ఎస్బీఐ విద్యార్థుల కోసం పలురకాల ఎడ్యుకేషన్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ స్టూడెంట్ లోన్ కోసం ఇప్పుడే అప్లై చేయండి. ప్రభుత్వరంగ బ్యాంకులలో పెద్దన్నా అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యా రుణాల విషయంలో మొదటి నుండి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. 8 లక్షల కనీస రుణ మొత్తం నుండి గరిష్టంగా 1.5 కోట్ల వరకు విద్యా రుణం ఆఫర్ చేస్తుంది.
ఎస్‌బీఐ తక్కువ వడ్డీ రేటుతో, సులభతరమైన రీపేమెంట్ సదుపాయం, మొరటోరియం ఎంపిక, ఆదాయపు పన్ను ప్రయోజనం, మహిళా విద్యార్థులకు వడ్డీ రాయితీ వంటి అనేక ఇతర ప్రయోజనాలు కల్పిస్తుంది. ఈ కారణాల చేత విద్యా రుణాల విషయంలో విద్యార్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
ఎస్‌బీఐ స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి
ప్రస్తుతం విద్యా రుణాలు అన్నీ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదురు అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి, విద్యార్థి అర్హుతను నిర్ణహిస్తారు. అర్హుత పొందిన విద్యార్థులకు 10 నుండి 15 రోజులలో లోన్ మంజూరు చేస్తారు.
రెండవ విధానంలో విద్యార్థులు నేరుగా దగ్గరలో ఉండే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ బ్రాంచు మేనేజర్ లేదా లోన్ సెక్షన్ అధికారులను కలవడం ద్వారా ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తారు. మీరు అర్హులైతే సంబంధిత సర్టిఫికెట్లు సేకరించి, పరిశీలించి విద్యా రుణనాన్ని మంజూరు చేస్తారు.
ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్ కోసం జత చేయాల్సిన సర్టిఫికెట్లు
- చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ).
- మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్). ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
- ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు. ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
- చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్ ఫోటోలు.
- విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
- నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లాంటివి జత చేయాలి.
- విదేశీ చదువులు : చెలుబాటు అయ్యే పాసుపోర్టు, i20వీసా, అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిట్ లెటర్, గ్యాప్ సర్టిఫికేట్, జీఆర్ఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్, శాట్ పరీక్షలలో ఏదోకటి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ఎస్బీఐ విద్యా రుణాల రకాలు
ఇండియా మరియు విదేశాలలో చదువుకునే విద్యార్థుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 9 రకాల రుణ పథకాలను అందుబాటులో ఉంచింది. ఈ తొమ్మిది రుణ పథకాల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎస్‌బీఐ స్టూడెంట్ లోన్ స్కీమ్
Loan Amount |
ఇండియాలో ఉన్నత విద్య : మెడికల్ కోర్సులకు కనిష్టంగా 30 లక్షల నుండి 50 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ అందిస్తారు. ఇతర కోర్సులకు 10 లక్షల నుండి గరిష్టంగా 50 లక్షల వరకు ఆఫర్ చేస్తారు. |
విదేశాలలో హయ్యర్ ఎడ్యుకేషన్ : కనిష్టంగా 7.5 లక్షల నుండి గరిష్టంగా గ్లోబల్ ఎడ్-వాన్టేజ్ స్కీమ్ కింద 1.5 కోట్ల వరకు రుణం అందిస్తున్నారు. |
Courses Covered |
- ఇండియా : గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ తో పాటుగా, యుజిసి / ఎఐసిటిఇ / ఐఎంసి / ప్రభుత్వం ఆమోదించిన కళాశాలలు / విశ్వవిద్యాలయాలు నిర్వహించే రెగ్యులర్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ డిగ్రీ డిప్లొమా కోర్సులు. అలానే ఐఐటి, ఐఐఎం వంటి స్వయంప్రతిపత్త సంస్థలు నిర్వహించే రెగ్యులర్ డిగ్రీ / డిప్లొమా కోర్సులు.
- కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందిన ఉపాధ్యాయ శిక్షణ / నర్సింగ్ కోర్సులు.
- డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ / షిప్పింగ్ / సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ ఆమోదించిన ఏరోనాటికల్, పైలట్ శిక్షణ, షిప్పింగ్ వంటి రెగ్యులర్ డిగ్రీ / డిప్లొమా కోర్సులు.
- అలానే ఉద్యోగ ఆధారిత ప్రొఫెషనల్ / టెక్నికల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులు / పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు డిప్లొమా కోర్సులు MCA, MBA, MS మొదలైనవి.
- ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు అందించే CIMA (చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్) కోర్సులు.
|
- విదేశాలు : ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు అందించే MCA, MBA, MS వంటి ఉద్యోగ ఆధారిత ప్రొఫెషనల్ / టెక్నికల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులు / పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు డిప్లొమా కోర్సులు.
- CIMA (చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్) - లండన్, USA లోని CPA (సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్) నిర్వహించే కోర్సులు.
|
Expenses Covered |
- కళాశాల / పాఠశాల / హాస్టల్‌కు చెల్లించాల్సిన ఫీజు.
- పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల ఫీజు పుస్తకాలు / సామగ్రి / పరికరాలు / యూనిఫాంల కొనుగోలు, కంప్యూటర్ల కొనుగోలు- (కోర్సు పూర్తి చేయడానికి చెల్లించాల్సిన మొత్తం ట్యూషన్ ఫీజులో గరిష్టంగా 20%).
- కేషన్ డిపాజిట్ / బిల్డింగ్ ఫండ్ / రిఫండబుల్ డిపాజిట్ (ట్యూషన్ ఫీజులో గరిష్టంగా 10%).
- ప్రయాణ ఖర్చులు / విదేశాలలో చదువుకోవడానికి పాసేజ్ డబ్బు.
- ద్విచక్ర వాహన కొనుగోలుకు రూ. 50,000 / -
- స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్ మొదలైన ఇతర ఖర్చులు.
|
Interest Rate |
7.30 % నుండి 9.30% (మహిళా విద్యార్థులకు 0.50% రాయితీ అందిస్తారు) |
Processing Charges |
20 లక్షల వరకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. ఇరవైవేలు దాటినా రుణాలకు 10,000/- వరకు ప్రాసెసెసింగ్ చార్జీలు ఉంటాయి. పన్నులు అదనం. |
Margin |
4 లక్షల లోపు రుణాలకు ఎటువంటి మార్జిన్ ఉండదు. 4 లక్షలు దాటే రుణాలకు 5% (ఇండియా), 15% (విదేశీ చదువులకు) వర్తింపజేస్తారు. అంటే 15% కోర్సు ఫీజులను విద్యార్థి భరించాల్సి ఉంటుంది. |
Security |
7.5 లక్షలలోపు రుణాలకు తల్లిదండ్రుల గ్యారెంటీ ఇస్తే సరిపోతుంది. 7.5 లక్షల దాటే రుణాలకు 3rd పార్టీ గ్యారెంటీ తప్పనిసరి. |
Repayment |
రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 15 ఏళ్ల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. |