Advertisement
యునైటెడ్ కింగ్‌డమ్ స్టూడెంట్ వీసా గైడెన్స్
Abroad Education

యునైటెడ్ కింగ్‌డమ్ స్టూడెంట్ వీసా గైడెన్స్

యూకే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలంటే ముందుగా ఆ దేశానికి చెందిన యూనివర్సిటీలో ప్రవేశం పొంది ఉండాలి. యూకే విశ్వవిద్యాలయాలు మూడు విడతల్లో ప్రవేశాలు నిర్వహిస్తాయి. మొదటి టర్మ్ అడ్మిషన్ ప్రక్రియ సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య నిర్వహిస్తారు. రెండవ టర్మ్ అడ్మిషన్ ప్రక్రియ జనవరి, ఏప్రిల్ నెలల మధ్యలో ఉంటుంది. చివరి దశ ప్రవేశాలు ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో పూర్తిచేస్తారు.

యూనివర్సిటీ అడ్మిషన్ ప్రక్రియ, ఇంగ్లీష్ అర్హుత ఉత్తీర్ణత, వీసా దరఖాస్తు ప్రక్రియలు పూర్తివ్వడానికి సుమారుగా 8 నుండి 12 నెలలు పడుతుంది. అంటే, యూకేకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు ఏడాది ముందుగానే దీనికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలి. యూకే యూనివర్సిటీలు, విద్యా ఏడాది ప్రారంభానికి మూడు నెలల ముందు వరకు అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు. కానీ చివరి దశలో ఎటువంటి గందరగోళం లేకుండా, ప్రక్రియ అంతా సాపీగా సాగిపోవాలనుకుంటే, మొదటి, రెండు టర్మ్ లలో 5 నుండి 10 యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవాలి.

Types of student visa In UK

ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వాలు 4 రకాల విద్యార్థి వీసాలు జారీ చేస్తున్నాయి. వీటిని విద్యార్థి వయస్సు, ఎంపిక చేసుకున్న కోర్సు వ్యవధిని దృష్టిలో ఉంచుకుని ఆమోదం తెలుపుతున్నారు.

  • Tier 4 (General) student visa.
  • Child student visa.
  • Standard Visitor visa
  • Study English in the UK (Short-term study visa)

Tier 4 (General) student visa

ఫుల్ టైమ్ అకాడమిక్ కోర్సులలో చేరే విద్యార్థులకు, యూకే టైర్ 4 స్టూడెంట్ వీసాను జారీ చేస్తుంది. ఈ వీసాకు దరఖాస్తు చేసేందుకు విద్యార్థి వయస్సు 16 నిండి ఉండాలి. విద్యార్థికి ఇంగ్లీష్ రాయడం, మాట్లాడం, చదవడం తెలిసి ఉండాలి (ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణత). వీటితో పాటుగా అడ్మిషన్ పొందినట్లు యూకే యూనివర్సిటీలు జారీచేసే Confirmation of Acceptance of Studies (CAS) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలానే మీ ఎడ్యుకేషన్ యూకే లో పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు ఉన్నట్లు ఫైనాన్సియల్ రిపోర్టు అందించాలి.

Child Student visa

యూకే ఇండిపెండెంట్ స్కూళ్లలో చేరే విద్యార్థులకు, యూకే చైల్డ్ స్టూడెంట్ వీసాను జారీ చేస్తుంది. ఈ వీసాకు దరఖాస్తు చేసేందుకు విద్యార్థి వయస్సు 4 నుండి 17 మధ్య ఉండాలి. విద్యార్థికి ఇంగ్లీష్ రాయడం, మాట్లాడం, చదవడం తెలిసి ఉండాలి (ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణత). వీటితో పాటుగా యూకే స్కూల్ అడ్మిషన్ లెటర్ కలిగి ఉండాలి. అలానే మీ ఎడ్యుకేషన్ యూకే లో పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు ఉన్నట్లు ఫైనాన్సియల్ రిపోర్టు అందించాలి.

Standard Visitor visa

యూకేకు షార్ట్ టర్మ్ కోర్సులు చేసేందుకు పోయే విద్యార్థుల కోసం స్టాండర్డ్ విజిటర్ వీసాను జారీ చేస్తుంది. ఈ వీసాకు దరఖాస్తు చేసేందుకు విద్యార్థి వయస్సు 18 ఏళ్ళు నిండి ఉండాలి. విద్యార్థికి ఇంగ్లీష్ రాయడం, మాట్లాడం, చదవడం తెలిసి ఉండాలి. వీటితో పాటుగా అడ్మిషన్ లెటర్ కలిగి ఉండాలి. అలానే మీ ఎడ్యుకేషన్ యూకే లో పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు ఉన్నట్లు ఫైనాన్సియల్ రిపోర్టు అందించాలి. ఈ వీసా 6 నెలలు నిడివితో జారీచేస్తారు, దీని కోసం £95 వీసా దరఖాస్తు రుసుము వసూలు చేస్తారు. ఇంకా ఎక్కువ కాలం ఉండాలనుకుంటే 2 years - £361, 5 years - £655, 10 years - £822 చెల్లించాల్సి ఉంటుంది.

Study English in the UK (Short-term study visa)

యూకే ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ లలో చేరే విద్యార్థులకు, స్టడీ ఇంగ్లీష్ ఇన్ యూకే వీసాను జారీ చేస్తుంది. విద్యార్థికి ఇంగ్లీష్ రాయడం, మాట్లాడం, చదవడం తెలిసి ఉండాలి. ఈ వీసా 6 నుండి 12 నెలల చెల్లిబాటుతో అందిస్తారు. వీసా దరఖాస్తు ఫీజు £186 యూరోలు ఉంటుంది.

వీసా దరఖాస్తు విధానం

పై అన్నీ అర్హుతలు ఉండే విద్యార్థులు యూకే ప్రభుత్వ వీసా పోర్టల్ ద్వారా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో..ఆయా విసాలకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు వీసా పోర్టల్ యందు మీ వ్యక్తిగత వీసా & ఇమిగ్రేషన్ అకౌంట్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. దీని కోసం పాసుపోర్టు, పుట్టిన తేదీ వివరాలు, ఇమెయిల్ మరియు ఫోన్ నెంబర్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తిచేశాక యూకే ప్రభుత్వ పోర్టల్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో పొదుపర్చాల్సిన అన్ని వివరాలు తప్పులు దొర్లకుండా నింపి, వీసా దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా వీసా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసుకున్నాక, దగ్గరలో ఉండే యూకే వీసా అప్లికేషన్ సెంటరుకు పోయి సర్టిఫికెట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ డాటాను అందించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో చిన్నపాటి వీసా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

వీసా ఇంటర్వ్యూలో ప్రధానంగా విద్యార్థి ఇంగ్లీష్ ప్రావీణ్యత, ఫైనాన్సియల్ రిపోర్టు మరియు విద్యార్థి చెప్పే సమాధానాల స్పష్టతను పరిశీలిస్తారు. దరఖాస్తు వివరాలు అన్ని సక్రమంగా ఉండి, వీసా అధికారి సంతృప్తి పొందితే 3 నుండి 4 వారాలలో వీసా జారీచేస్తారు. రెగ్యులర్ డిగ్రీలకు కోసం యూకేకు వెళ్లే విద్యార్థులు 3 నుండి 6 నెలల ముందుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా పొందిన విద్యార్థులు క్లాసులు ప్రారంభమయ్యే తేదికి 30 రోజుల ముందు మాత్రమే యూకేలోకి అనుమతించబడతారు.

Student visa from outside the UK £348 5 Years Valid
Extend or switch to a Student visa from inside the UK. £475 5 Years Valid

Post Comment