Advertisement
3000+ Swayam Courses 2024 : ఉచిత ఆన్‌లైన్ కోర్సులు
Online Education Useful websites

3000+ Swayam Courses 2024 : ఉచిత ఆన్‌లైన్ కోర్సులు

స్వయం (SWAYAM) ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికను 2017 లో భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. విద్యారంగంలో చోటు చేసుకుంటున్న ఆధునీకరణకు అనుగుణంగా అందరికి ఆన్‌లైన్ విధానంలో నాణ్యమైన స్కూల్ మరియు కాలేజీ విద్యను అందించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు.

స్వయం వేదిక ద్వారా క్లాస్ 9 నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు అన్ని రకాల కోర్సులను ఆన్‌లైన్ వీడియో పాఠాల ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. ఈ కోర్సులను దేశంలో ఉన్న 9 జాతీయ విద్య సమన్వయకర్తల సహాయంతో రూపొందిస్తుంది. స్వయం కోర్సులను రూపొందించేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా అనుభవం ఉన్న విద్యావేత్తలు, విద్య నిపుణులు కృషి చేస్తున్నారు.

స్వయం ఆన్‌లైన్ కోర్సులు

స్వయం వేదిక ద్వారా అందించే ప్రతి కోర్సు వీడియో పాఠాలతో పాటుగా ఆడియో, ఈబుక్స్, ప్రింటెడ్ రీడింగ్ మెటీరియల్, క్వశ్చన్ మరియు క్విజ్ పేపర్లతో సహా కోర్సుకు సంబంధించిన ఆన్‌లైన్ సపోర్టింగ్ ఫోరంను కలిగిఉంది. స్వయం పోర్టల్ యందు దాదాపు 2,748 పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

స్వయం సమాచారం ప్రకారం ఇప్పటివరకు 18 మిల్లియన్లకు పైగా విద్యార్థులు ఈ వేదికలో ఆన్‌లైన్ కోర్సుల కోసం నమోదు చేసుకున్నారు. మిలియన్ కి పైగా విద్యార్థులు విజయవంతంగా తమ కోర్సును పూర్తిచేసి సర్టిఫికెట్ అందుకున్నారు. స్వయం అందించే కోర్సులకు యూజీసీ, ఏఐసిటీఈ గుర్తింపు ఉంటుంది. ఈ కోర్సులలో సాధించిన మార్కులకు క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ఇవ్వబడుతుంది.

ఈ క్రెడిట్ స్కోరును నేరుగా మీ అకాడమిక్ రికార్డులకు ట్రాన్సఫర్ చేసుకునే అవకాసం కల్పిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారికీ ఎన్‌పిటిఎల్ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ పేరుతో స్వయం సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ సర్టిఫికేటులో మీరు కోర్సు ఎంపిక చేసుకున్న యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ పేరును కూడా పొందుపర్చుతారు.

స్వయం కోర్సులను అందిస్తున్న జాతీయ విద్యా సమన్వయకర్తలు

  1. AICTE : ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (సెల్ఫ్-ఫస్డ్ కోర్సులు & ఇంటర్నేషనల్ కోర్సులు
  2. NPTEL : నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హన్సడ్ లెర్నింగ్ (ఇంజనీరింగ్ కోర్సులు)
  3. UGC : యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (నాన్ టెక్నికల్ పీజీ కోర్సులు)
  4. CEC : కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు)
  5. NCERT : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (స్కూల్ ఎడ్యుకేషన్)
  6. NIOS : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (స్కూల్ ఎడ్యుకేషన్)
  7. GNOU : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఔట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్)
  8. IIMB : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ బెంగుళూరు (మానేజ్మెంట్ స్టడీస్)
  9. NITTTR : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్)

స్వయంలో స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులు

స్వయంల స్కూల్ ఎడ్యుకేషన్ సంబందించిన కోర్సులను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (NCERT) సంస్థలు అందిస్తున్నాయి. పాఠశాల విద్యకు సంబంధించి క్లాస్ 9 నుండి ఇంటర్మీడియట్ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు విద్యార్థులతో పాటుగా శిక్షణ పొందే ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు.

స్వయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు

స్వయం వేదికలో ఉన్న నైపుణ్య అభివృద్ధి కోర్సులను ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR) లు అందిస్తున్నాయి. ఈ కోర్సులు పొలిటిక్నిక్ కోర్సుల మాదిరిగా పోస్ట్ మరియు హయ్యర్ సెకండరీ స్కూల్ నైపుణ్యాలు రెండింటినీ కవర్ చేస్తాయి. ఈ కోర్సులను అన్ని పారిశ్రామిక సంస్థలు ఆమోదిస్తాయి.

స్వయంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు

స్వయంలోని బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను కోర్సులు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హన్సడ్ లెర్నింగ్ (NPTEL), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (CEC) మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ బెంగుళూర్లు అందిస్తున్నాయి. ఈ కోర్సులకు యూజీసీ గుర్తింపు ఉంటుంది. జనరల్ కోర్సులకు యూజీసీ, టెక్నికల్ కోర్సులకు ఏఐసిటీఈ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ఇవ్వబడుతుంది.

స్వయంలో పీజీ కోర్సులు

పీజీ కోర్సులు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హన్సడ్ లెర్నింగ్ (NPTEL), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ బెంగుళూరు మరియు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కలిసి అందిస్తాయి. ఈ కోర్సులకు యూజీసీ గుర్తింపు ఉంటుంది. జనరల్ కోర్సులకు యూజీసీ, టెక్నికల్ కోర్సులకు ఏఐసిటీఈ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ఇవ్వబడుతుంది. ఈ మార్కులను మీ రెగ్యులర్ డిగ్రీ మార్కు లిస్టులో యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

స్వయం కోర్సులు అన్ని రీజనల్ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. కోర్సుల నిడివి 4 వారాల నుండి గరిష్టంగా 12 వారాల నిడివితో అందిస్తారు. కోర్సులు పూర్తి ఉచితంగా అందిస్తారు. సర్టిఫికెట్ కావాలనుకుంటే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెమిస్టరు పరీక్షలు ఏటా జులై మరియు జనవరి నెలలలో నిర్వహిస్తారు.

కెరీర్ మరియు ఆసక్తి సంబంధిత నైపుణ్యాలను నేర్చుకోవాలనుకునే విద్యార్థులు, ఉన్నత విద్యకు దూరమైన ఉద్యోగులు, గృహాణిలకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడతయి. పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్న కోర్సులను నేర్చుకుని కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఉపయోగపడతాయి. కేవలం ఈమెయిల్ ఐడీ సహాయంతో ఈ కోర్సులకు మీరు ఎన్రోల్ అవ్వొచ్చు. మొబైల్, కంప్యూటర్, టీవీ ద్వారా ఈ కోర్సులు మీరు తిలకించవచ్చు

Post Comment