Advertisement
జేఈఈ అడ్వాన్సుడ్ 2023 – ఎగ్జామ్ తేదీ, ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్
Admissions Engineering Entrance Exams NTA Exams

జేఈఈ అడ్వాన్సుడ్ 2023 – ఎగ్జామ్ తేదీ, ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్

జేఈఈ అడ్వాన్సుడ్ 2023 షెడ్యూల్ వెలువడింది. బీఈ/బీటెక్ ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30 నుండి మే 4వ తేదీల మధ్య అందుబాటులో ఉంటుంది. ఈ పరీక్షను 04 జూన్ 2023 న నిర్వహించునున్నారు. ఆర్కిటెక్చర్ & బిజినెస్ ప్లానింగ్ సంబంధించి జూన్ 18, 19 తేదీలలో రిజిస్ట్రేషన్లు స్వీకరించి, జూన్ 21వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు.

జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షను ఐఐటీల్లో ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించబడుతుంది. యేటా మే లేదా జూన్ లో జరిగే ఈ ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయస్థాయిలో డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయస్థాయి మౌళిక సదుపాయాలతో అత్యున్నత సాంకేతిక విద్యని అందిస్తున్న ఐఐటీల్లో చేరేందుకు ఆశావాహుల సంఖ్యా లక్షల్లో ఉంటుంది.

జేఈఈ అడ్వాన్సుడ్ ద్వారా ఐఐటీల్లో చదివే విద్యార్థులు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవటమే కాకుండా కెరీర్ పరంగా టాప్ అంతర్జాతీయ సంస్థలలో పని చేసే అవకాశం ఉన్నందున ఐఐటీల్లో చేరేందుకు యేటా విద్యార్థులు తీవ్రమైన పోటీతత్వంతో సన్నద్ధమౌతారు.

జేఈఈ అడ్వాన్సుడ్ 2023

Exam Name JEE ADVANCED
Exam Type ENTRANCE
Admission For BE/BTech, BArch
Exam Date 04/06/2023
Exam Duration 3 Hours
Exam Level National Level

జేఈఈ అడ్వాన్సుడ్ సమాచారం

జేఈఈ అడ్వాన్సుడ్ ద్వారా అడ్మిషన్ పొందే కోర్సులు

ఐఐటీలు వివిధ కేటగిరీల్లో కాలవ్యవధి ఆధారంగా మూడు రకాల డిగ్రీలలో అడ్మిషన్లు కల్పిస్తున్నాయి.

B.Tech (బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ) 4 years
B.S (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) 4 years
B.Arch (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) 5 years
డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంటెక్) 5 years
డ్యూయల్ డిగ్రీ (బీఎస్ + ఎంఎస్) 5 years
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 years
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ 5 years

జేఈఈ అడ్వాన్సుడ్ ఎలిజిబిలిటీ

  1. జేఈఈ మెయిన్స్ (పేపర్ 1) క్వాలిఫై అయిన టాప్ 245000 మంది అభ్యర్థులలో ఒకరై ఉండాలి.
  2. అభ్యర్థి 1995 అక్టోబర్ 1 తర్వాత జన్మించి ఉండాలి. గరిష్టంగా అభ్యర్థి వయసు 25 ఏళ్ళు మించకూడదు. SC, ST, PwD అభ్యర్థులకు 5 ఏళ్ళు సడలింపు ఉంటుంది.
  3. అభ్యర్థులు వరుసగా రెండు ఏళ్ళు మాత్రమే జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షకు అనుమతించబడతారు.
  4. అభ్యర్థులు 75% మార్కులతో జూన్ 2020 నాటికి 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తీ చేసి ఉండాలి. SC,ST మరియు PwD కేటగిరి వారికీ 65% మార్కులు తప్పనిసరి.
  5. అభ్యర్థులు ఇంతకు ముందు  ఐఐటీల్లో ఎటువంటి ప్రవేశాలు పొంది ఉండకూడదు.

జేఈఈ అడ్వాన్సుడ్ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ ఇంజనీరింగ్: 30 ఏప్రిల్ 2023
ఆర్కిటెక్చర్ : 18 జూన్ 2023
దరఖాస్తు చివరి తేదీ ఇంజనీరింగ్ : 04 మే 2023
ఆర్కిటెక్చర్ : 19 జూన్ 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 29 మే 2023
పరీక్ష తేదీ ఇంజనీరింగ్ : 04 జూన్ 2023
ఆర్కిటెక్చర్ : 21 జూన్ 2023
ఫలితాలు 25 జూన్ 2023
సీట్ల కేటాయింపు జులై 2023

జేఈఈ అడ్వాన్సుడ్ 2023 దరఖాస్తు ఫీజు

భారతీయ విద్యార్థులకు మహిళలు 1,450/-
SC, ST, PwD అభ్యర్థులకు 1,450/-
ఇతరులు 2,900/-
విదేశీ విద్యార్థులకు సార్క్ దేశాలనుండి వచ్చే విద్యార్థులకు USD 90
బయట సార్క్ దేశాల నుండి USD 180

జేఈఈ అడ్వాన్సుడ్ దరఖాస్తు విధానం

జేఈఈ అడ్వాన్సుడ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవ సెంటర్ కి వెళ్లి సంబంధిత జేఈఈ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అవసరమయ్యే సర్టిఫికెట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. ఈ దరఖాస్తు ప్రక్రియ మూడు అంచెల్లో ఉంటుంది.

  1. మొదటి అంచెలో జేఈఈ అడ్వాన్సడ్ యొక్క అధికారిక వెబ్సైటు లో లాగిన్ అయ్యి, మీ సంబంధిత సమాచారం అంతా నింపాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మీ కుటుంబ వివరాలు, చిరునామా, కులం, విద్య అర్హుతలు, పరీక్ష సెంటర్, ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్ వంటి సమాచారమంతా సంబంధిత గడుల్లో నింపాలి.
  2. రెండవ అంచెలో మీరు సంతకం చేసిన ఫోటో తో పాటు, మీరు ఇచ్చిన సమాచారానికి సంబంధించిన డాక్యూమెంట్స్ అన్ని స్కాన్ చేసి jpg ఫైల్ ఫార్మేట్ లో 50kb నుండి 300kb సైజు లో అప్లోడ్ చేయాలి.
  3. మూడవ అంచెలో ప్రవేశ రుసుమును చెల్లించి దరఖాస్తు చివరి అంకాన్ని పూర్తిచేయాలి.
  4. నాల్గువ అంచెలో దరఖాస్తు పూర్తి అయినట్లు చూపించక దాన్ని ప్రింట్ తీసి భద్రపరుసుకోవాలి.

అవసరమయ్యే డాకుమెంట్స్ :

  • SSC మార్కులిస్ట్
  • ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (అవసరమయ్యే వారికీ)
  • PwD సర్టిఫికెట్ (అవసరమయ్యే వారికీ)
  • స్క్రైబ్ అనుమతి లెటర్ (అవసరమయ్యే వారికీ)
  • గెజిటెడ్ నోటిఫికేషన్ లెటర్ (పది మరియు ఇంటర్ సర్టిఫికెట్స్ పైన పేరు సరికానప్పుడు)
  • డీఎస్ సర్టిఫికెట్ (అవసరమయ్యే వారికీ)

తెలుగు రాష్ట్రాలలో జేఈఈ అడ్వాన్సుడ్ ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్: అనంతపూర్ 601, ఏలూరు 602, గుంటూరు 603, కాకినాడ 604, కర్నూలు 605, నెల్లూరు 606, ఒంగోలు 607, రాజమహేంద్రవరం 608, తిరుపతి 609, విజయవాడ 610, విశాఖపట్నం 502, విజయనగరం 503
తెలంగాణ : హైదరాబాద్ 629, కరీంనగర్ 630, ఖమ్మం 631, మహబూబ్ నగర్ 632, నిజామాబాదు 633, వరంగల్ 634.

జేఈఈ అడ్వాన్సుడ్ అడ్మిట్ కార్డు

జేఈఈ అడ్వాన్సుడ్ దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన వారందరు సంబంధిత తేదీల్లో జేఈఈ అడ్వాన్సడ్ అధికారిక వెబ్సైటు నుండి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డు పై మీ పేరు, రోల్ నెంబర్, మీ ఫోటో, సంతకం, కేటగిరి, పరీక్ష కేంద్రం చిరునామా వంటివి ఉంటాయి. మీ సమాచారం లో ఏదైనా తప్పిదాలు ఉంటె సంబంధిత జోన్ అధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్ళండి.

Zone Wise
Institutes
Address for
Correspondence
Phone Number and
Email
South
IIT Hyderabad*
IIT Madras
IIT Palakkad
IIT Tirupati
Chairman
JEE (Advanced) 2019
IIT Hyderabad
Kandi-602285, Sangareddy
Hyderabad
Phone: +91 40 23016157
Fax: +91 40 23016444
E-mail: jee@iith.ac.in

జేఈఈ అడ్వాన్సడ్ 2023 ఎగ్జామ్ నమూనా

జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష విధానం, దాని ప్రశ్నల స్థాయి సాధారణ అంచనాలకు దూరంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగే క్లిష్టమైన ప్రవేశ పరీక్షలలో జేఈఈ అడ్వాన్సడ్ మొదటి వరుసలో ఉంటుంది. యేటా ఏదో ఒక మార్పుతో దర్శినమిచ్చే జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు ఒకే రోజు రెండు వేరువేరు షిఫ్ట్ లలో నిర్వహించబడతాయి.

మొదటి షిఫ్ట్ లో పేపర్ 1 ఉదయం 9 నుండి 12 వరకు జరుగుతుంది. రెండవ షిఫ్ట్ లో పేపర్ 2 మధ్యాహ్నం 2 నుండి 5 వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్సడ్ ప్రశ్నల స్థాయి కొంచెం కఠినంగా విద్యార్థుల ప్రాక్టికల్ నాలెడ్జ్ ని వెలికితీస్తూ, సబ్జెక్టు యందు వారి అవగహన తీరును పరీక్షించే విధంగా ఉంటాయి.

  • పరీక్ష ఆన్‌లైన్ (CBT) విధానంలో జరుగుతుంది.
  • ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంటాయి.
  • పరీక్ష న్యూమరికాల్ మరియు ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంలో జరుగుతుంది.
  • పరీక్ష సమయం ఒక్కో పేపర్ 3 గంటలు.
  • ప్రశ్నలు మూడు సెక్షన్లలో  ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్ సబ్జెక్టుల నుండి ఉంటాయి.

జేఈఈ అడ్వాన్సడ్ లో ఇచ్చే ప్రశ్నల సంఖ్యా, ప్రశ్నల విధానం ఒకే రీతిలో ఉండదు. ప్రతి యేటా పరీక్ష విధానం మారుతూ ఉంటుంది. గత ఏడాది పరీక్ష జరిగిన విధానం ఆధారంగా చూసుకుంటే..

PAPER 1 (ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్)
సెక్షన్ 1 ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన సమాదానాలు ఉండే ప్రశ్నలు  6  (24 మార్కులు)
సెక్షన్ 2 న్యూమరికాల్ విధానంలో సమాధానాలు ఉండే ప్రశ్నలు  8  (24 మార్కులు)
సెక్షన్ 3 ఒక్క సరైన సమాధానం ఉన్న పేరాగ్రాఫ్ ప్రశ్నలు  4  (12 మార్కులు )

ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT)

PAPER 2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్)
సెక్షన్ 1 ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన సమాదానాలు ఉండే ప్రశ్నలు 6  (24 మార్కులు)
సెక్షన్ 2 న్యూమరికాల్ విధానంలో సమాధానాలు ఉండే ప్రశ్నలు  8  (24 మార్కులు)
సెక్షన్ 3 సరైన జతలు కూడె ప్రశ్నలు   4  (12 మార్కులు )

సరైన సమాధానం ఇవ్వని ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి

జేఈఈ అడ్వాన్సడ్ 2023 సిలబస్

Physicis Download
Chemistry Download
Mathematics Download
B.ARCH Download

జేఈఈ అడ్వాన్సుడ్ ర్యాంకింగ్ విధానం

జేఈఈ అడ్వాన్సుడ్ ర్యాంకింగ్ ప్రక్రియ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. ఆల్ ఇండియా ర్యాంకింగ్ పద్దతిలో విడుదల చేసే ఈ ర్యాంకుల విధానంలో సంక్లిష్టమైన కసరత్తు ఉంటుంది. దీనికంటే ముందు ఈ పరీక్ష రెండు పేపర్లకు హాజరయిన వారిని మాత్రమే ర్యాంకింగు కోసం పరిగణలోకి తీసుకుంటారు.

ఇక రెండవ అంచెలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ ల రెండు పేపర్లలో సరిసమంగా స్కోర్ చేసిన వారిని వడపోస్తారు. ఇలా మూడు సబ్జెక్టుల యొక్క రెండు పేపర్ల స్కోర్ ని విడివిడిగా లెక్కించి ర్యాంకు లిస్ట్ తయారుచేస్తారు.joint-entrance-examination-advanced

ఇలా వచ్చిన లిస్టులో మొత్తం స్కోర్ సమమైన అభ్యర్థులు ఇద్దరికీ మించి ఉన్నప్పుడు..వారిద్దరికి వచ్చిన మొత్తం స్కోర్ లో అధిక పాజిటివ్ స్కోర్ వచ్చిన అభ్యర్థికి మొదటి ప్రాధన్యత ఇస్తారు. ఇప్పటికి కూడా సమమైతే మాథ్స్ లో అధిక స్కోర్ సాధించిన అభ్యర్థిని పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ కూడా సాధ్యం కాకుంటే ఫిజిక్స్ లో సాధించిన స్కోర్ ను ఆధారంగా తీసుకుంటారు.

అప్పటికి సాధ్యం కాకపోతే ఇరువురికి సమానమైన ర్యాంకు ప్రకటిస్తారు. ఇలా వచ్చిన ర్యాంకు లిస్ట్ నుండి కేటగిరి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. ఆ తర్వాత ఫైనల్ ర్యాంకులు విడుదల చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ర్యాంకులు వచ్చిన వారందరికీ సీట్లు లభించినట్లు కాదు..కౌన్సిలింగ్ సమయంలో అందుబాటులో ఉన్న సీట్లు సంఖ్య పై మీ అడ్మిషన్ ఆధారపడి ఉంటుంది .

జేఈఈ అడ్వాన్సుడ్ రిజర్వేషన్ల కోటా

ఆర్థికంగా బలహీనమైన విభాగాలు (EWS) 10%
షెడ్యూల్డ్ కాస్ట్ (SC) 15%
షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) 7.5%
ఇతర వెనకబడిన తరగతులు (OBC-NCL) 27%
శారీరిక వైకల్యం (PWD) 5%
  • శారీరక వైకల్యం (PWD) కోటా కు  ప్రతి రిజర్వేషన్ కెటగిరి నుండి 5%రిజర్వేషన్ వాటా ఇవ్వబడుతుంది.
  • OBC-NCL (నాన్ క్రీమి లేయర్) లిస్ట్ లో లేని ఓబీసీ లు జనరల్ కేటగిరి కిందకు వస్తారు. వారికీ ఎటువంటి OBC-NCL రిజర్వేషన్ వర్తించదు.
  • త్రివిధ దళాల్లో సేవలు అందించిన/ అందిస్తున్న వారి పిల్లకు ప్రతి ఇనిస్టిట్యూట్ లో 2 సీట్లు కేటాయించబడ్డాయి. ఈ రెండు సీట్లు జనరల్ కోటా నుండి సర్దుబాటు చేస్తారు.
  • ప్రతి కోర్సులో 10% సీట్లు విదేశీ విద్యార్థులకు కేటాయిస్తారు.
  •  పురుష అభ్యర్థుల సంఖ్యాకు సరిసమమంగా మహిళా అభ్యర్థులను పెంచే ఉద్దేశంతో సూపర్‌న్యూమరీ కోటాలో 17% సీట్లు మహిళలకు కేటాయిస్తున్నారు.

జేఈఈ అడ్వాన్సుడ్ ఇతర సమాచారం

JEE Brochure JEE Admit Card download
IITs List JEE Advanced Result
Other Institutes Seat Information
Past Question Papers Opening & Closing Ranks
JEE Advanced Mock Tests Certificate Format