Advertisement
నిమ్‌హాన్స్ అడ్మిషన్ టెస్ట్ 2023 : రిజిస్ట్రేషన్ & ఎగ్జామ్ తేదీ
Admissions Medical Entrance Exams

నిమ్‌హాన్స్ అడ్మిషన్ టెస్ట్ 2023 : రిజిస్ట్రేషన్ & ఎగ్జామ్ తేదీ

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్ సంబంధించి మెడికల్ యూజీ, పీజీ మరియు పీహెచ్డీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిమ్‌హాన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 1964 వరకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హాస్పిటల్ ఆఫ్ కర్నాటకగా ఉండే ఈ యూనివర్సిటీని జాతీయ అవసరాల ప్రాతిపదికన పార్లమెంట్ చట్టం ద్వారా 1974 లో నిమ్‌హాన్స్ ఏర్పాటు చేశారు.

1994 లో యూజీసీ డ్రీమ్డ్ యూనివెర్సిటీగా గుర్తింపు ఇవ్వడంతో నిమ్‌హాన్స్ పూర్తి అటానమస్ యూనివెర్సిటీగా మారింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ప్రస్తుతం మెడికల్ కేటగిరిలో నిమ్‌హాన్స్ 4వ ర్యాంకులో ఉంది.

Exam Name NIMHANS 2023
Exam Type Entrance Exam
Admission For UG, PGD, Phd MD etc
Exam Date NA
Exam Duration 3.00 Hours
Exam Level National Level

నిమ్‌హాన్స్ బీఎస్సీ కోర్సులు, నర్సింగ్ కోర్సులు, సర్టిఫికేటెడ్ కోర్సులు మరియు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం యెటువంటి ప్రవేశ పరీక్షా నిర్వహించదు. ఈ కోర్సులలో ప్రవేశాలు మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా చేపడతారు. కాకుంటే ఆయా కోర్సులలో అడ్మిషన్ పొందాలంటే ప్రవేశ పరీక్షా నోటిఫికేషన్ తో పాటుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎండీ, ఎంఎస్, డిఎం, ఎంసీహెచ్,  పీహెచ్డీ మరియు ఇంకొన్ని సూపర్ స్పెషలిటీ & ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కోసం ప్రవేశ పరీక్షా నిర్వహిస్తారు. ఎంట్రన్స్ టెస్టులో మెరిట్ సాధించిన వారికి ఇంటర్వ్యూ జరిపి సీట్లు కేటాయిస్తారు. ఆయా కోర్సులలో సీట్ల సంఖ్యా పరిమితంగా ఉంటుంది. పీహెచ్డీ, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కు ఎంపికైన వారికీ నెలకు 20 నుండి 28 వేల వరకు స్టైపెండ్ అందిస్తుంది.

నిమ్‌హాన్స్ అడ్మిషన్ టెస్ట్ ముఖ్యమైన తేదీలు

నిమ్‌హాన్స్ దరఖాస్తు ప్రారంభం -
దరఖాస్తు గడువు -
నిమ్‌హాన్స్ ఎగ్జామ్ తేదీ -
నిమ్‌హాన్స్ ఫలితాలు -

నిమ్‌హాన్స్ కోర్సుల అడ్మిషన్ ఎలిజిబిలిటీ

  • ఎండీ, ఎంఎస్, డిఎం, ఎంసీహెచ్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కలిగిన ఎంబీబీఎస్ డిగ్రీ కలిగి ఉండాలి
  • పీహెచ్డీ మరియు ఇతర ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు యూజీసీ లేదా సీఎస్ఐఆర్ నెట్ అర్హుత సాధించి ఉండాలి
  • ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ & పీహెచ్డీ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎండీ, ఎంఎస్, డిఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
  • ఎంఎస్సీ / ఎంఏ ఎంఎస్డబ్ల్యు/ బీఏఎంఎస్ / బీఈ/ బీటెక్/ బీఎస్సీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు యూజీసీ గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • బీఎస్సీ, నర్సింగ్, మరియు ఇతర నాన్ మెడికల్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ బయాలజీ గ్రూపుల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి
  • పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ & సూపర్ స్పెషలిటీ కోర్సులకు దరఖాస్తు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సు 32 (ఎంబీబీఎస్), 37 (పీజీ మెడికల్ డిగ్రీ) మించకూడదు
  • ఎంఎస్సీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్ళు మించకూడదు
  • అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 27 ఏళ్ళు మించకూడదు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది

నిమ్‌హాన్స్ అడ్మిషన్ టెస్ట్ రిజిస్ట్రేషన్

నిమ్‌హాన్స్ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు నిమ్‌హాన్స్ (www.nimhans.ac.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నిమ్‌హాన్స్ అడ్మిషన్ బోర్డు నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఎగ్జామ్ సెంటర్స్

సెషన్ I సెషన్ II
 PG courses : బెంగుళూరు, చెన్నై, కొచ్చిన్ & హైదరాబాద్, పూణే, ఢీల్లీ & కోలకతా
UG courses : బెంగుళూరు, చెన్నై, కొచ్చిన్ & హైదరాబాద్
PG courses : బెంగుళూరు & ఢీల్లి

ట్యూషన్ మరియు ఇతర ఫీజులు పీజీ కోర్సులు

NIMHANS

యూజీ & డిప్లొమా కోర్సులు

NIMHANS

నిమ్‌హాన్స్ అడ్మిషన్ టెస్ట్ ఫార్మేట్

నిమ్‌హాన్స్ ప్రవేశ పరీక్ష సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్ష వ్యవధి పేపర్ వారీగా గరిష్టంగా 90 నిముషాల నుండి కనిష్టంగా 30 నిముషాలు ఉంటుంది. అన్ని పరీక్షా పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. జెనరల్ కోర్సుల కోసం నిర్వహించే ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ 90 నిముషాల నిడివితో 100 మార్కులకు జరుగుతుంది.

ఎండి ఇన్ సైకియాట్రీ, డిఎం ఇన్ న్యూరాలజీ, ఎం.సి.హెచ్ ఇన్ న్యూరో సర్జరీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 60 నిముషాల నిడివితో 70 మార్కులకు నిర్వహిస్తారు. పై మూడు కోర్సులలో ఏదైనా ఒక కోర్సుకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 నిముషాల నిడివితో 30 మార్కులకు పరీక్షా జరుపుతారు. తప్పు సమాధానం చేసే ప్రశ్నలకు 0.25 మార్కులు తొలగిస్తారు.

ఎండీ, డీఎం కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులలో ఎంబీబీఎస్ ఎలిజిబిలిటీ అభ్యర్థులకు, పీజీ కోర్సుల ఎలిజిబిలిటీ అభ్యర్థులకు వేరువేరుగా పరీక్షా నిర్వహిస్తారు. 12 పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు రెండు స్టేజీల్లో పరీక్షా జరుపుతారు. మొదట స్టేజిలో 80 మార్కులకు ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. రెండవ స్టేజిలో 20 మార్కులకు క్లినికల్,/ప్రాక్టికల్/ల్యాబ్ ఆధారిత అస్సెస్సెమెంట్ (OSCE) జరుపుతారు.

పేపర్/సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
జెనరల్ కోర్సులకు 100 ప్రశ్నలు 100 మార్కులు 90 నిముషాలు
ఎండీ, ఎంసీహెచ్  & ఎండిఎస్ 70 ప్రశ్నలు 70 మార్కులు 60 నిముషాలు
ఎండీ or  ఎంసీహెచ్ or  ఎండీఎస్ (సింగల్ పేపర్) 30 ప్రశ్నలు 30 మార్కులు 30 నిముషాలు
ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ స్టేజి 1 : 80 ప్రశ్నలు
స్టేజి 2: అస్సెస్సెమెంట్ టెస్ట్
80 మార్కులు
20 మార్కులు
60 నిముషాలు

నిమ్‌హాన్స్ రిజర్వేషన్లు & అడ్మషన్ ప్రక్రియ

నిమ్‌హాన్స్ అడ్మిషన్ ప్రక్రియ నిమ్‌హాన్స్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ సెట్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. సీబీటీ పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటిస్తారు. అర్హుత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ర్యాంకుల ప్రకటనలో 50 శాతం వెయిటేజి ఆన్లైన్ టెస్టుకు 50 శాతం ఇంటర్వ్యూ మార్కులకు ఉంటుంది.

అందుబాటులో ఉండే సీట్లలో 57% శాతం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు విదేశీ విద్యార్థులకు ఇతర కేటగిరి విద్యారులకు కేటయిస్తారు. రిజర్వేషన్ పరమైన సీట్ల కేటాయింపు 2006 సంబంధించిన అడ్మిషన్ చట్టం నియమాలకు అనుగుణంగా జరుగుతుంది. వివిధ కేటగిర్లకు సంబందించిన రిజర్వేషన్ కోటా ఈ క్రింది విదంగా ఉంటుంది.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఓబీసీ
ఎస్సీ
ఎస్టీ
ఈడబ్ల్యూఎస్
పిహెచ్
27%
15%
7.5%
10%
5%