యూజీసీ నెట్ జూన్ 2023 నోటిఫికేషన్ | రిజిస్ట్రేషన్ మరియు ఎగ్జామ్ వివరాలు
Admissions NTA Exams Research Entrance Exams

యూజీసీ నెట్ జూన్ 2023 నోటిఫికేషన్ | రిజిస్ట్రేషన్ మరియు ఎగ్జామ్ వివరాలు

యూజీసీ నెట్ జూన్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హుతకు జరిపే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ 10 మే 2023 నుండి ప్రారంభమై, 01 జూన్ 2023 తో ముగుస్తుంది. యూజీసీ నెట్ పరీక్షను జూన్ 13 & 22 వ తేదీల మధ్య నిర్వహించనున్నారు.

Advertisement

యూజీసీ నెట్ పరీక్షను భారత విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్) ప్రోగ్రాంలకు అర్హుత కల్పించేందుకు నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష  యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ ఆదేశాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  జరుపుతుంది. ఈ పరీక్ష దాదాపు 100కి పైగా లాంగ్వేజ్ మరియు హ్యుమానిటీస్ సబ్జెక్టులకు సంబంధించి నిర్వహిస్తారు.

ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలో ప్రొఫిసరుగా చేరేందుకు యూజీసీ-నెట్ అర్హుతకు సంబంధించి పట్టింపు లేకపోయిన, ప్రభుత్వ యూనివర్సిటీలు, కళాశాలల్లో చేరేందుకు మాత్రం నెట్ ఎలిజిబిలిటీ తప్పనిసరి. రాష్ట ప్రభుత్వాలు భర్తీచేసే ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఉద్యోగాలకు కూడా యూజీసీ నెట్ అర్హుత తప్పనిసరి.

యూజీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్

దేశంలో ఒకానొక క్లిష్టమైన పరీక్షగా భావించే ఈ ఎలిజిబిలిటీ టెస్టులో కేవలం 5 నుండి 6 శాతం మంది మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్‌కి అర్హుత సాధించే అవకాశం ఉంటుంది. ఒకసారి యూజీసీ-నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అర్హుత సాధిస్తే, జీవితాంతం మీకు నచ్చిన భారత యూనివర్సిటీల్లో  అసిస్టెంట్ ప్రొఫిసర్సుగా పని చేసేందుకు గేట్ పాస్ దొరికినట్లే. అంతే కాకుండా యూజీసీ నెట్ క్వాలిఫై సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వటంలో ప్రభుత్వ మరియు  ప్రైవేట్ కంపెనీలు ముందు వరుసలో ఉంటాయి.

యూజీసీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్) అనేది యూజీసీ నెట్ యందు క్వాలిఫై సాధించిన టాప్ 0.5 శాతం మందికి మాత్రమే దక్కే గొప్ప అవకాశం. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కి అర్హుత సాధించిన వారు భారత ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో రెండేళ్ల జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రాం కింద నెలకు 31,000/- పైగా స్టైపెండుతో పరిశోధనాత్మక ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది విజయవంతంగా పూర్తిచేస్తే 35,000/- స్టైపెండుతో మరో మూడేళ్లు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) చేసే అవకాశం దక్కుతుంది.

యూజీసీ నెట్ జూన్ 2023

Exam Name యూజీసీ నెట్ - జూన్ 2023
Exam Type ఎలిజిబిలిటీ టెస్ట్
Eligibility For జెఆర్ఎఫ్ & అసిస్టెంట్ ప్రొఫెసెర్షిప్
Exam Date 13 జూన్ 2023 (O/W)
Exam Duration 3 గంటలు
Exam Level నేషనల్ లెవెల్

యూజీసీ నెట్ వివరాలు

యూజీసీ నెట్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ (పీజీ) పూర్తిచేసి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరిలకు సంబందించిన అభ్యర్థులకు 50 శాతం మార్కులు తప్పనిసరి.
  • పీజీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వేళా వీరు ఈ పరీక్షలో ఎలిజిబిలిటీ సాధిస్తే వారికీ పీజీ పూర్తిచేశాక మాత్రమే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.
  • 1 సెప్టెంబర్ 1991 తర్వాత పీజీ పూర్తిచేసి పీహెచ్డీ ప్రోగ్రాంలో ఉన్న అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
  • జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం పోటీపడే అభ్యర్థుల వయసు 1 డిసెంబర్ 2019 నాటికీ ముప్పైయేళ్లు మించకూడదు.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ట్రాన్స్జండర్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
  • అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ కోసం పోటీపడే అభ్యర్థులకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు.

యూజీసీ నెట్ డిసెంబర్ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 12 మే 2023
దరఖాస్తు చివరి తేదీ 01 జూన్ 2023
చేర్పులు మార్పులు 02 & 03 జూన్ 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్  రెండవ వారం జూన్ 2023
పరీక్ష తేదీ 13 జూన్ 2023 నుండి
22 జూన్ 2023 వరకు
ఫలితాలు జులై/ఆగస్టు 2023

పరీక్షలు ఆయా తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 నుండి 12 గంటల మధ్య, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల మధ్య నిర్వహిస్తారు. పేపర్ I మరియు పేపర్ II ల మధ్య ఎటువంటి విరామం ఉండదు.

యూజీసీ నెట్ దరఖాస్తు ఫీజు

యూజీసీ నెట్ దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి

జనరల్ కేటగిరి 1150/-
ఓబీసీ అభ్యర్థులు 600/-
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్ 325/-

యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ

యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. యూజీసీ నెట్ కు చెందిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మీ ఇమెయిల్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు యందు అడిగిన మీ విద్యా, వ్యక్తిగత, చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. రెండవ దశలో అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.

దరఖాస్తు సమర్పించిన ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

తెలుగు రాష్ట్రాలలో యూజీసీ నెట్ ఎగ్జామ్ సెంటర్లు

  • ఆంధ్రప్రదేశ్: అనంతపూర్, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, నంద్యాల, పొద్దుటూరు, సూరంపాలెం, తణుకు, భీమవరం. మంగళగిరి, మచిలీపట్టణం,
  • తెలంగాణ: హైతనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, జనగాం, కరీంనగర్. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, మహ్మదాబాద్, సిద్దపేట, సూర్యాపేట,

యూజీసీ నెట్ 2023 ఎగ్జామ్ నమూనా

యూజీసీ నెట్ పూర్తి కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్‌(CBT) విధానంలో జరుగుతుంది. మూడు గంటల నిడివితో జరిగే ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 లో 50 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు, పేపర్ 2 లో 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ఈ రెండు పేపర్లు విరామం లేకుండా మూడు గంటల్లో పూర్తిచెయ్యాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వబడతాయి. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నలకు ఋణాత్మక మార్కులు లేవు. మొత్తం పరీక్ష 300 మార్కులకు నిర్వహించబడుతుంది.

యూజీసీ పేపర్ I అభ్యర్థి యొక్క టీచింగ్ ప్రవృతి, పరిశోధనాత్మక ఆలోచన విధానం, రీజనింగ్ ఎబిలిటీ వంటి సామర్ధ్యాలను అంచనా వేసేందుకు జరుపుతారు. వీటితో పాటు అభ్యర్థిలో ఉండే గ్రహణ, వాదన సామర్థ్యం, వారిలో ఉండే పరిశీలన శక్తి , జనరల్ అవెర్నెస్ వంటి అంశాల యందు వారికున్న పరిజ్ఞానం ను పరీక్షిస్తారు.

పేపర్ I లో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఇవి టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కంప్రెహెన్షన్ పాసేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, మేథమెటికల్ రీజనింగ్ & ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ, మానవ అభివృద్ధి & పర్యావరణం మరియు ఉన్నత విద్య వంటి వివిధ అంశాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి.

యూజీసీ పేపర్ II లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇవి ప్రధానంగా అభ్యర్థి ఎన్నుకున్న సబ్జెక్టు యందు వారికున్న ప్రాథమిక పరిజ్ఙానం మరియు సైద్ధాంతిక, తార్కిక పరిజ్ణానంను పరీక్షించే విదంగా ఉంటాయి. ఈ ప్రశ్నలు అన్ని అభ్యర్థి ఎన్నుకున్న సబ్జెక్టు సంబంధిత డిగ్రీ, పీజీ  సిలబస్ నుండి ఇవ్వబడతయి.

నెట్ దాదాపు 100 పైగా స్పెషలైజ్డ్ సబ్జెక్టులును ఉద్దేశించి జరుగుతుంది. పేపర్ 2 సాధన మొదలుపెట్టె ముందు మీరు ఎన్నుకున్న ఆప్షనల్ సబ్జెక్టు సంబంధించి సిలబస్ ను నెట్ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసి మీ దగ్గర ఉంచుకోండి.

ప్రశ్నల సంఖ్యా మార్కులు సబ్జెక్టు సమయం
పేపర్ 1 50 100 జనరల్ అవెర్నెస్ 3 గంటలు
పేపర్ 2 100 200 ఆప్షనల్ సబ్జెక్టు
మొత్తం 150 ప్రశ్నలు 300 మార్కులు

యూజీసీ నెట్ ర్యాంకింగ్ విధానం

యూజీసీ నెట్ అర్హుత పరీక్షలో సాధించిన మెరిట్ స్కోర్ ఆధారంగా వివిధ రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకుని తుది లిస్ట్ ను విడుదల చేస్తారు. నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన టాప్ 0.3 నుండి 0.5 శాతం మందిని జూనియర్ రెసెర్చ్ ఫెలోషిప్ (JRF) కు ఎంపిక చేస్తారు.

ఉత్తీర్ణత సాధించిన వారిలో టాప్ 5 నుండి 6 శాతం మందికి అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్ ప్రోగ్రాం ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు అందజేస్తారు. జెఆర్ఎప్‌కి అర్హుత సాధించిన వారు జెఆర్ఎప్‌కి అర్హుత సాధించిన వారు, అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్ కూడా అర్హుత సాధించినట్లు అవుతుంది. అయితే అసిస్టెంట్ ప్రొఫెర్షిప్ అర్హుత సాధించిన వారు జెఆర్ఎప్‌లో జాయిన్ అయ్యేందుకు అనర్హులు. అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లును రిజల్ట్ వచ్చిన నెల నుండి రెండు నెలల్లో అందజేస్తారు. వీటి కాలపరిమితి జీవితకాలం ఉంటుంది.

వివిధ కేటగిరీ వారి రిజర్వేషన్లు
ఎస్సీ 15 శాతం
ఎస్టీ 7.5 శాతం
ఓబీసీ 27 శాతం
వికలాంగుల కోటా 5 శాతం

యూజీసీ నెట్ ఇతర వివరాలు

వెబ్‌సైట్ అడ్మిట్ కార్డు
ఇన్ఫర్మేషన్ బౌచర్  రిజల్ట్
సిలబస్  మార్కులు
మునపటి ప్రశ్నపత్రాలు  యూజీసీ నెట్ మాక్ టెస్ట్

Advertisement

Post Comment