Advertisement
ఏఎఫ్ఎంసీ అడ్మిషన్లు 2023 : రిజిస్ట్రేషన్, షెడ్యూల్, ఎగ్జామ్ ఫార్మేట్
Admissions Medical Entrance Exams

ఏఎఫ్ఎంసీ అడ్మిషన్లు 2023 : రిజిస్ట్రేషన్, షెడ్యూల్, ఎగ్జామ్ ఫార్మేట్

పుణెలోని ఆర్మడ్ ఫోర్సెస్ అఫ్ మెడికల్ కాలేజ్ (AFMC) యందు ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి. సాయుధ దళాలకు సంబంధించే వైద్యులుగా పనిచేయాలనే ఆంక్ష ఉన్నవారికి ఆర్మడ్ ఫోర్సెస్ అఫ్ మెడికల్ కాలేజ్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఏటా జూన్ లేదా జులైలో ఒక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ఈ కాలేజీలో ప్రవేశాలు కల్పిస్తారు.

Exam Name AFMC 2023
Exam Type Entrance Exam
Admission For MBBS
Interview Date June/July
Exam Duration 30 Minutes
Exam Level University Level

ఏఎఫ్ఎంసీ నాసిక్ లో ఉన్న మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ కు అనుబంధ సంస్థగా పని చేస్తుంది. ఉన్నతమైన వైద్య విద్యకు మరియు వైద్య పరిశోదలకు నెలవైన ఏఎఫ్ఎంసీకు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ గుర్తింపు ఉంది. ఏఎఫ్ఎంసీ అడ్మిషన్ పొందేందుకు నీట్ యూజీ పరీక్షలో అర్హుత సాధించాల్సి ఉంటుంది. నీట్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థుల నుండి మాత్రమే దరఖాస్తులు స్వకరిస్తుంది.

ఏఎఫ్ఎంసీ ఎలిజిబిలిటీ

ఏఎఫ్ఎంసీలో ఎంబీబీఎస్ ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా ఆ ఏడాది జరిగిన నెట్-యూజీ పరీక్షలో అర్హుత సాధించి ఉండాలి.

  • తప్పనిసరి అవివాహితులై ఉండాలి. కోర్సు మధ్యలో వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వబడదు.
  • అభ్యర్థులు మానసికంగా, బౌతికంగా పూర్తి ఆరోగ్యాంగా ఉండాలి .
  • ప్రవేశ సమయానికి అభ్యర్థుల వయసు 17 ఏళ్ళ నుండి 24 ఏళ్ళ మధ్య ఉండాలి.
  • 60 శాతం తప్పనిసరి మార్కులతో కెమిస్ట్రీ, ఫిజిక్స్ మరియు బయాలజీ సబ్జెక్టుల యందు 10+2 లేదా ఇంటర్మీడియట్  పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లీషులో 50శాతం మార్కులు తప్పనిసరి. పదిలొ తప్పనిసరిగా గణితం ఒక సబ్జెక్టు గా చదువుకుని ఉండాలి.
  • 10+2 తర్వాత ప్రీ ప్రొఫిషినల్ లేదా ప్రీ మెడికల్ పరీక్షలో ఉత్తీర్ణత అయిన వారు కూడా అర్హులు.
  • ఫిజిక్స్, కెమిస్ట్రీ బయాలజీ, ఇంగ్లీష్ లతో డిగ్రీ మొదటి ఏడాది లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అర్హులు.

ఏఎఫ్ఎంసీ సీట్లు సంఖ్యా

AFMC లో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 5 సీట్లును విదేశీ మిత్రదేశాల అభ్యర్థుల కోసం భారత ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. మిగతా 145 సీట్లలో 115 సీట్లు పురుషులకు, 30 సీట్లు మహిళలకు కేటాయించబడి ఉంటాయి.

ఏఎఫ్ఎంసీలో ఎంబీబీఎస్ కోర్సు కాలవ్యవధి

AFMC లో ఎంబీబీఎస్ కోర్సు కాలవ్యవధి నాలుగున్నర సంవత్సరాలు ఉంటుంది. ఈ కాలవ్యవధిలో విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సర్వీస్ హాస్పిటల్ లలో ఒక ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ ట్రైనింగ్ తీసుకోవలసి ఉంటుంది.

ఏఎఫ్ఎంసీ దరఖాస్తు & ఎగ్జామ్ నమూనా

ఏఎఫ్ఎంసీలో ఎంబీబీఎస్ ప్రవేశం కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ ఏడాది జరిగిన నెట్-యూజీ పరీక్షలో అర్హుత సాధించి ఉండాలి. నెట్ ఫలితాల తర్వాత  అర్హుత సాధించిన అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ కమిటీ వెబ్‌సైట్ ద్వారా ఏఎఫ్ఎంసీలో ఎంబీబీస్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఆఖరి తేదీ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారి లిస్ట్ ను డైరెక్టర్ జనరల్ హెల్త్ సైన్సెస్(DGHS) పూణే లో ఉన్న ఏఎఫ్ఎంసీకు అందజేస్తుంది.

ఏఎఫ్ఎంసీ వచ్చిన దరఖాస్తులను నీట్ మెరిట్ ఆధారంగా  స్క్రీనింగ్ టెస్ట్  కోసం షార్ట్ లిస్ట్ తయారుచేస్తుంది. షార్ట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థుల జాబితాను వారి నీట్ రిజిస్టర్ నెంబర్ తో సహా ఏఎఫ్ఎంసీ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచుతుంది.

షార్ట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులను జూన్ లేదా జులై లో పూణే లోని ఏఎఫ్ఎంసీలో నిర్వహించే ToELR (టెస్ట్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్రెహెన్షన్, లాజిక్ అండ్ రీజనింగ్), సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ (PAT), ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్‌ కోసం పిలుస్తారు.

ఆన్‌లైన్‌ (CBT) విధానంలో జరిగే ToELR పరీక్షలో మొత్తం 40 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ 40 ప్రశ్నలకు 30 నిమిషాల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 2 మార్కులు ఇవ్వబడతాయి.

తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 0.5 మార్కులు తగ్గించబడతాయి. 80 మార్కులకు జరిగే ToELR  మార్కులను 720 మార్కులకు జరిగే నీట్ పరీక్ష మార్కులతో కలిపి మొత్తం 800 (80+720=800) మార్కులకు సమం చేస్తారు.

తుది మార్కులను 200 లకి లెక్కించటానికి  అభ్యర్థి సాధించిన మార్కులను మరియు పరీక్ష మొత్తం మార్కులను 4 చేత విభజిస్తారు. ఈ 200 మార్కులలో అభ్యర్థి సాధించిన మార్కులను మరియు 50 మార్కులకు జరిగే ఇంటర్వ్యూ లో సాధించిన మార్కులను కలిపి తుది మార్కులు ప్రకటిస్తారు.

అభ్యర్థుల సాధించిన మెరిట్ ఆధారంగా అబ్బాయిలకు, అమ్మాయిలకు రెండు వేరువేరు మెరిట్ జాబితాలను రూపొందిస్తారు. అభ్యర్థులు సాధించిన తుది మెరిట్ ఆధారంగా మాత్రమే ప్రవేశాలు కలిపిస్తారు. మిగతా వారు వెయిటింగ్ జాబితాలో ఉంటారు.

ఈ జాబితాలు  ఏఎఫ్ఎంసీకు చెందిన www.mcc.nic.in, www.afmc.nic.in మరియు www.afmcdg1d.gov.in వెబ్‌సైట్ లలో అందుబాటులో ఉంటాయి. ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి వివరాలు అభ్యర్థులకు పంపించారు. కావున పై చెప్పిన వెబ్‌సైట్ లను తరసు సందర్శిస్తూ ఉండండి.

ఏఎఫ్ఎంసీ ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రక్రియ

తుది మెరిట్ మరియు వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్థులు ఏఎఫ్ఎంసీ ఇచ్చిన కౌన్సిలింగ్ తేదీలు మరియు సమయాలను అనుసరించి ఏఎఫ్ఎంసీలో 4వ గేటు వద్ద ఉన్న అడ్మిషన్ సెల్ లో రిపోర్ట్ చేయాలి. కౌన్సిలింగ్ హాజరయ్యే ముందు నీట్ ర్యాంకు కార్డు నుండి మెడికల్ సర్టిఫికెట్ వరకు అన్ని డాక్యూమెంట్స్ అందుబాటులో ఉంచుకోండి. అడ్మిషన్ ప్రక్రియ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో ప్రారంభమౌతుంది.

అభ్యర్థి వయసు, విద్య అర్హుతలు వంటివి దృవీకరించక మరో సారి మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులు సర్వీస్ లియబిలిటీ బాండ్ అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు కోర్సు పూర్తియ్యాక 7 సంవత్సరాలు మెడికల్ ఆఫీసర్ గా ఆర్మడ్ ఫోర్సెస్ కోసం పనిచేయాల్సి ఉంటుంది.

దీని కోసం అభ్యర్థులు నోటరీతో 500 రూపాయల నాన్ జ్యూడిషల్ స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ రాయించి అందించవలసి ఉంటుంది. ఆ తర్వాత నిర్దేశించిన ఫీజు మొత్తం చెల్లించి, ఒరిజినల్ సర్టిఫికెట్లు అన్ని సంబంధిత డీన్ కు అందజేయాల్సి వస్తుంది. దీనితో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.