భారతదేశ రాష్ట్రాలు మరియు రాజధానులు | పోటీపరీక్షల ప్రత్యేకం
Study Material

భారతదేశ రాష్ట్రాలు మరియు రాజధానులు | పోటీపరీక్షల ప్రత్యేకం

భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. జమ్మూ మరియు కాశ్మీర్ , పుదుచ్చేరి మరియు ఢిల్లీలు కేంద్రపాలిత ప్రాంతాలు అయినప్పటికీ, రాష్ట్రాల వలె ముఖ్యమంత్రితో కూడిన ప్రభుత్వాలను ఎన్నుకుంటాయి. మిగిలిన ఐదు కేంద్రపాలిత ప్రాంతాలను లెఫ్టనెంట్ గవర్నర్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం పాలిస్తుంది.

1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలుగా విభజించబడి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ , మహారాష్ట్ర మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల యొక్క శాసనసభలు వేసవి మరియు శీతాకాల సమావేశాల కోసం వేర్వేరు రాజధానులలో సమావేశమవుతాయి. లడఖ్‌కు లెహ్ మరియు కార్గిల్ రెండూ పరిపాలనా రాజధానులుగా ఉన్నాయి.

రాష్ట్రాలు మరియు రాజధానులు

రాష్ట్రం రాజధాని రాష్ట్రం ఆవిర్భావం
ఆంధ్రప్రదేశ్ అమరావతి 1956
అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ 1987
అస్సాం దిస్పూర్ 1972
బీహార్ పాట్నా 1950
ఛత్తీస్‌గఢ్ రాయపూర్ 2000
గోవా పనాజీ 1987
గుజరాత్ గాంధీనగర్ 1960
హర్యానా చండీగఢ్ 1966
హిమాచల్ ప్రదేశ్ షిమ్లా 1971 & 2017
జార్ఖండ్ రాంచీ 2000
కర్ణాటక బెంగుళూరు 1956
కేరళ తిరువనంతపురం 1956
మధ్యప్రదేశ్ భూపాల్ 1956
మహారాష్ట్ర ముంబై 1960
మణిపూర్ ఇంపాల్ 1972
మేఘాలయ షిల్లాంగ్ 1972
మిజోరాం ఐజవల్ 1987
నాగాలాండ్ కోహిమా 1963
ఒడిశా భువనేశ్వర్ 1950
పంజాబ్ చండీగఢ్ 1966
రాజస్థాన్ జైపూర్ 1950
సిక్కిం గాంగ్టక్ 1975
తమిళనాడు చెన్నై 1956
తెలంగాణ హైదరాబాద్ 2014
త్రిపుర అగర్తలా 1972
ఉత్తరప్రదేశ్ లక్నో 1950
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ 2000 & 2020
పచ్చిమ బెంగాళ్ కోల్‌కతా 1950

కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాజధానులు

కేంద్రపాలిత ప్రాంతం రాజధాని ఆవిర్భావం
అండమాన్ మరియు నికోబార్ దీవులు పోర్ట్ బ్లెయిర్ 1956
చండీగఢ్ చండీగఢ్ 1966
దాద్రా & నగర్ హవేలి మరియు డామన్ & డియు డామన్ 2020
ఢిల్లీ న్యూఢిల్లీ 1956
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ (వేసవి) & జమ్మూ (శీతాకాలం) 2019
లఢక్ లేహ్ (వేసవి) & కార్గిల్ (శీతాకాలం) 2019
లక్షద్వీప్ కరవత్తి 1956
పుదుచ్చేరి పాండిచ్చేరి 1954

One Comment

Post Comment