భారతదేశంలో ఇప్పటివరకు 53 పులుల రిజర్వ్‌లు నోటిఫై చేయబడ్డాయి. యుపిలోని రాణిపూర్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో 53వ టైగర్ రిజర్వ్‌గా ప్రకటించబడింది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలో అత్యధిక పులుల సాంద్రతను కలిగి ఉంది. అలానే భారతదేశంలో అత్యధిక పులుల జనాభా ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తరువాత కర్ణాటక మరియు ఉత్తరాఖండ్ ఉన్నాయి.
మధ్యప్రదేశ్ యందు అత్యధికంగా 6 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. మహారాష్ట్రలోని బోర్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోని అతి చిన్న టైగర్ రిజర్వ్‌గా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ యందు ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా నోటిఫై చేయబడింది. నాగ్‌పూర్‌ను టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా లేదా టైగర్ గేట్‌వే ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద టైగర్ రిజర్వ్‌లు
- నాగార్జునసాగర్ శ్రీశైలం (3296.31 చ.కి.మీ.)
- మనస్ నేషనల్ పార్క్ (3150.92 చ.కి.మీ.)
- మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ (2768.52 చ.కి.మీ.)
- సిమిలిపాల్ నేషనల్ పార్క్ (2750 చ.కి.మీ.)
- అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (2611.39 చ.కి.మీ.)
- సుందర్‌బన్స్ టైగర్ రిజర్వ్ (2584.89 చ.కి.మీ.)
- దుధ్వా టైగర్ రిజర్వ్ (2201.7748 చ.కి.మీ.)
- సాత్పురా టైగర్ రిజర్వ్ (2133.30 చ.కి.మీ.)
- నమ్దఫా టైగర్ రిజర్వ్ (2052.82 చ.కి.మీ.)
- కన్హా టైగర్ రిజర్వ్ (2051.79 చ.కి.మీ.)
భారతదేశంలోని టైగర్ రిజర్వ్‌లు
టైగర్ రిజర్వ్‌లు | రాష్ట్రం | ఏర్పాటు సంవత్సరం |
---|---|---|
బందీపూర్ టైగర్ రిజర్వ్ | కర్ణాటక | 2007 |
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ | ఉత్తరాఖండ్ | 2010 |
కన్హా టైగర్ రిజర్వ్ | మధ్యప్రదేశ్ | 2007 |
మనస్ నేషనల్ పార్క్ | అస్సాం | 2008 |
మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ | మహారాష్ట్ర | 2007 |
పలమావు టైగర్ రిజర్వ్ | జార్ఖండ్ | 2012 |
రణతంబోర్ నేషనల్ పార్క్ | రాజస్థాన్ | 2007 |
సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ | ఒడిశా | 2007 |
సుందర్బన్ టైగర్ రిజర్వ్ | పశ్చిమ బెంగాల్ | 2007 |
పెరియార్ టైగర్ రిజర్వ్ | కేరళ | 2007 |
సరిస్కా టైగర్ రిజర్వ్ | రాజస్థాన్ | 2007 |
బక్సా టైగర్ రిజర్వ్ | పశ్చిమ బెంగాల్ | 2009 |
ఇంద్రావతి టైగర్ రిజర్వ్ | ఛత్తీస్‌గఢ్ | 2009 |
కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ | అరుణాచల్ ప్రదేశ్ | 1987 |
నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ | ఆంధ్రప్రదేశ్ | 2007 |
దుధ్వా టైగర్ రిజర్వ్ | ఉత్తరప్రదేశ్ | 2010 |
ముందంతురై టైగర్ రిజర్వ్ | తమిళనాడు | 2007 |
వాల్మీకి టైగర్ రిజర్వ్ | బీహార్ | 2012 |
పెంచ్ నేషనల్ పార్క్ | మధ్యప్రదేశ్ | 2007 |
తడోబా నేషనల్ పార్క్ | మహారాష్ట్ర | 2007 |
బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ | మధ్యప్రదేశ్ | 2007 |
పన్నా టైగర్ రిజర్వ్ | మధ్యప్రదేశ్ | 2007 |
దంప టైగర్ రిజర్వ్ | మిజోరాం | 2007 |
భద్ర టైగర్ రిజర్వ్ | కర్ణాటక | 2007 |
పక్కే టైగర్ రిజర్వ్ | అరుణాచల్ ప్రదేశ్ | 2012 |
నమేరి టైగర్ రిజర్వ్ | అస్సాం | 2000 |
సాత్పురా టైగర్ రిజర్వ్ | మధ్యప్రదేశ్ | 2007 |
అనమలై టైగర్ రిజర్వ్ | తమిళనాడు | 2007 |
ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ | ఛత్తీస్‌గఢ్ | 2009 |
సత్కోసియా టైగర్ రిజర్వ్ | ఒడిశా | 2007 |
కజిరంగా నేషనల్ పార్క్ | అస్సాం | 2007 |
అచనక్మార్ టైగర్ రిజర్వ్ | ఛత్తీస్‌గఢ్ | 2009 |
కాళి టైగర్ రిజర్వ్ | కర్ణాటక | 2007 |
సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్ | మధ్యప్రదేశ్ | 2011 |
ముదుమలై టైగర్ రిజర్వ్ | తిమిళనాడు | 2007 |
నాగర్‌హోల్ టైగర్ రిజర్వ్ | కర్ణాటక | 2007 |
పరంబికులం టైగర్ రిజర్వ్ | కేరళ | 2009 |
సహ్యాద్రి టైగర్ రిజర్వ్ | మహారాష్ట్ర | 2012 |
బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ | కర్ణాటక | 2007 |
కవాల్ టైగర్ రిజర్వ్ | తెలంగాణ | 2012 |
సత్యమంగళం టైగర్ రిజర్వ్ | తమిళనాడు | 2013 |
ముకుందర టైగర్ రిజర్వ్ | రాజస్థాన్ | 2013 |
నవేగావ్ నాగ్జిరా టైగర్ రిజర్వ్ | రాజస్థాన్ | 2013 |
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ | తెలంగాణ | 2015 |
పిలిభిత్ టైగర్ రిజర్వ్ | ఉత్తర ప్రదేశ్ | 2014 |
బోర్ టైగర్ రిజర్వ్ | మహారాష్ట్ర | 2012 |
రాజాజీ టైగర్ రిజర్వ్ | ఉత్తరాఖండ్ | 2015 |
ఒరాంగ్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ | అస్సాం | 2016 |
కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ | అరుణాచల్ ప్రదేశ్ | 2017 |
శ్రీవిల్లిపుత్తూరు టైగర్ రిజర్వ్ | తమిళనాడు | 2021 |
రామ్‌ఘర్ విష్ధారి టైగర్ రిజర్వ్ | రాజస్థాన్ | 2022 |
రాణిపూర్ టైగర్ రిజర్వ్ | ఉత్తరప్రదేశ్ | 2022 |
నమ్దఫా టైగర్ రిజర్వ్ | అరుణాచల్ ప్రదేశ్ | 2007 |