ఎక్స్‌ట్రామార్క్స్ : కేజీ నుండి 10+2 వరకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్
Online Education Useful websites

ఎక్స్‌ట్రామార్క్స్ : కేజీ నుండి 10+2 వరకు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్

ఇండియా నుండి రూపొందించబడిన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థల్లో ఒకానొక ఉత్తమమైనది ఎక్స్‌ట్రామార్క్స్. దీన్ని 2009 లో అతుల్ కులశ్రేష్ఠ రూపొందించారు. ఎక్స్‌ట్రామార్క్స్ జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలతో పాటుగా కేజీ నుండి 10+2 వరకు ఆన్‌లైన్ లైవ్ క్లాసులు నిర్వహిస్తుంది. అలానే వాటికీ సంబంధించిన ఫౌండేషన్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తుంది.

ఎక్స్‌ట్రామార్క్స్ అత్యుత్తమ ఆన్‌లైన్ లెర్నింగ్ కంటెంట్ అందిస్తుంది. లైవ్ ఇంట్రాక్టీవ్ క్లాసులతో పాటుగా రికార్డు చేసిన వీడియో క్లాసులను కూడా అందుబాటులో ఉంచుతుంది. ప్రతి క్లాసుకు ఎఐ- ఆధారిత స్టడీబోట్ మరియు వ్యక్తిగత అకాడెమిక్ గురువు అలెక్స్ తో తక్షణ సందేహాల పరిష్కారంకు అవకాశం కల్పిస్తుంది.

ఎక్స్‌ట్రామార్క్స్ విద్యార్థుల అభ్యాస ప్రక్రియ కోసం వర్క్‌షీట్‌లను అందిస్తుంది. అడాప్టివ్ లెర్నింగ్'లో భాగంగా సబ్జెక్టు సంబంధించి అంశాల వారిగా మల్టీమీడియా ఇమేజస్ మరియు మెరుగైన ఆడియో వివరణలను అందుబాటులో ఉంచుతుంది.

extramarks

ప్రవేశ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికతో అగ్రశేణి విద్య నిపుణలతో లైవ్ మరియు రికార్డెడ్ తరగతులను అందిస్తుంది. వీక్లీ నమూనా ఆధారిత పరీక్షలతో పాటుగా రియల్ టైం డౌట్ సాల్వింగ్ సెషన్స్ నిర్వహిస్తారు. ఎక్స్‌ట్రామార్క్స్ వేదికలో జేఈఈ, నీట్ సంబంధించి షార్ట్ టర్మ్ కోర్సులతో పాటుగా పూర్తి ప్రణాళికాబద్ధమైన లాంగ్ టర్మ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

అలానే సాట్, టోఫెల్ వంటి ఇతర ఎలిజిబిలిటీ పరీక్షలకు కూడా గైడెన్స్ అందిస్తుంది. ఆన్‌లైన్ కోర్సులపై ఆసక్తి ఉండే విద్యార్థులు ఇంట్లో అడుగు బయటపెట్టకుండా అతిక్లిష్టమైన జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలను ఎక్స్‌ట్రామార్క్స్ ద్వారా సులభంగా ఛేదించవచ్చు.