ఎఫ్ఎడీఈఈ 2023 నోటిఫికేషన్ : ఫైన్ ఆర్ట్స్ కోర్సులలో అడ్మిషన్లు
Admissions University Entrance Exams

ఎఫ్ఎడీఈఈ 2023 నోటిఫికేషన్ : ఫైన్ ఆర్ట్స్ కోర్సులలో అడ్మిషన్లు

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ మరియు డిజైన్ కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఎఫ్ఎడీఈఈ 2023 ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎఫ్ఎడీఈఈ అనగా ఫైన్ ఆర్ట్స్ & డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్  అని అర్ధం. ఆసక్తి ఉండే విద్యార్థులు జూన్ 5 లోపు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. యూనివర్సిటీ మరియు దాని అనుబంధ ఫైన్ ఆర్ట్స్ కళాశాలల యందు వెయ్యికి పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఫైన్ ఆర్ట్స్ కోర్సులు, ఎలిజిబిలిటీ & ట్యూషన్ ఫీజు

FADEE

ఎఫ్ఎడీఈఈ 2023 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం 08 మే 2023
దరఖాస్తు తుది గడువు 05 జూన్ 2023
దరఖాస్తు ఫీజు 1,800/- (ఎస్టీ, ఎస్టీలకు 900/-)
B.F.A (ఫోటోగ్రఫీ) ఎగ్జామ్ తేదీ 17 జూన్ 2023
పేపర్ - D: 10:00 AM నుండి 11:30 AM వరకు
పేపర్ - E: 11:40 AM నుండి 12:30 PM వరకు
బి. డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) ఎగ్జామ్ తేదీ 17 జూన్ 2023
పేపర్ - F: 2:00 PM నుండి 5:00 PM వరకు
B.F.A (అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్ & యానిమేషన్) ఎగ్జామ్ తేదీ 18 జూన్ 2023
పేపర్ - A: 10:00 AM నుండి 11:30 PM వరకు
పేపర్ - B: 11:40 AM నుండి 12:30 PM వరకు
పేపర్ - సి: 1:30 PM నుండి 3:00 PM వరకు
ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్

ఎఫ్ఎడీఈఈ దరఖాస్తు ప్రక్రియ

ఫైన్ ఆర్ట్స్ మరియు డిజైన్ కోర్సుల యందు ఆసక్తి ఉన్న విద్యార్థులు జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ యొక్క వెబ్సైటు నుండి గడువులోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు మొదటి దశలో అభ్యర్థి హాజరయ్యే కోర్సు వివరాలు, విద్యార్థి యొక్క వ్యక్తిగత, విద్య మరియు చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

రెండవ దశలో దశలో పొందుపర్చిన వివరాలను సరి చూసుకొని నిర్ణయించిన ఫార్మేట్ యందు అభ్యర్థి యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా అందుబాటులో పేమెంట్ విధానంలో దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. పరీక్షను హైదరాబాద్ యందు మాత్రమే నిర్వహిస్తారు.

ఎఫ్ఎడీఈఈ ఎగ్జామ్ ఫార్మేట్ & అడ్మిషన్ విధానం

ఎఫ్ఎడీఈఈ ఎగ్జామ్ ఆఫ్‌లైన్ విధానంలో పెన్ & పేపర్ ఆధారితంగా జరుగుతుంది. ప్రవేశ పరీక్షలో కనీసం 35 శాతం మార్కులు పొందిన విద్యార్థులను అర్హులుగా పరిగణిస్తారు. అర్హుత పొందిన వారిలో వివిధ రిజర్వేషన్ కోటాల ఆధారితంగా సీట్లు భర్తీ చేస్తారు. ఇందులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం సీట్లు కేటాయిస్తారు.

FADEE Exam

సిలబస్ & మోడల్ పేపర్లు

సిలబస్ B.F.A (ఫోటోగ్రఫీ) మోడల్ పేపర్ 
B.F.A (అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్ & యానిమేషన్) బి. డిజైన్ (ఇంటీరియర్ డిజైన్)
దరఖాస్తు చేయండి 

Advertisement

Post Comment