టీఎస్ పీఈసెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions TS CETs

టీఎస్ పీఈసెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

టీఎస్ పీఈసెట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) లేదా డిప్లొమా ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (D.P.Ed) కోర్సుల్లో మొదటి యేడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. టీఎస్ పీఈసెట్ పరీక్షను టీఎస్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు శాతవాహన యూనివర్సిటీ ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.

టీఎస్ పీఈసెట్ ప్రవేశపరీక్ష రెండు దశలలో జరపడబడుతుంది. మొదటి దశలో అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించగా రెండవ దశలో అభ్యర్థి ఎంచుకునే క్రీడా సంబంధిత అంశంపై నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు.

ఫీజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 బీఇడీ  కాలేజీల్లో 1860 సీట్లు అందుబాటులో ఉండగా, 4 డిప్లొమా కాలేజీల్లో 360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. క్రీడా సంబంధిత మరియు ఫీజికల్ ఫిట్నెస్ సంబంధిత అంశాల యందు ఆసక్తికనబర్చే అభ్యర్థులకు యెంతగానో ఆకర్షించే ఈ కోర్సుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Exam Name TS PECET 2024
Exam Type Entrance Test
Entrance For BP.Ed, D.P.Ed.
Exam Date 10/06/2024 O/W
Exam Level State Level (TS)

టీఎస్ టీఎస్ పీఈసెట్ సమాచారం

టీఎస్ పీఈసెట్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి .
  • అభ్యర్థులు తెలంగాణాకు చెందినవాడయి ...విద్యా నియంత్రణ చట్టానికి సంబంధించిన లోకల్ నియమాలను సంతృప్తిపర్చాలి.
  •  B.P.Ed కోర్సుల కోసం ధరఖాస్తు చేసేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతయి ఉండాలి. అడ్మిషన్ సమయానికి అభ్యర్థి వయసు 19 ఏళ్ళు మించకూడదు.
  • D.P.Ed కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. అడ్మిషన్ సమయానికి అభ్యర్థుల వయస్సు 16 ఏళ్ళు మించకూడదు .
  • ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా(పీటీ ఎస్) పనిచేసే అభ్యర్థులు..ఈ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాల్సిన అవసరంలేదు. వీరు నేరుగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు చెందిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికీ సంబంధిత నోటిఫికేషను అనుసరించి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

టీఎస్ పీఈసెట్ 2024 ముఖ్యమైన తేదీలు

టీఎస్ పీఈసెట్ దరఖాస్తు ప్రారంభం 14 మార్చి 2024
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు 15 మే 2024
టీఎస్ పీఈసెట్ హాల్ టికెట్ జూన్ 2024
టీఎస్ పీఈసెట్ పీఈటీ ఎగ్జామ్ 10 to 13 జూన్ 2024
టీఎస్ పీఈసెట్ ఫలితాలు జులై 2024

టీఎస్ పీఈసెట్ దరఖాస్తు ఫీజు

కేటగిరి ధరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులు 900/-
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 500/-

టీఎస్ పీఈసెట్ దరఖాస్తు విధానం

టీఎస్ పీఈసెట్ కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంభందించిన అధికారక వెబ్సైట్ నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ధరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 800 రూపాయలు నిర్ణహించగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 440 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు రుసుములు టీఎస్/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలలో పాటుగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ విధానాల ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు.చెల్లింపు సమయంలో ఉండే అదనపు సర్వీస్ చార్జీలను అభ్యర్థులే భరించాల్సివుంటుంది.

దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు

పరీక్ష రోజు అభ్యర్థులు అవసరమైన స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికెట్లు తో పాటుగా U.G.D.P.Ed / ఎన్ఐఎస్ / యోగ / స్పోర్ట్స్-మేనేజ్మెంట్ / స్పోర్ట్స్ సైన్స్ / స్పోర్ట్స్ జర్నలిజం / ఒలింపిక్ ఎడ్యుకేషన్ వంటి వివిధ అంశాలలో పొందిన ధృవపత్రాలు మరియు N.C.C. సర్టిఫికేట్ (సి-సర్టిఫికేట్ / బి-సర్టిఫికేట్) ల ఒరిజినల్స్ తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరవ్వాల్సి ఉంటుంది.

టీఎస్ పీఈసెట్ పరీక్ష విధానం

బీ.పి.ఎడ్ (రెండేళ్ళు) మరియు డి.పి.ఎడ్ (రెండేళ్ళు) కోర్సులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు దశలలో పరీక్ష నిర్వహిస్తారు. అవి ఎ) శారీరక సామర్థ్య పరీక్ష  బి) ఆటలో నైపుణ్య పరీక్ష.

ఫీజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ (శారీరక సామర్థ్య పరీక్ష) 400 మార్కులకు జరుగుతుంది. ఇందులో నాలుగు ఈవెంట్స్ లో పాల్గునల్సి ఉంటుంది. ఇందులో మూడు ఈవెంట్లు తప్పనిసరి చేయాల్సినవి కాగా, నాల్గువది ఆప్షనల్ అవకాశం ఉంటుంది. ప్రతి ఈవెంటుకు 100 మార్కులు కేటాయిస్తారు. దేనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈక్రింది పట్టికలో గమనిద్దాం.

pecet

హై జంప్ లేదా లాంగ్ జంప్ ఆప్షనల్ ఎంపిక అనేది ధరఖాస్తు సమయంలో చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో ఆప్షన్ మార్చేందుకు అనుమతి ఉండదు.

శారీరక సామర్థ్య పరీక్ష పూర్తిచేసిన అభ్యర్థులకు రెండవ దశలో 100 మార్కులకు గాను అభ్యర్థి ఎంపిక చేసుకున్న క్రీడలో నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ధరఖాస్తు సమయంలో క్రీడా ఆప్షన్ ఎంపిక చేసుకొని అభ్యర్థులకు, ఒకటికి మించిన క్రీడలు ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు నైపుణ్య టెస్టుకు అనుమతించారు.

1. బాల్ బ్యాడ్మింటన్ 2. బాస్కెట్‌బాల్ 3. క్రికెట్
4. ఫుట్‌బాల్ 5. హ్యాండ్‌బాల్ 6. హాకీ
7. కబడ్డీ 8. ఖో-ఖో 9. షటిల్ బ్యాడ్మింటన్
10. టెన్నిస్ 11. వాలీబాల్

Post Comment