Advertisement
సీయూఈటీ (యూజీ) 2024 నోటిఫికేషన్ మరియు ఎగ్జామ్ తేదీ
Admissions University Entrance Exams

సీయూఈటీ (యూజీ) 2024 నోటిఫికేషన్ మరియు ఎగ్జామ్ తేదీ

సెంట్రల్ యూనివర్శిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే సీయూఈటీ (యూజీ) 2024 నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 27 నుండి 26 మార్చి 2024 మధ్య చేపట్టనున్నారు. సీయూఈటీ (యూజీ) 2024 పరీక్షను మే 15 - 31 తేదీల మధ్య జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • సీయూఈటీ అనగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.
  • గతంలో ఈ పరీక్షను సీయూసెట్ పేరుతొ నిర్వహించే వారు.
  • సీయూఈటీ ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 44 సెంట్రల్ యూనివర్శిటీల యందు ప్రవేశం పొందొచ్చు.
  • తెలుగు రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యందు అడ్మిషన్ పొందేందుకు ఈ పరీక్ష రాయాల్సిందే.

సీయూఈటీ పరీక్ష ద్వారా కేవలం సెంట్రల్ యూనివర్సిటీల యందె కాకుండా స్టేట్, ప్రైవేట్ మరియు వివిధ డ్రీమ్డ్ యూనివర్శిటీల యందు కూడా ప్రవేశం పొందొచ్చు. ఈ అవకాశం సీయూఈటీ కోసం జాబితా చేయబడ్డ సదురు యూనివర్శిటీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ జాబితా సీయూఈటీ పోర్టల్ యందు అందుబాటులో ఉంటుంది.

  • దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి పరిశోధనాత్మక ప్రోగ్రాంలకు సెంట్రల్ యూనివర్సిటీలు కేంద్ర బిందువుగా ఉన్నాయి.
  • ప్రతిభావంతులైన పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ దేశానికి వెలకట్టలేని మానవ వనరులను అందిస్తున్నాయి.
  • ఈ కారణంగానే కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించి జరిగే సీయూఈటీ పరీక్షకు విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.

సీయూఈటీ (యూజీ) ఆధారంగా దాదాపు 72 ఇంటిగ్రేటెడ్ యూజీ కోర్సుల యందు ప్రవేశ పొందొచ్చు. విజయవంతంగా యూజీ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులకు అదే యూనివర్సిటీ యందు పీజీ చేసే అవకాశం లభిస్తుంది. సీయూఈటీ పరీక్షను ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియంతో పాటుగా అన్ని రాష్ట్రాల స్థానిక బాషలలో నిర్వహిస్తున్నారు. స్థానిక బాషలలో పరీక్షను రాయాలనుకునే వారు తమ సొంత రాష్ట్రంలో పరీక్ష కేంద్రంను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

సీయూఈటీ (యూజీ) ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్/10+2 పూర్తిచేసి ఉండాలి.
  • దరఖాస్తు చేసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు.
  • డిప్లొమా అభ్యర్థులు అర్హులు.
  • విదేశీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • స్థానిక భాషలో పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ సెంటర్ ఎంపిక చేసుకోవాలి.
  • సీయూఈటీ (యూజీ) 2024 షెడ్యూల్

    దరఖాస్తు ప్రారంభం 27 ఫిబ్రవరి 2024
    దరఖాస్తు చివరి గడువు 26 మార్చి 2024
    అడ్మిట్ కార్డు 2nd వీక్ మే 2024
    సీయూఈటీ (యూజీ) ఎగ్జామ్ తేదీ 15 - 31 మే 2024
    సీయూఈటీ (యూజీ) రిజల్ట్స్ జూన్ 2024

    సీయూఈటీ (యూజీ) ఎగ్జామ్ ఫీజు

    రిజర్వేషన్ కేటగిరి జనరల్ కేటగిరి ఓబీసీ ఎస్సీ, ఎస్టీ & ఇతరులు విదేశీయులు
    3 సబ్జెక్టుల వరకు ₹ 1,000/- ₹ 900/- ₹ 800/- ₹ 4,500/-
    ప్రతి అదనపు సబ్జెక్టుకు ₹ 400/- ₹ 375/- ₹ 350/- ₹ 1800/-

    సీయూఈటీ (యూజీ) ఎగ్జామ్ సెంటర్లు

    ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
    అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సికింద్రాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.

    సీయూఈటీ యూజీ దరఖాస్తు విధానం

    సీయూఈటీ దరఖాస్తు పక్రియను ఆన్‌లైన్ విధానంలో చేపడతారు. సెంట్రల్ యూనివర్సిటీ అధికారిక ఎగ్జామ్ పోర్టల్ (www.cuet.samarth.ac.in) నుండి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో సీయూఈటీ కోరిన విద్య, వ్యక్తిగత, చిరునామా సమాచారం తప్పులు దొర్లకుండా పొందుపర్చాలి. అలానే దరఖాస్తుకు సంబంధించి ప్రొఫైల్ పాస్‌వర్డ్ రూపొందించుకోవాలి.

    రిజర్వేషన్ కేటగిరి, కోర్సు ఎంపిక, యూనివర్సిటీ ఎంపిక, లాంగ్వేజ్ ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు దరఖాస్తులో నింపాల్సి ఉంటుంది. చివరిగా ఎగ్జామ్ ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

    ప్రవేశ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం మెయిల్ మరియు మొబైల్ ద్వారా అందజేస్తారు. అందువలన అభ్యర్థులు ఖచ్చితమైన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీలు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ విజయవంతమయ్యాక సంబంధిత దరఖాస్తు ప్రింట్ తీసి మీ వద్ద భద్రపర్చుకోండి.

    సీయూఈటీ యూజీ ఎగ్జామ్ నమూనా

    • సీయూఈటీ యూజీ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష, పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.
    • ప్రశ్నపత్రం నాలుగు సెక్షన్లుగా ఉంటుంది.
    • సెక్షన్ I A యందు రాజ్యాంగ గుర్తింపు పొందిన 13 బాషలలో ఒకదానికి పరీక్ష రాయాల్సి ఉంటుంది.
    • సెక్షన్ I B లో 20 గుర్తింపు పొందిన బాషలలో ఒకదానికి పరీక్ష రాయాల్సి ఉంటుంది.

    సెక్షన్ I A లో ఎంపిక ఎంపిక చేసుకున్న లాంగ్వేజ్‌ను I B లో ఎంపిక చేసుకోకూడదు. మూడు లాంగ్వేజ్ సబ్జెక్టులను ఎంపిక చేసుకున్న సమయంలో ఒకదాన్ని ప్రధాన ఆప్షనల్ సబ్జెక్టుగా పరిగణిస్తారు. ఈ రెండు సెక్షన్లలో ఒక్కో సబ్జెక్టు నుండి 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి. అందులో 40 ప్రశ్నలకు సంబంధించి సమాధానం చేయాల్సి ఉంటుంది.

    • సెక్షన్ II లో 27 ఆప్షనల్ సబ్జెక్టులు అందుబాటులో ఉంటాయి.
    • వీటి నుండి అభ్యర్థి కనిష్టంగా 1 నుండి గరిష్టంగా 10 సబ్జెక్టుల వరకు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
    • వీటిలో ఒక్కో సబ్జెక్టు సంబంధించి 40 ప్రశ్నలు ఇవ్వబడతయి. 35 వాటికీ సమాధానం చేయాల్సి ఉంటుంది.
    • పరీక్ష 45 నిముషాల నిడివితో 40 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.
    • ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ క్లాస్ XII ఆధారిత సిలబస్ ఇవ్వబడతాయి.

    సెక్షన్ III లో భాగంగా అభ్యర్థి దరఖాస్తు చేసుకునే యూనివర్సిటీ మరియు కోర్సుకు సంబంధించి జనరల్ ఆబ్జెక్టివ్ నిర్వహిస్తారు. 60 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో మొత్తం 60 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇందులో 50 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, కరెంటు అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికాల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, అర్థమెటిక్ అంశాల నుండి ఇవ్వబడతాయి.

    • సీయూఈటీ యూజీ పరీక్షను రోజుకు మూడు సెషన్ల చెప్పున నిర్వహిస్తారు.
    • అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుచరించి ఆయా సెషన్లలో హాజరుకోవాల్సి ఉంటుంది.
    సెక్షన్ సబ్జెక్టు/టెస్ట్ సమయం మార్కులు
    సెక్షన్ I A 1/13 లాంగ్వేజ్స్ 40/50 ప్రశ్నలు 45 నిముషాలు
    సెక్షన్ I B 1 or 2/19 లాంగ్వేజ్స్ 40/50 ప్రశ్నలు 45 నిముషాలు
    సెక్షన్ II 6/27 ఆప్షనల్ సబ్జెక్టు డొమైన్స్ 35/40 ప్రశ్నలు 45 నిముషాలు
    సెక్షన్ III జనరల్ టెస్ట్ 50/60 ప్రశ్నలు 60 నిముషాలు

    సీయూఈటీ యూజీ సబ్జెక్టులు

    • సెక్షన్ I A లో ఉన్న 13 ఆప్షనల్ భాషలు : తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ.
    • సెక్షన్ I B లో ఉన్న 19 ఆప్షనల్ భాషలు : ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, నేపాలీ, పర్షియన్, ఇటాలియన్, అరబిక్, సింధీ, కాశ్మీరీ, కొంకణి, బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, సంతాలి, టిబెటన్, జపనీస్, రష్యన్, చైనీస్.

    27 ఆప్షనల్ సబ్జెక్టులు : 1. అకౌంటెన్సీ/ బుక్ కీపింగ్ 2. బయాలజీ/ బయోలాజికల్ స్టడీస్/ బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ 3. బిజినెస్ స్టడీస్ 4. కెమిస్ట్రీ 5. కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్ 6. ఎకనామిక్స్/ బిజినెస్ ఎకనామిక్స్ 7. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ 8. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 9. జియోగ్రఫీ/జియాలజీ 10. చరిత్ర 11. హోమ్ సైన్స్ 12. నాలెడ్జ్ ట్రెడిషన్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియా 13. లీగల్ స్టడీస్ 14. పర్యావరణ శాస్త్రం 15. గణితం 16. ఫిజికల్ ఎడ్యుకేషన్/ NCC/యోగ 17. ఫిజిక్స్ 18. రాజకీయ శాస్త్రం 19. మనస్తత్వశాస్త్రం 20. సోషియాలజీ 21. టీచింగ్ ఆప్టిట్యూడ్ 22. అగ్రికల్చర్ 23. మాస్ మీడియా/ మాస్ కమ్యూనికేషన్ 24. ఆంత్రోపాలజీ 25. ఫైన్ ఆర్ట్స్/ విజువల్ ఆర్ట్స్ (శిల్పం/ పెయింటింగ్)/వాణిజ్య కళలు, 26. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ - (i) డ్యాన్స్ (కథక్/ భరతనాట్యం/ ఒడ్డిసి/ కథాకళి/కూచిపూడి/ మణిపురి (ii) నాటకం- థియేటర్ (iii) మ్యూజిక్ జనరల్ (హిందుస్తానీ/ కర్నాటిక్/ రవీంద్ర సంగీతం/ పెర్కషన్/ నాన్-పెర్కషన్), 27. సంస్కృతం

    సీయూఈటీ (యూజీ) 2024 సిలబస్

    అకౌంటెన్సీ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్
    బయాలజీ మ్యాథ్స్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్
    బిజినెస్ స్టడీస్ ఫిజిక్స్ అగ్రికల్చర్
    ఎకనామిక్స్ సోషియాలజీ మాస్ మీడియా
    ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైకాలజీ  టీచింగ్ ఆప్టిట్యూడ్
    జాగ్రఫీ పొలిటికల్ సైన్స్ ఆంత్రోపాలజీ
    హిస్టరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ 
    హోమ్ సైన్స్ పర్యావరణ శాస్త్రం పెర్ఫార్మింగ్ ఆర్ట్స్
    నాలెడ్జ్ ట్రెడిషన్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియా లీగల్ స్టడీస్ లాంగ్వేజ్ (పార్ట్ A & B)

    సీయూఈటీ (యూజీ) అడ్మిషన్ ప్రక్రియ

    సీయూఈటీ యూజీలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తారు. యూజీసీ అడ్మిషన్ నియమ నిబంధనలను అనుచరించి ప్రతి కోర్సులో ఆయా రిజర్వేషన్ కోటా ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. యూనివర్సిటీలలో అందుబాటులో కోర్సులను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ సంబంధిత సమాచారం ఆయా సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది లింకును ప్రెస్ చేయండి.

    Helpdesk (10:00 AM - 6:00 PM)

    Mobile No. : 011-40759000

    Email Id : cuet-ug@nta.ac.in

    సెంట్రల్ యూనివర్సిటీల జాబితా

    1. అస్సాం యూనివర్సిటీ
    2. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం
    3. బనారస్ హిందూ యూనివర్సిటీ
    4. బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం
    5. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
    6. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్
    7. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్
    8. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ
    9. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా
    10. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్
    11. సిక్కిం యూనివర్సిటీ
    12. తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం
    13. ఇంగ్లీష్ & విదేశీ భాషల విశ్వవిద్యాలయం
    14. త్రిపుర విశ్వవిద్యాలయం
    15. అలహాబాద్ విశ్వవిద్యాలయం
    16. ఢిల్లీ విశ్వవిద్యాలయం
    17. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
    18. విశ్వభారతి విశ్వవిద్యాలయం
    19. మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ
    20. సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం, ఢిల్లీ
    21. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం
    22. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం
    23. సెంట్రల్ యూనివర్సిటీ తమిళనాడు
    24. సెంట్రల్ యూనివర్సిటీ హర్యానా
    25. సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూ
    26. సెంట్రల్ యూనివర్సిటీ ఝార్ఖండ్
    27. సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటక
    28. సెంట్రల్ యూనివర్సిటీ రాజస్థాన్
    29. సెంట్రల్ యూనివర్సిటీ సౌత్ బీహార్
    30. సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్
    31. డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వ విద్యాలయం
    32. గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయ
    33. హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ విశ్వవిద్యాలయం
    34. ఇందిరా గాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం
    35. జామియా మిలియా ఇస్లామియా
    36. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ
    37. మహాత్మా గాంధీ అంతర్రాష్ట్ర హిందీ విశ్వవిద్యాలయం
    38. మణిపూర్ విశ్వవిద్యాలయం
    39. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
    40. మిజోరం యూనివర్సిటీ
    41. నాగాలాండ్ విశ్వవిద్యాలయం
    42. నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ
    43. పాండిచ్చేరి విశ్వవిద్యాలయం
    44. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ

    Post Comment