విదేశాలలో ఉన్నత విద్య కోసం 6 అంతర్జాతీయ ప్రవేశ పరీక్షలు
Admissions Exams to study abroad

విదేశాలలో ఉన్నత విద్య కోసం 6 అంతర్జాతీయ ప్రవేశ పరీక్షలు

విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందేందుకు అవసరమయ్యే వివిధ ప్రవేశ పరీక్షలు మరియు ఇంగ్లీష్ అర్హుత పరీక్షల పూర్తి సమాచారం కోసం అన్వేషించండి. జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, పియర్సన్, ఐఈఎల్టీఎస్ మరియు శాట్ వంటి మొదలగు పరీక్షల కోసం తెలుసుకోండి.

Advertisement

విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం ఇంగ్లీష్ దేశాల వైపు చూసే అభ్యర్థులకు అక్కడి యూనివర్సిటీలు, సంస్థలు కొన్ని ప్రాథమిక అర్హుతలు తప్పనిసరి చేసాయి. అందులో ఇంగ్లీష్ భాషకు సంబంధించి పూర్తి నైపుణ్యాలను కలిగివుండటమనేది ప్రధమ నియమం. అందువలన సదురు అభ్యర్థులు తప్పనిసరిగా టోఫెల్, ఐఈఎల్టీఎస్ వంటి  ఇంగ్లీష్ బాషా పరీక్షలలో అర్హుత సాధించవల్సి ఉంటుంది.

1. టోఫెల్ ఎగ్జామ్

TOEFL Exam - Dates, Registration, Fees, Eligibilityటోఫెల్ ప్రధానంగా ఇంగ్లీష్ యూనివర్సిటీల్లో  గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసే  విద్యార్థులు యొక్క చదవటం, రాయటం మరియు మాట్లాడటం వంటి ఇంగ్లీష్ బాషా సామర్ధ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించబడుతుంది. పూర్తి ఆంగ్ల మాధ్యమంలో జరిగే అక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్స్ లలో తమ ఇంగ్లీష్ బాషా నైపుణ్యాలతో ఇంగ్లీష్ యితర అభ్యర్థులు  ఎంతవరకు రాణించగలరు అనేది స్పష్టం చేస్తుంది.

టోఫెల్ స్కోరు ను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇంగ్లాండ్ తో పాటుగా ఆసియా మరియు యూరప్ వంటి 190 దేశాల్లో దాదాపు 10 వేలకు పైగా యూనివర్సిటీలు మరియు విద్యసంస్థలు పరిగణలోకి తీసుకుంటాయి. ప్రధానంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  యూనివర్సిటీలలో టోఫెల్ స్కోరుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

  1. టోఫెల్ ఐబీటీ టెస్ట్ : ఇది పూర్తిస్థాయి అకడమిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ యొక్క ప్రీమియర్ పరీక్ష. ఇది చదవడం, వినడం, మాట్లాడటం మరియు రాయడం అనే నాలుగు అకడమిక్ ఇంగ్లీషు నైపుణ్యాలను అంచనా వేస్తుంది. విదేశీ విశ్వ విద్యాలయాల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించే వారు ఈ పరీక్షలలో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.
  2. టోఫెల్ ఎస్సెన్షియల్స్ : ఇది పరిమితస్థాయి అకడమిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పరీక్ష. ఇది ప్రాథమిక స్థాయిలో చదవడం, వినడం, మాట్లాడటం మరియు రాయడం అనే నాలుగు అకడమిక్ ఇంగ్లీషు నైపుణ్యాలను అంచనా వేస్తుంది. దీనిని కూడా దాదాపు విదేశీ విశ్వ విద్యాలయాలు ఆమోదిస్తాయి.
  3. టోఫెల్ ప్రైమరీ : ఇది 8+ వయస్సు గల విద్యార్థుల కోసం రూపొందించబడింది. దీనిని విద్యార్థుల ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలను కొలవడానికి, విద్యార్థుల ఆంగ్ల బాష పురోగతిని పర్యవేక్షించడానికి నిర్వహిస్తారు.
  4. టోఫెల్ జూనియర్ : ఈ పరీక్షను 11 నుండి 15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు ఆంగ్ల భాషా ప్రావీణ్యం కొలిసేందుకు నిర్వహిస్తారు. అలానే విద్యార్థుల ఆంగ్ల బాష పురోగతిని పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది.
  5. టోఫెల్ ఐటీపీ : ఇది  18+ వయస్సు గల విద్యార్థుల కోసం రూపొందించబడింది. ఇది అకడమిక్ మరియు సోషల్ కంటెంట్‌ని ఉపయోగించి స్థానికేతర ఇంగ్లీష్ మాట్లాడే విద్యార్థుల ఆంగ్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలను కొలవడానికి, విద్యార్థుల ఆంగ్ల బాష పురోగతిని పర్యవేక్షించడానికి నిర్వహిస్తారు.

2. ఐఇఎల్‌టిఎస్ ఎగ్జామ్

IELTS Exam - Dates, Registration, Fees, Eligibilityఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఇఎల్‌టిఎస్) ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెసెన్సీ పరీక్షలలో టోఫెల్ తర్వాత అత్యధిక యూనివర్సిటిలచే  ఆమోదించబడుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే దేశాలకు విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే ఇంగ్లీష్ యేతర అభ్యర్థులు ఐఇఎల్‌టిఎస్‌ అర్హుత సాధించటం ద్వారా తమ అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు.

ఏడాదికి దాదాపు 48 సార్లు నిర్వహించబడే ఈ అర్హుత పరీక్షకు, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1600 పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ యూనివర్సిటీలలో గ్రాడ్యుయేషన్ మరియు పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసే భారతీయ విద్యార్థులు ఆంగ్లభాష నైపుణ్యాలు కలిగివుండటం తప్పనిసరి కావడంతో ఇంగ్లీష్ ప్రోఫిసెన్సీ పరీక్షలకు యేటా డిమాండ్ పెరుగుతూనే ఉంది.

ఐఇఎల్‌టిఎస్‌ అర్హుత పరీక్ష ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. దాదాపు 3 గంటల నిడివితో సాగే ఈ అర్హుత పరీక్షలో నాలుగు సెక్షన్లలో, ఇంగ్లీష్ భాష చదవటం, వినటం, మాట్లాడటం మరియు రాయటం వంటి 4 అంశాలలో అభ్యర్థుల యొక్క ప్రావీణ్యతను పరిశీలిస్తారు. ఈ నాలుగు అంశాలలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది స్కోరును  ప్రకటిస్తారు.

3. పియర్సన్ పీటీఈ ఎగ్జామ్

Pearson PTE Exam - Dates, Registration, Fees, Eligibilityపియర్సన్ పీటీఈ ఎగ్జామ్ విదేశీ చదువుల కోసం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్ వంటి దేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. పీటీఈ పరీక్షలో అర్హుత పొందడం ద్వారా ఆయా దేశాలకు చెందిన వీసా మరియు యూనివర్సిటీల యందు అడ్మిషన్ పొందేందుకు సులభతరం చేస్తుంది.

వేగం మరియు కచ్చితత్వానికి నిదర్శనంగా నిలిచే పీటీఈ పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా 80 పైగా దేశాల్లో 250 కిపైగా గ్లోబల్ టెస్ట్ సెంటర్ల యందు నిర్వహించబడుతుంది. పీటీఈ స్కోరు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఎస్, యూకే, కెనడా, జర్మనీ, సింగపూర్ మరియు ఐర్లాండ్ వంటి వివిధ దేశాల యూనివర్సిటిలలో చెల్లుబాటు అవుతుంది. అలానే పీటీఈ అర్హుతతో న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల వీసా పొందేందుకు వీలుంటుంది.

పీటీఈ అకాడమిక్ టెస్ట్ పూర్తి ఆన్‌లైన్‌ (CBT) విధానంలో నిర్వహించబడుతుంది. 2 గంటల నిడివితో సాగే ఈ పరీక్ష ఇంగ్లీష్ భాషకు సంబంధించి రాయటం, చదవటం, వినటం మరియు మాట్లాడటం వంటి బాషా అంశాల నైపుణ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించబడుతుంది.

4. జీమ్యాట్ ఎగ్జామ్

GMAT - Exam Date, Syllabus, Exam Patternప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2400 బిజినెస్ స్కూళ్లలో పీజీ స్థాయి మేనేజ్‌మెంట్‌ కోర్సుల యందు ప్రవేశాలు పొందేందుకు జీమ్యాట్ ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఎంబీఏ చేయాలనే ఆలోచన ఉన్నవారు జీమ్యాట్ అర్హుత సాధించటం ద్వారా ఆ కలను నిజం చేసుకోవచ్చు.

ఏటా దాదాపు 2 లక్షలు మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్ష స్కోరును 114 దేశాలు ప్రామాణికంగా తీసుకుంటాయి. జీమ్యాట్ అర్హుతతో దాదాపు 7000కి పైగా ఎంబీఏ ప్రోగ్రామ్స్ లలో ప్రవేశాలు పొందొచ్చు.

ఏడాది పొడుగునా జరిగే జీమ్యాట్ ముఖ్యంగా మేనేజ్‌మెంట్ ప్రవేశాల కోసం వచ్చే అభ్యర్థుల అకాడమిక్ మరియు వ్యక్తిగత నైపుణ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించబడుతుంది. జీమ్యాట్ యందు అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా  వారు మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రేవేశం పొందేందుకు మరియు ఆ కోర్సు పూర్తి చేసేందుకు యెంత సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తుంది.

జీమ్యాట్ ముఖ్యంగా మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఉండల్సిన కనీస నైపుణ్యాలను పరీక్షించి బిజినెస్ కోర్సులకు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండే విద్యార్థులను అందిస్తుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ రీజనింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, అనలాటికల్ రైటింగ్ విభాగాలతో జరిపే ఈ పరీక్ష ద్వారా అభ్యర్థి యొక్క బాష మరియు నైపుణ్య వ్యక్తీకరణ సామర్ధ్యాలను అంచనావేస్తారు.

5. జీఆర్ఈ ఎగ్జామ్

GRE Exam - Dates, Registration, Fees, Eligibilityఅమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏంఎ, ఎంఎస్సీ చేయాలనుకునే తెలుగు విద్యార్థులు గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్ (జీఆర్ఈ ఎగ్జామ్) అర్హుత సాధించటం తప్పనిసరి. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) ఆధ్వర్యంలో జరిగే ఈ అర్హుత పరీక్ష దాదాపు 160 దేశాల్లో 1000 కి పైగా పరీక్ష కేంద్రాలలో ఏడాది పొడుగునా నిర్వహించబడుతుంది.

జీఆర్ఈ స్కోరు మేనేజ్‌మెంట్‌ మరియు లా కోర్సులతో పాటుగా కొన్ని వందల కొలది గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ యందు చేరేందుకు ఉపయోగపడుతుంది. జీఆర్ఈ స్కోరు కార్డు, అర్హుత సాధించిన ఏడాది నుండి ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. పరీక్ష ఫీజు 205 డాలర్లు (14000 నుండి 15000 రూ).

జీఆర్ఈ జనరల్ టెస్ట్ మరియు జీఆర్ఈ సబ్జెక్ట్స్ టెస్ట్ పేరుతొ జరిగే ఈ అర్హుత పరీక్షలకు ప్రతి యేటా వేలాది మంది తెలుగు విద్యార్థులు పోటీ పడుతుంటారు.

జీఆర్ఈ జనరల్ టెస్ట్ ప్రధానంగా అభ్యర్థి యొక్క వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ మరియు అనలాటికల్ రైటింగ్ సంబంధిత నైపుణ్యాల అంచనా వేసేందుకు నిర్వహిస్తారు. జీఆర్ఈ జనరల్ స్కోరుతో అమెరికాలోని టాప్ యూనివర్సిటీలలో బిజినెస్ మరియు లా కోర్సులతో పాటుగా మిగతా అన్ని పోస్టుగ్రాడ్యుయేట్  ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీఆర్ఈ సబ్జెక్టు టెస్ట్ అనేది స్పెషలైజెడ్ సబ్జెక్టుల యందు మాస్టర్స్ చేయాలనుకునే వారి కోసం నిర్వహించబడతాయి. బయాలజీ, కెమిస్ట్రీ, లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు సైకాలజీ సబ్జెక్టులకు మాత్రమే జీఆర్ఈ సబ్జెక్టు టెస్ట్ నిర్వహించబడుతుంది.

6. శాట్ ఎగ్జామ్

SAT Admission Test - Dates, Registration, Fees, Eligibilityశాట్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే ఒకానొక పాపులర్ అడ్మిషన్ టెస్ట్. శాట్ అనగా స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అర్ధం. ఈ పరీక్షను అమెరికాకు చెందిన కాలేజ్ బోర్డ్ మరియు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సంస్థలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలో అర్హుత పొందటం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని యూనివర్శిటీలు మరియు కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల యందు ప్రవేశం పొందొచ్చు.

శాట్ ప్రవేశ పరీక్ష ఏడాదిలో 7 సార్లు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు సగటున 1.5 మిల్లియన్ల మంది విద్యార్థులు ఏటా హాజరవుతున్నారు. శాట్ ప్రవేశ పరీక్ష ప్రధానంగా జూనియర్, సీనియర్ హైస్కూల్ విద్యార్థులు, తమ పాఠశాలలో నేర్చుకున్న నైపుణ్యాలను అంచనా వేస్తుంది.

శాట్ ప్రవేశ పరీక్ష పూర్తి సీబీటీ విధానంలో జరుపుతారు. పరీక్షను పూర్తి చేసేందుకు 3 గంటల సమయం పడుతుంది. రీడింగ్, లాంగ్వేజ్ మరియు మ్యాథమెటిక్స్ అంశాలతో శాట్ పరీక్షను మూడు అంచెలలో నిర్వహిస్తారు.

Advertisement