Advertisement
పాన్ కార్డు & టాన్ కార్డు రిజిస్ట్రేషన్ | ఆన్‌లైనులో దరఖాస్తు చేయండి
Entrepreneur Guide

పాన్ కార్డు & టాన్ కార్డు రిజిస్ట్రేషన్ | ఆన్‌లైనులో దరఖాస్తు చేయండి

ప్రజల ఆర్థిక లావాదేవీలు నమోదు చేసేందుకు మరియు పన్ను చెల్లింపుదార్లును గుర్తించేందుకు ఆదాయ పన్ను విభాగం పది అంకెల యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జారీచేస్తుంది, దాన్నే పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) అని అంటారు.

దేశంలో వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు మరియు పన్ను చెల్లింపుదార్ల డేటాను ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను విభాగం సేకరించి భద్రపరుస్తుంది. సేకరించిన ఈ సమాచారం అనుమానపు లావాదేవీలు గుర్తించేందుకు మరియు పన్ను ఎగవేత దారుల జాబితా తయారుజేసి వారిపై చట్టపరమైన చర్యలు ఉపక్రమించేందుకు ఉపయోగిస్తారు.

పాన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేయాలి

పాన్ కార్డు కేవలం డబ్బు విరివిగా సంపాదించే వారి కోసం, ఉద్యోగాలు చేసే వారి కోసం, పన్నులు చెల్లించే వారికోసం అనే భావన చాల మందిలో ఉంది. పాన్ కార్డు ప్రవేశ పెట్టింది ఆదాయ పన్ను చెల్లించేందుకు మాత్రమే కాదు.

ఇవాళ్టి రోజుల్లో భారత ప్రభుత్వం దేశంలో జరిగే అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసింది. ఆస్తులు కొనేందుకు, అమ్మెందుకు. పెద్ద మొత్తంలో బంగారం, వజ్రాలు వంటి ఆభరణాలు కొనేందుకు, వాహన కొనుగోళ్లుకు, అమ్మకాలకు పాన్ కార్డు తప్పనిసరి చేసింది.

అలానే వివిధ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు, ఇన్సూరెన్స్ పాలసీలు పొందేందుకు, FD లో డబ్బులు దాచుకునేందుకు పాన్ నెంబర్ తప్పక అందించాలి. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేందుకు, బ్యాంకుల్లో లోన్ కోసం దరఖాస్తు చేసేందుకు పాన్ కార్డు తప్పాక ఉండాల్సిందే. ప్రభుత్వ సంబంధిత సేవలు పొందేందుకు పాన్ ఒకానొక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు.

పాన్ కార్డుకు దరఖాస్తు చేసేందుకు అవసరమయ్యే డాక్యూమెంట్స్

  •  వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్ కార్డు/ఓటర్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/పాస్ పోర్ట్ లలో ఏదోఒకటి సమర్పించాల్సి ఉంటుంది.
  • చిరునామా గుర్తింపు కోసం ఓటర్ కార్డు/ ఎలక్ట్రికల్ బిల్/ బ్యాంకు స్టేట్మెంట్/ గ్యాస్ బిల్/ వాటర్ బిల్/ పోస్ట్ఆఫీస్ పాస్ బుక్ etc
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం : ఆధార్ కార్డు/ టెన్త్ సర్టిఫికెట్/ బర్త్ సర్టిఫికెట్

పాన్ కార్డు దరఖాస్తు విధానం

పాన్ కార్డు కోసం దరఖాస్తు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానంలో చెయ్యొచ్చు. కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే భారతీయులు ఫారం నెంబర్ 49A నింపాల్సి ఉంటుంది. విదేశీయులు ఫారం నెంబర్ 49AA నింపాలి. ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసే వారు దగ్గరలో ఉన్న ఆదాయ పన్ను కార్యాలయం లో ఫారం 49A నింపి సంబంధిత ధ్రువపత్రాలు అందించడం ద్వారా పాన్ కార్డు పొందొచ్చు.

ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసే వారు ఆదాయ పన్ను అధికారిక వెబ్సైటు నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.

  • మొదట ఆన్‌లైన్ దరఖాస్తు లింకుపై క్లిక్ చేయండి www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html
  • క్లిక్ చేయగానే పాన్ కార్డు దరఖాస్తు పేజీ మీ మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ పై దర్శనమిస్తుంది.
  • దరఖాస్తు పైభాగంలో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో 1. అప్లికేషన్ టైపు 2. అప్లికేషన్ కేటగిరి
  • అప్లికేషన్ టైపు ఆప్షన్ లో ఫారం నెంబర్ 49A ను ఎంపిక చేయండి.
  • అప్లికేషన్ కేటగిరి ఆప్షన్లో 11 కేటగిర్లు అందుబాటులో ఉంటాయి. అందులో మీకు సంబంధించిన కేటగిరిని ఎంపిక చేసుకోండి.
  • తర్వాత దశలో అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో దరఖాస్తుదారుని పేరు మరియు పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ నింపాల్సి ఉంటుంది.
  • తర్వాత దశలో డిక్లరేషన్ బ్లాంక్ పై క్లిక్ చేసి దాని కిందన ఉండే కాప్చా కోడ్ ఎంటర్ చేసి దరఖాస్తు సమర్పించండి. దీనితో మొదటి దశ దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.
  • మీరు సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ పై మీ పాన్ కార్డు దరఖాస్తు రిజిస్టర్డ్ టోకెన్ నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్ సహాయంతో రెండవ దశ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించండి.
  • రెండవ దశలో ప్రారంభంలో మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మొదటిది పేపర్లెస్ ఈ-కేవైసీ ద్వారా పాన్ కార్డు పొందటం. దీనికోసం మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తో లింక్ చేయబడి ఉండాలి. ఈ పద్దతిలో మీరు ఎటువంటి డాకుమెంట్స్ అందించాల్సిన అవసరం లేదు. ఆధార్ ఓటీపీ ధ్రువీకరణ మీ గుర్తింపు నిర్దారణ జరుగుతుంది.
  • ఇక రెండవ ఆప్షన్ ఆన్‌లైన్ ద్వారా మీ వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మూడవ ఆప్షన్ లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసి గుర్తింపు ధ్రువపత్రాలు పోస్టు ద్వారా ముంబైలో ఉన్న ఆదాయ పన్ను ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
  • తర్వాత దశలో పాన్ కార్డు పొందే విధానం కోసం తెలియజేయల్సి ఉంటుంది. మీకు ఫీజికల్ పాన్ కార్డు కావాలనుకుంటే "YES" అనే ఆప్షన్ ఫీజికల్ పాన్ కార్డు కాకుండా పీడీఎఫ్ ఫార్మాట్ లో కావాలనుకుంటే  "NO " అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత దశలో మీ ఆధార్ చివరి 4 అంకెలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే మీ ఆధార్ పై ఉన్న మీ వ్యక్తిగత వివరాలు ఎటువంటి మార్పు లేకుండా నింపాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత ఆధార్ కార్డుపై మీ ఫోటో ఉండాలనుకుంటే Yes వద్దునుకుంటే No ఆప్షన్ ఎంపిక చేసుకోండి.
  • ఆ తర్వాత దశల్లో మీ వ్యక్తిగత సమాచారం, మీ తల్లిదండ్రుల పేర్లు నింపాల్సి ఉంటుంది. అలానే కార్డుపై తండ్రి లేదా తల్లి పేరు ఉంచుకునే ఎంపిక మీకు అందుబాటులో ఉంది.
  • ఆ తర్వాత దశలో మీ ఆదాయ మార్గాన్ని తెలపాల్సి ఉంటుంది.
  • అలానే మీ వ్యక్తిగత లేదా ఆఫీస్ చిరునామా వివరాలు అందించాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత దశలో మీరు ఏ ఆదాయ పన్ను కార్యాలయ రీజనల్ పరిధి సమాచారం అందించాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా ఏరియా కోడ్, ఏఓ టైపు, రేంజ్ కోడ్ మరియు ఏవో నెంబర్ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఈ వివరాలు మీకు అక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
  • చివరిగా మీ వ్యక్తిగత ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి వ్యక్తిగత ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దశలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా మీ పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ పూర్తిఅవుతుంది.
  • మీరు పేపర్ లెస్ ఆధార్ ధ్రువీకరణ ఎంపిక చేసుకుంటే మీ పాన్ కార్డు వెంటానే మీకు జారీ చేయబడుతుంది. బౌతికంగా పాన్ కార్డు కావాలనుకుంటే 30 రోజులు సమయం పడుతుంది.
ఫీజికల్ కార్డు దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ పిడిఎఫ్ కార్డు దరఖాస్తు ఫీజు
ఆధార్ ఈ -కేవైసీ 101/- ఆధార్ ఈ -కేవైసీ 66/-
ఫీజికల్ మోడ్ 107/- ఫీజికల్ మోడ్ 72/-

టాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ & ఉపయోగాలు

టాన్ అనగా టాక్స్ డిడక్షన్ లేదా కలెక్షన్ నెంబర్ అని అర్ధం. పాన్ నెంబర్ వలె ఇది కూడా పది అంకెల యూనిక్ ఫార్మేట్ లో ఉంటుంది. టాన్ నెంబర్ ఆదాయ పన్ను విభాగం జారీ చేస్తుంది. టాక్స్ డిడక్షన్ (TDS) కోసం మరియు టాక్స్ కలెక్షన్ (TCS) కోసం దరఖాస్తు చేసే వ్యక్తులకు, కంపెనీలకు, ఫర్మ్ లకు సెక్షన్ 203A ప్రకారం టాన్ నెంబర్ జరీ చేస్తారు.

సెక్షన్ 194-IA పరిధిలో స్థిర ఆస్తులు కొనేవారికి 94-IB పరిదిలో అద్దెల రూపంలో వచ్చే ఆదాయానికి టాన్ సమర్పణ మినహాయింపు ఉంటుంది. వారు పాన్ నెంబర్ సమర్పిస్తే సరిపోతుంది.

వీరికి టాన్ తప్పనిసరి : పన్ను చెల్లింపుదార్లు అందరికి టాన్ నెంబర్ తప్పనిసరి. TDS ద్వారా పన్ను మినహాయింపు కోసం దరఖాస్తు చేయాలన్నా లేదా కలెక్ట్ చేసిన పన్నులను టిన్ ఫెసిలిటేషన్ సెంటర్లు వద్ద జమచేయాలన్న టాన్ నెంబర్ తప్పనిసరి.

టాన్ నెంబర్ లేనిదే ఈ లావాదేవీలకు వారు అంగీకరించారు. టాన్ లేనిదే బ్యాంకులు కూడా టీడీఎస్/టీసిఎస్ చెలింపు చలానాలు ఆమోదించవు. టాన్ నెంబర్ తీసుకోవాల్సిన వారు తీసుకోకున్న లేదా తప్పుడు టాన్ నెంబర్ సమర్పించిన ఆదాయ పన్ను శాఖ భారీ జరిమానా విధిస్తుంది.

టాన్ కార్డు దరఖాస్తు విధానం

  • టాన్ నెంబర్ కోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చెయ్యొచ్చు. ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేయాలనుకుంటే దగ్గరలో ఉండే నేషనల్ సెక్యూరిటీస్ డిఫాజీటిరీ లిమిటెడ్ (NSDL) సెంటర్లలో సంప్రదించాలి.
  • ఆన్‌లైన్ విధానంలో NSDL అధికారిక వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి https://tin.tin.nsdl.com/tan/index.html.
  • టాన్ నెంబర్ కోసం ఫారం నెంబర్ 49B నింపాల్సి ఉంటుంది.
  • వెబ్సైటులో ఉండే ఫారం నెంబర్ 49B సెలెక్ట్ చేయగానే సంబంధిత మార్గదర్శికాలతో ఫారం నెంబర్ 49B ఓపెన్ అవుతుంది.
  • తర్వాత దశలో మీరు దరఖాస్తు చేస్తున్న టాక్స్ డిడక్షన్ కేటగిరిని ఎంపిక చేసుకోవాలి.
  • ఆ తర్వాత దశలో దరఖాస్తులో అడిగిన వివరాలు పూర్తిగా నింపండి.
  • అందుబాటులో ఉన్న పేమెంట్ మోడ్ లో దరఖాస్తు రుసుము చెల్లించి. సబ్మిట్ చేయండి.
  • స్క్రీన్ పై కనిపించే రిజిస్టర్ నెంబర్ నోట్ చేసుకుని, దరఖాస్తు ప్రింట్ తీసి ఈ క్రింది అడ్రసుకు పోస్టు ద్వారా పంపించండి.
NSDL e-Governance Infrastructure Limited,
5th floor, Mantri Sterling, Plot No. 341,
Survey No. 997/8, Model Colony,
Near Deep Bungalow Chowk,
Pune – 411016

Post Comment