టీఎస్ ఈసెట్ 2024 పరీక్ష షెడ్యూల్ వెలువడింది. పరీక్షను మే 20వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్ ఈసెట్ పరీక్షను పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా రెండవ ఏడాది ఇంజనీరింగులో ప్రవేశం కల్పించేందుకు నిర్వహిస్తారు.
టీఎస్ ఈసెట్ 2023
Exam Name | TS ECET 2024 |
Exam Type | Entrance Exam |
Exam For | Admission for Engineering |
Exam Date | 06/06/2024 |
Exam Duration | 3 Hours |
Exam Level | State Level (Telangana) |
- పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా రెండవ ఏడాది ఇంజనీరింగులో ప్రవేశం పొందేందుకు ఈసెట్ అవకాశం కల్పిస్తుంది.
- అలానే డిప్లొమా లో ఫార్మసీ బ్రాంచ్ చదువుకునే విద్యార్థులు ఈసెట్ ద్వారా నేరుగా బీఫార్మసీ రెండవ ఏడాదిలో అడ్మిషన్ పొందొచ్చు.
- ఈసెట్ అర్హుత సాధించిన విద్యార్థులు ఏఐసిటీఈ గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టెక్నికల్ ఇన్టిట్యూట్లలో అడ్మిషన్ పొందొచ్చు.
- అదే విధంగా ఫార్మసీ కౌన్సిల్ అఫ్ ఇండియా అధీనంలో నడిచే అన్ని ఫార్మసీ కాలేజీల్లో నేరుగా బీఫార్మసీ రెండవ ఏడాది లో ప్రవేశం పొందొచ్చు.
- ఈసెట్ ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
టీఎస్ ఈసెట్ సమాచారం
- టీఎస్ ఈసెట్ ఎలిజిబిలిటీ
- టీఎస్ ఈసెట్ 2024 షెడ్యూల్
- టీఎస్ ఈసెట్ దరఖాస్తు ఫీజు
- టీఎస్ ఈసెట్ పరీక్షకు దరఖాస్త చేయండి
- టీఎస్ ఈసెట్ పరీక్ష కేంద్రాలు
- టీఎస్ ఈసెట్ పరీక్ష నమూనా
- టీఎస్ ఈసెట్ అడ్మిషన్ విధానం
- టీఎస్ ఈసెట్ క్వాలిఫై మార్కులు
టీఎస్ ఈసెట్ ఎలిజిబిలిటీ
- అభ్యర్థులు భారతీయులై ఉండాలి.
- అభ్యర్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారై ఉండాలి. అందుబాటులో ఉన్న సీట్లలో 85% తెలంగాణ మరియు 15% ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కేటాయించబడి ఉంటాయి.
- తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి సంబంధిత డిప్లొమాలో 40% మార్కులతో ఉత్తీర్ణతై ఉండాలి.
- లేదా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి 60% మార్కులతో బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసి ఉండాలి.
- బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఈసెట్ ద్వారా బీఫార్మసీ కోర్సుల్లోకి ప్రవేశంలేదు.
టీఎస్ ఈసెట్ 2024 ముఖ్యమైన తేదీలు
టీఎస్ ఈసెట్ దరఖాస్తు ప్రారంభం | 15 ఫిబ్రవరి 2024 |
టీఎస్ ఈసెట్ దరఖాస్తు గడువు | 16 ఏప్రిల్ 2024 |
టీఎస్ ఈసెట్ చేర్పులు మార్పులు | 28 ఏప్రిల్ 2024 |
టీఎస్ ఈసెట్ హాల్ టికెట్ | 1 మే 2024 |
టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ తేదీ | 06 జూన్ 2024 |
టీఎస్ ఈసెట్ ఫలితాలు | జూన్ 2024 |
టీఎస్ ఈసెట్ కౌన్సిలింగ్ | జులై 2024 |
టీఎస్ ఈసెట్ దరఖాస్తు ఫీజు
ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులు | 500/- |
జనరల్ అభ్యర్థులు | 900/- |
- 500/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 22 ఏప్రిల్ 2024
- 1000/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 28 ఏప్రిల్ 2024
- దరఖాస్తు రుసుములు తెలంగాణ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ తో పాటు ఆన్‌లైన్ విధానంలో డెబిట్ కార్డు.
- క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో ఉండే అదనపు చార్జీలు అభ్యర్థులే భరించాలి.
టీఎస్ ఈసెట్ దరఖాస్తు విధానం
తెలంగాణ ఈసెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్ పద్దతిలో ఉంటుంది. తెలంగాణ అధికారిక ఈసెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.
- ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్
- టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
- పుట్టిన తేదీ వివరాలు
- కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
- ఆధార్ నెంబర్
- PH, NCC, Sports సర్టిఫికేట్లు
- ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
- స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు
దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అడిగిన వివరాలు పూరించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. దరఖాస్తు పూర్తిచేసే ముందు మీరు ఇచ్చిన వివరాలు మరోమారు సరిచూసుకోండి.
చివరి దశలో మీ దరఖాస్తు ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.
టీఎస్ ఈసెట్ రీజనల్ పరీక్షా కేంద్రాలు
తెలంగాణ:
- హైదరాబాద్ వెస్ట్ జోన్: కూకట్పల్లి, బాచుపల్లి, నిజాంపేట్, హాఫీజ్పేట్, షైక్పేట్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు.
- హైదరాబాద్ నార్త్ జోన్: మేడ్చల్, గండిమైసమ్మ, పాత ఆల్వాల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు
- హైదరాబాద్ సెంట్రల్: తార్నాక, సికింద్రాబాద్, ఘట్కేసర్, కీసర మరియు చుట్టుపక్కల ప్రాంతాలు
- హైదరాబాద్ సౌత్-ఈస్ట్: ఎల్బీ నగర్, హయత్నగర్, కర్మణఃఘాట్, ఇబ్రాహింపట్నం, రామోజీ ఫిలిం సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు
- కరీంనగర్, ఖమ్మం, కోడాడ్, నల్గొండ, మహాబుబ్‌నగర్, వరంగల్, సంగారెడ్డి, సిద్దపేట్, నిజామాబాద్,
- ఆంధ్రప్రదేశ్: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.
టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ నమూనా
ఇంజనీరింగ్ మరియు బీఫార్మసీ రెండవ ఏడాది ప్రవేశాలను ఉద్దేశించి జరిగే ఈసెట్ ప్రవేశపరీక్ష పూర్తి ఆన్‌లైన్ విధానంలో జరపబడుతుంది. 3 గంటల కాలవ్యవధి ఉన్న ఈ ప్రశ్నపత్రంలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. సరైనా సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వబడుతుంది.
ఇంజనీరింగ్ మరియు బీఫార్మసీ కోర్సులకు సంబంధించి వేరువేరుగా ప్రశ్నపత్రాలు ఇవ్వబడతాయి. ఇంజనీరింగ్ పప్రవేశంకోసం పోటీపడే డిప్లొమా మరియు బీఎస్సీ విద్యార్థులలో కూడా విభిన్నత ఉంటుంది. ఆయా ప్రశ్నపత్రాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈక్రింది పట్టికలు చుస్తే పూర్తిగా అర్ధమౌతుంది.
టీఎస్ ఈసెట్ ఇంజనీరింగ్ మోడల్ పేపర్
డిప్లొమా అభ్యర్థులకు | ||
---|---|---|
సబ్జెక్టు / పేపర్ | మార్కులు | |
మ్యాథమెటిక్స్ | 50 | అన్ని బ్రాంచీల అభ్యర్థులకు ఒకే పేపర్ |
ఫిజిక్స్ | 25 | అన్ని బ్రాంచీల అభ్యర్థులకు ఒకే పేపర్ |
కెమిస్ట్రీ | 25 | అన్ని బ్రాంచీల అభ్యర్థులకు ఒకే పేపర్ |
ఇంజనీరింగ్ పేపర్ : సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, మైనింగ్.. etc | 100 | ప్రతీ బ్రాంచీకి భిన్నమైన పేపర్ |
టీఎస్ ఈసెట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్
బీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు | |
---|---|
సబ్జెక్టు / పేపర్ | మార్కులు |
మ్యాథమెటిక్స్ | 100 |
అనలాటికల్ ఎబిలిటీ | 50 |
కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ | 50 |
టీఎస్ ఈసెట్ ఫార్మసీ మోడల్ పేపర్
సబ్జెక్టు / పేపర్ | మార్కులు |
---|---|
ఫార్మస్యూటిక్స్ | 50 |
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ | 50 |
ఫార్మాకోగ్నోసి | 50 |
ఫార్మకాలజీ మరియు టాక్సికాలజీ | 50 |
టీఎస్ ఈసెట్ అడ్మిషన్ విధానం
టీఎస్ ఈసెట్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా పూర్తి అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించబడుతుంది. వివిధ ఇంజనీరింగ్ బ్రాంచులకు సంబంధించి జరిగే సీట్లు కేటాయింపులో ఆయా బ్రాంచుల్లో డిప్లొమా ఉత్తీర్ణతన సాధించిన మెరిట్ అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి జరిగే సీట్లు కేటాయింపులో మొదటి ప్రాధాన్యం డిప్లొమా ఐటీ అభ్యర్థులకు మాత్రమే ఇవ్వబడుతుంది. వారికీ కేటాయించగా మిగిలిన సీట్లు మాత్రమే ఇతర డిప్లొమా విద్యార్థులకు కేటాయిస్తారు.
- అలానే టెక్సటైల్ టెక్నాలజీకి సంబందించిన సీట్లలో మొదట ప్రాధాన్యత డిప్లొమా ఇన్ టెక్సటైల్ మరియు టెక్సటైల్ టెక్నాలజీ లో డిప్లొమా అభ్యర్థులకు మాత్రమే ఇవ్వబడుతుంది.
- బయోటెక్నాలజీ సంబంధించిన సీట్లు డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులకు 1:1 నిష్పత్తి లో కేటాయిస్తారు.
టీఎస్ ఈసెట్ క్వాలిఫై మార్కులు
టీఎస్ ఈసెట్ ప్రవేశపరీక్షకు సంబంధించి క్వాలిఫై మార్కులు 25 శాతంగా నిర్ణహించారు. 200 మార్కులకు జరిగే ఈ ప్రవేశపరీక్షలో 50 మార్కులు సాధించిన అభ్యర్థులందరిని ర్యాంకింగ్ కొరకు పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి క్వాలిఫైయింగ్ పరిమితిలేదు.
ఈసెట్ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. మార్కులు సమమైన అభ్యర్థుల ర్యాంకులు, ఆయా ప్రశ్నపత్రాలలో ఉండే ప్రధాన సబ్జెక్టులలో అభ్యర్థి సాధించిన గరిష్ట మార్కుల ఆధారంగా వేరుచేస్తారు. అప్పటికి సమయితే అభ్యర్థుల వయస్సు ఆధారంగా చేసి తుది ర్యాంకులు అందిస్తారు.