Advertisement
ఏపీ పాలీసెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ
Admissions Ap CETs Engineering Entrance Exams

ఏపీ పాలీసెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

ఏపీ పాలీసెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ కల్పించే ఈ ప్రవేశ పరీక్షను 10 మే 2023 న నిర్వహించేందుకు ఏపీ సాంకేతిక విద్యా మండలి ఏర్పాటు చేస్తుంది. ఏపీ పాలీసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 16 నుండి ఏప్రిల్ 30వ తేదీల మధ్య చేపట్టనున్నారు.

ఏపీ పాలీసెట్ పరీక్షను టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ లేదా నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తారు. పాలీసెట్ అనగా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ నిర్వహిస్తుంది.

పాలీసెట్ పరీక్షలో అర్హుత పొందిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రభుత్వ అన్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్ళ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

Exam Name AP POLYCET 2023
Exam Type Entrance Test
Entrance For Polytechnic Diploma
Exam Date 10/05/2023
Exam Duration 2 Hours
Exam Level State Level (AP)

గమనిక : తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు తెలంగాణ పాలీసెట్ పరీక్షను రాయాల్సి ఉంటుంది.

ఏపీలో 3ఏళ్ళ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు

  • సివిల్ ఇంజనీరింగ్
  • ఆర్కిటెక్చరల్ & అసిస్టెంట్షిప్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఆటోమొబైల్ఇంజినీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇనుస్ట్రుమెంటాషన్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ ఇంజనీరింగ్
  • ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్
  • 3డి అనిమేషన్ & గ్రాఫిక్స్
  • పెట్రోలియం టెక్నాలజీ (ఆంధ్రప్రదేశ్)
  • మెటలర్జికల్ ఇంజనీరింగ్
  • కెమికల్ ఇంజనీరింగ్
  • బయో మెడికల్ ఇంజనీరింగ్
  • టెక్స్‌టైల్ టెక్నాలజీ
  • వెబ్ డిజైనింగ్
  • మైనింగ్ ఇంజనీరింగ్
  • కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్
  • గార్మెంట్ టెక్నాలజీ
  • క్లౌడ్ కంప్యూటరింగ్ & బిగ్ డేటా
  • కమ్యూనికేషన్ & కంప్యూటర్ నెట్వర్క్
  • ప్యాకేజింగ్ ఇంజనీరింగ్ (తెలంగాణ)

ఏపీలో 3.5 ఏళ్ళ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు

  • కెమికల్ ఇంజనీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ)
  • కెమికల్ ఇంజనీరింగ్ (ప్లాస్టిక్ & పోలీమర్స్)
  • ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్
  • 3డి యానిమేషన్ & గ్రాఫిక్
  • వెబ్ డిజైనింగ్
  • కెమికల్ ఇంజనీరింగ్ (పెట్రోలియం కెమికల్స్)
  • కెమికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • క్లౌడ్ కంప్యూటరింగ్
  • కమ్యూనికేషన్ & నెట్వర్కింగ్

ఏపీ పాలీసెట్ 2023 ముఖ్యమైన తేదీలు

ఏపీ పాలీసెట్ దరఖాస్తు ప్రారంభం 17 ఫిబ్రవరి 2023
ఏపీ పాలీసెట్ 2023 దరఖాస్తు గడువు 30 ఏప్రిల్ 2023
ఏపీ పాలీసెట్ అడ్మిట్ కార్డు మే 2023
ఏపీ పాలీసెట్ పరీక్ష తేదీ 10 మే 2023
ఏపీ పాలీసెట్ ఫలితాలు 25 మే 2023

ఏపీ పాలీసెట్ 2023 ఎలిజిబిలిటీ

  • ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులు అర్హులు
  • విద్యార్థి ఏపీ లేదా తెలంగాణ స్టేట్ బోర్డు నుండి 35% మార్కులతో టెన్త్ పూర్తిచేసి ఉండాలి.
  • పాలీసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు.

ఏపీ పాలీసెట్ దరఖాస్తు ఫీజు & పరీక్ష కేంద్రాలు

దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

జనరల్ కేటగిరి Rs 400/-
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు Rs 250/-

ఏపీ పాలీసెట్ కోసం ఏపీ అన్ని జిల్లాలో పరిధిలో దాదాపు 400 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు తమకు అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ పాలీసెట్ రిజిస్ట్రేషన్

పాలీసెట్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైటు www polycetap.nic.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి ఆదశలో విద్యార్థి టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్, వ్యక్తిగత మరియు అడ్రెస్స్ వివరాలు నింపాల్సి ఉంటుంది.

తరువాత దశలో ఆధార్ నెంబరుతో పాటుగా, రిజర్వేషన్ కేటగిరి, పరీక్ష కేంద్రం ఎంపిక, లాంగ్వేజ్ ఎంపిక వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. చివరిగా చివరిగా ఎగ్జామ్ రుసుమును చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. చివరిగిగా దరఖాస్తు సమర్పించే ముందు మీ వివరాలు మరోసారి సరిచూసుకోవడం మరవొద్దు.

ఏపీ పాలీసెట్ ఎగ్జామ్ నమూనా

ఏపీ పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో 120 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష 2 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం మొత్తం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నలు పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో టెన్త్ క్లాస్ ఆధారిత మాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ  నుండి ఇవ్వబడతాయి.

ఇందులో మ్యాథ్స్ నుండి 50 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుండి 30 ప్రశ్నలు ఇవ్వబడతాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లీష్ లేదా ఉర్దూ/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

సెక్షన్ సిలబస్ ప్రశ్నలు మార్కులు
సెక్షన్ I మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు 50 మార్కులు
సెక్షన్ II ఫిజిక్స్ 40 ప్రశ్నలు 40 మార్కులు
సెక్షన్ III కెమిస్ట్రీ 30 ప్రశ్నలు 30 మార్కులు
120 ప్రశ్నలు 120 మార్కులు

ఏపీ పాలీసెట్ ర్యాంకింగ్ విధానం

పాలీసెట్ ర్యాంకింగ్ ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజినీరింగ్ కోర్సులకు విడివిడిగా అందిస్తారు. ఇంజనీరింగ్ కోర్సులు అందించే పాలిటెక్నిక్స్ కోసం ఎంపీసీ ర్యాంకింగ్ సహాపడుతుంది. ఇందులో కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెక్షన్లను మాత్రమే లెక్కిస్తారు. వీటిలో ఒక్కోదానిలో కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

రిజర్వేషన్ నియమాలు

ఈ పరీక్షను తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాసేందుకు అనుమతి ఉంది. కానీ మెజారిటీ అడ్మిషన్లు లోకల్ అభ్యర్థులకు కల్పిస్తారు. అనగా అందుబాటులో సీట్లలో 85% సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందులో కేటగిరి వారీగా ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం సీట్లు మరియు బీసీలకు 29% శాతం సీట్లు కల్పిస్తారు.

తెలంగాణ (85 శాతం సీట్లు) ఆంధ్రప్రదేశ్ (15 శాతం సీట్లు)
బీసీలకు 29 శాతం సీట్లు 29 శాతం సీట్లు
ఎస్సీలకు 15 శాతం సీట్లు 15 శాతం సీట్లు
ఎస్టీలకు 6 శాతం సీట్లు 6 శాతం సీట్లు

కోర్సు ట్యూషన్ ఫీజులు & ఇతర రుసుములు

యూనివర్సిటీ / పాలిటెక్నిక్ ఏడాదికి ఫీజు మొత్తం
ప్రభుత్వ & ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ Rs 4,700/-
ప్రైవేటు పాలిటెక్నిక్స్ Rs 25,000/-

Post Comment