ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్, ఆర్‌డీసీ సెట్‌ 2023
School Education

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్, ఆర్‌డీసీ సెట్‌ 2023

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలలో మొదటి ఏడాది అడ్మిషన్ నిర్వహించేందుకు జరిపే ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్, ఆర్‌డీసీ సెట్‌ 2023 నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 27 నుండి 16 ఏప్రిల్ 2022 మధ్య ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తున్నారు.

2023 లో ఉత్తీర్ణత పొందిన పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అడ్మిషన్ ప్రక్రియ ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్, ఆర్‌డీసీ సెట్‌ యందు సాధించిన మెరిట్ ఆధారితంగా ఉంటుంది.

బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు : తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 255 బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 130 బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు బాలురులకు, 125 బీసీ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు బాలికలకు కేటాయించారు. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ మరియు ఇతర ఒకేషనల్ కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో అందిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు..

  • అగ్రికల్చర్ & క్రాప్ ప్రొడక్షన్
  • కంప్యూటర్ గ్రాఫిక్స్ & యానిమేషన్
  • ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్
  • కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ
  • మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (MPHW)
  • మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్
  • ఫిజియోథెరపీ
  • టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్

బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు : తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 14 బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 8 బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు అబ్బాయిలకు, 5 బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు అమ్మాయిలకు కేటాయించారు. వీటిలో దాదాపు 25 రకాల బీఎస్సీ ఫీజికల్ సైన్సెస్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఏ, బీకామ్, బీబీఏ మరియు బీఎ కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో అందిస్తున్నారు.

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్, ఆర్‌డీసీ సెట్‌ 2023 షెడ్యూల్

ఎంజేపీటీబీసీడబ్ల్యూ సెట్ దరఖాస్తు ప్రారంభం 27 ఫిబ్రవరి 2023
ఎంజేపీటీబీసీడబ్ల్యూ సెట్ దరఖాస్తు గడువు 16 ఏప్రిల్ 2023
ఎంజేపీటీబీసీడబ్ల్యూ సెట్ హాల్ టికెట్ 20 ఏప్రిల్ 2023
ఆర్‌జేసీ సెట్ పరీక్ష తేదీ 29 ఏప్రిల్ 2023 (ఉ 10 నుండి 12.30)
ఆర్‌జేసీ సెట్ పరీక్ష తేదీ 29 ఏప్రిల్ 2023 (ఉ 10 నుండి 12.30)

బీసీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ కాలేజీల ప్రత్యేకతలు

  • రెసిడెన్సియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పూర్తిస్థాయి ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుంది.
  • ప్రవేశం పొందే విద్యార్థులకు కోర్సు పూర్తియ్యే వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.
  • విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం విద్యతో పాటుగా క్రీడలు, ఇతర నైపుణ్యాభివృది అంశాలలో భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే తర్పీదు అందిస్తారు.
  • ఈ సంస్థల్లో అడ్మిషన్ల కోసం ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హుత పొందిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
  • ఇంటర్ & డిగ్రీ ఎడ్యుకేషన్ పూర్తి ఇంగ్లీష్ మీడియంలో అందిస్తారు.

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్, ఆర్‌డీసీ సెట్‌ ఎలిజిబిలిటీ

  • విద్యార్థులు ప్రస్తుత ఏడాది పబ్లిక్ పరీక్షల్లో పది & ఇంటర్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • జనరల్ విద్యార్డులు పదిలో లేదా ఇంటర్ యందు కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాలి.
  • దీనితో పాటుగా ఇంగ్లీష్ సబ్జెక్టు యందు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 50% మార్కులు  సాధించి ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష ఏభైవేలు (రూరల్), రెండు లక్షలు (అర్బన్) రూపాలకు మించకూడదు.
  • తెలుగు మరియు ఇంగ్లీష్  మీడియంలో పది చదువుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
  • విద్యార్థి వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
  • సీటు సాధించిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.
  • మెజారిటీ సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయిస్తారు.

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్, ఆర్‌డీసీ సెట్‌ దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. అర్హుత కలిగిన విద్యార్థులు www.mjpabcwreis.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు మొదటి దశలో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాలి. రెండవ దశలో పరీక్షకు సంబంధించి ఎంపికలను నమోదు చేసుకోవాలి. చివరిగా పరీక్ష రుసుము చెల్లించడం దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.

మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు. ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-100 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి. అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.

పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి. నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

దరఖాస్తు రుసుము : 200/- (దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.)

పరీక్ష కేంద్రాలు : పరీక్ష కేంద్రాలు 10 పాత జిల్లా కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉంటాయి. 1) ఆదిలాబాద్, 2) వరంగల్, 3) కరీంనగర్, 4) ఖమ్మం, 5) నిజామాబాద్, 6) నల్గొండ, 7) మహబూబ్ నగర్, 8) హైదరాబాద్,9) సంగారెడ్డి 10) సిద్దిపేట, 11) మెదక్

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్ ఎగ్జామ్ నమూనా

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌జేసీ సెట్ ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ యందు నిర్వహిస్తుంది. పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 2.30 గంటల నిడివితో ఉంటుంది.

ప్రశ్నలు పదివ తరగతి స్థాయిలో గణితం, సోషల్, బయోలాజికల్ సైన్స్, ఫీజికల్ సైన్స్, ఇంగ్లీష్ గ్రామర్ అంశాల నుండి ఇవ్వబడతాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు.

ఇంటర్ గ్రూపు & పేపర్ సబ్జెక్టు / సిలబస్ మార్కులు
ఎంపీసీ గ్రూపు కోసం  ఇంగ్లీష్ + మ్యాథ్స్ + ఫీజికల్ సైన్స్ 150 మార్కులు
బైపీసీ గ్రూపు కోసం  ఇంగ్లీష్ + బయోలాజికల్ సైన్స్ + ఫీజికల్ సైన్స్ 150 మార్కులు
ఎంఈసీ గ్రూపు కోసం  ఇంగ్లీష్ + మ్యాథ్స్ + సోషల్ స్టడీస్ 150 మార్కులు
సీఈసీ గ్రూపు కోసం ఇంగ్లీష్ + మ్యాథ్స్ + సోషల్ స్టడీస్ 150 మార్కులు
హెచ్ఈసీ గ్రూపు కోసం ఇంగ్లీష్ + మ్యాథ్స్ + సోషల్ స్టడీస్ 150 మార్కులు
ఏసీపీ గ్రూపు కోసం ఇంగ్లీష్ + బయాలజీ  + సోషల్ స్టడీస్ 150 మార్కులు
సీజీఏ గ్రూపు కోసం ఇంగ్లీష్ + మ్యాథ్స్ + సోషల్ స్టడీస్ 150 మార్కులు
ఎంపీహెచ్డబ్ల్యు గ్రూపు కోసం ఇంగ్లీష్ + బయాలజీ  + ఫీజికల్ సైన్సెస్ 150 మార్కులు
ఎంఎల్‌టి గ్రూపు కోసం ఇంగ్లీష్ + బయాలజీ  + ఫీజికల్ సైన్సెస్ 150 మార్కులు
పీటీ గ్రూపు కోసం  ఇంగ్లీష్ + బయాలజీ  + ఫీజికల్ సైన్సెస్ 150 మార్కులు
పీఎస్టీటీ గ్రూపు కోసం ఇంగ్లీష్ + మ్యాథ్స్  + సోషల్ స్టడీస్ 150 మార్కులు
టీ & హెచ్ గ్రూపు కోసం ఇంగ్లీష్ + బయాలజీ  + సోషల్ స్టడీస్ 150 మార్కులు
సీజీటీ గ్రూపు కోసం ఇంగ్లీష్ + మ్యాథ్స్  + సోషల్ స్టడీస్ 150 మార్కులు

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌డీసీ సెట్‌ ఎగ్జామ్ నమూనా

ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌డీసీ సెట్‌ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ యందు నిర్వహిస్తుంది. పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 2.30 గంటల నిడివితో ఉంటుంది.

ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న గ్రూపు సబ్జెక్టుల నుండి మరియు ఇంగ్లీష్ గ్రామర్ అంశాల నుండి ఇవ్వబడతాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు.

ఆర్‌డీసీ సెట్‌ సబ్జెక్టు / సిలబస్ మార్కులు
ఇంగ్లీష్ + 3 ఆప్షనల్ పేపర్లు  ఇంగ్లీష్ (30 మార్కులు)
ఆప్షనల్ పేపర్ I - 40మార్కులు
ఆప్షనల్ పేపర్ II - 40మార్కులు
ఆప్షనల్ పేపర్ III - 40మార్కులు
150 మార్కులు

ఆర్‌డీసీ సెట్‌ గ్రూపులు మరియు సబ్జెక్టు కంబినేషన్లు

  • B.Sc.(MPC) : ఇంగ్లీష్, మ్యాథ్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ
  • B.Sc.(MPCS) : ఇంగ్లీష్, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
  • B.Sc.(MSCS) : ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ విద్యార్థులు) & ఇంగ్లీష్, గణితం, ఆర్థిక శాస్త్రం & కామర్స్ (ఎంఈసీ విద్యార్థులకు)
  • B.Sc. (MSDS) : ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ విద్యార్థులు) & ఇంగ్లీష్, గణితం, ఆర్థిక శాస్త్రం & కామర్స్ (ఎంఈసీ విద్యార్థులకు)
  • B.Sc. (AI&ML) : ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ విద్యార్థులు) & ఇంగ్లీష్, గణితం, ఆర్థిక శాస్త్రం & కామర్స్ (ఎంఈసీ విద్యార్థులకు)
  • B.Sc.(MPG) : ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ విద్యార్థులు) & ఇంగ్లీష్, గణితం, ఆర్థిక శాస్త్రం & కామర్స్ (ఎంఈసీ విద్యార్థులకు)
  • B.Sc.(MECS) : ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ విద్యార్థులు) & ఇంగ్లీష్, గణితం, ఆర్థిక శాస్త్రం & కామర్స్ (ఎంఈసీ విద్యార్థులకు)
  • B.Sc.(MES) : ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ విద్యార్థులు) & ఇంగ్లీష్, గణితం, ఆర్థిక శాస్త్రం & కామర్స్ (ఎంఈసీ విద్యార్థులకు)
  • B.Sc.(BZC) : ఇంగ్లీష్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ
  • B.Sc.(MBZC) : ఇంగ్లీష్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ
  • B.Sc.(NZC) : ఇంగ్లీష్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ
  • B.Sc.(BZG) : ఇంగ్లీష్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ
  •  B.Sc. (ANPHBC) : ఇంగ్లీష్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ
  • B.Sc.(BTZC) : ఇంగ్లీష్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ
  • B.Sc.(BBCC) : ఇంగ్లీష్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ
  • B.Sc.(BTBCC) : ఇంగ్లీష్, బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ
  • B.Com (Gen) : ఇంగ్లీష్, ఎకనామిక్స్ & కామర్స్
  • B.Com (CA) : ఇంగ్లీష్, ఎకనామిక్స్ & కామర్స్
  • B.Com (BA) : ఇంగ్లీష్, ఎకనామిక్స్ & కామర్స్
  • BBA : ఇంగ్లీష్, ఎకనామిక్స్ & కామర్స్
  • B.A (EPH) : ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్
  • B.A (IREP) : ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్
  • B.A(PPGEP) : ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్
  • B.A (HPE) : ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్
  • BFT : ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్

Post Comment