలను నివేదించడం కోసం
  4. అనధికార మద్యం మాఫియాను నివేదించడం కోసం
సమాధానం
1. అనధికార బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను నివేదించడం కోసం  

25. దేశంలో యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి బ్యాంకు ?

  1. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
  2. ఐసిఐసిఐ బ్యాంకు
  3. పేటీఎం పేమెంట్ బ్యాంకు
  4. ఫెడరల్ బ్యాంకు
సమాధానం
3. పేటీఎం పేమెంట్ బ్యాంకు

26. గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023కు ఆతిధ్యం ఇచ్చిన నగరం ఏది ?

  1. హైదరాబాద్
  2. బెంగుళూర్
  3. గాంధీ నగర్
  4. విశాఖపట్నం
సమాధానం
4. విశాఖపట్నం 

27. ధర్మ గార్డియన్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ యందు ఏ రెండు దేశాలు పాల్గొన్నాయి ?

  1. ఇండియా - దక్షిణాఫ్రికా
  2. ఇండియా - జపాన్
  3. ఇండియా - రష్యా
  4. ఇండియా - ఆస్ట్రేలియా
సమాధానం
2. ఇండియా - జపాన్  

28. యునిసెఫ్‌ నూతన  బాలల హక్కుల జాతీయ అంబాసిడర్‌ ?

  1. దీపికా పదుకునే
  2. సోను సూద్
  3. అమితాబ్ బచ్చన్
  4. ఆయుష్మాన్ ఖురానా
సమాధానం
4. ఆయుష్మాన్ ఖురానా

29. అంతర్జాతీయ మదర్ లాంగ్వేజ్ అవార్డు అందుకున్న తోలి భారతీయుడు ?

  1. కార్తీక్ సుబ్రమణ్యం
  2. రంజిత్ సింఘా
  3. హబీబుర్ రెహమాన్
  4. డాక్టర్ మహేంద్ర కుమార్ మిశ్రా
సమాధానం
4. డాక్టర్ మహేంద్ర కుమార్ మిశ్రా  

30. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఎవరికి అందిస్తారు ?

  1. సీనియర్ శాస్త్రవేత్తలకు
  2. సీనియర్ రాజకీయ నాయకులకు
  3. సీనియర్ ప్రభుత్వ అధికారులకు
  4. సీనియర్ ఉపాధ్యాయలకు
సమాధానం
2 సీనియర్ రాజకీయ నాయకులకు  

5 Comments

Post Comment