తెలంగాణ సీఎం మరియు కేబినెట్ మంత్రుల జాబితా
Study Material

తెలంగాణ సీఎం మరియు కేబినెట్ మంత్రుల జాబితా

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 7 డిసెంబర్ 2023న హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి  ప్రమాణస్వీకారం చేసారు. ఆయనతో పాటు ఆయన పదకొండు మంది సభ్యుల మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేసింది.

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మూడవ మంత్రివర్గంకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇటీవలే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీని సాధించింది. రాష్ట్ర అసెంబ్లీలోని 119 సీట్లలో వీరి పార్టీ 64 స్థానాలను గెలుచుకుంది.

తెలంగాణలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 17 మంది సభ్యుల క్యాబినెట్ ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల కాలానికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికోబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా రాష్ట్ర గవర్నర్ నాయకత్వం వహిస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కార్యనిర్వాహక వ్యవస్థకు నిజమైన అధిపతిగా ఉంటారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిని మరియు ఆయన మంత్రిమండలిని గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ రాష్ట్రా అధిపతిగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ రోజువారీ నిర్వహణను ముఖ్యమంత్రి మరియు అతని మంత్రి మండలి చూసుకుంటుంది.

తెలంగాణ ద్విసభా పరిపాలన విధానాన్ని కలిగి ఉంది. అందులో దిగువ సభగా రాష్ట్ర అసెంబ్లీ (శాసనసభ / విధాన సభ), ఎగువ సభగా రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్ / విధాన పరిషత్) ఉంటాయి. తెలంగాణ యందు మొత్తం 119 మంది శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు), 40 మంది శాసన మండలి (ఎమ్యెల్సీలు) సభ్యులు ఎన్నుకోబడుతారు.

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సీఎం చీఫ్ అడ్వైజర్ -
తెలంగాణ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ -
తెలంగాణ కౌన్సిల్ ఛైర్మెన్ గుత్తా సుకేందర్ రెడ్డి
తెలంగాణ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మెన్ -
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే
తెలంగాణ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ సి.సుదర్శన్ రెడ్డి

తెలంగాణ మంత్రివర్గం 2024

మినిస్టర్ పేరు మంత్రిత్వ శాఖ నియోజకవర్గం
అనుముల రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ & ఎవరికి కేటాయించని శాఖలు కొడంగల్
మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం & ఫైనాన్స్, ప్లానింగ్, ఎనర్జీ మధిర (ఎస్సి)
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహారం & పౌర సరఫరాలు & నీటిపారుదల హుజూర్‌నగర్
దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటీ, పరిశ్రమలు & లెజిస్లేటివ్ అఫైర్స్ మంథని
కొండా సురేఖ అటవీ మరియు పర్యావరణం, దేవాదాయ వరంగల్ తూర్పు
దన్సరి అనసూయ (సీతక్క) పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ వెల్ఫేర్ & ట్రైబల్ ములుగు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ నల్గొండ
పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ హుస్నాబాద్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవిన్యూ & హౌసింగ్ పలైర్
దామోదర రాజ నరసింహ ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, సైన్స్ & టెక్నాలిజీ ఆందోల్ (ఎస్సీ)
జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్, టూరిజం కొల్లాపూర్
తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం & సహకారం, టెక్సటైల్స్ ఖమ్మం