ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే వివిధ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షల వివరాలు పొందండి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, లా, ఫార్మసీ, అగ్రికల్చర్, బీఈడీ, డీఎడ్ వంటి కోర్సులలో అడ్మిషన్ కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టుల తాజా సమాచారం తెలుసుకోండి.

ఏపీ ఈఎపీసెట్ 2023 | ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ ప్రవేశాలు
ఏపీ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు మరియు టెక్నికల్ ఇనిస్టిట్యూట్లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల యందు మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈఏపీసెట్ అనగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ పార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.

ఏపీ ఐసెట్ 2023 | ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలు
ఏపీ ఐసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు మరియు మానేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసెట్ అనగా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.

ఏపీ ఎడ్‌సెట్ 2023 | బీఈడీ కోర్సులలో ప్రవేశాలు
ఎడ్‌సెట్ పరీక్షను ఉపాధ్యాయులకు వృత్తి పరమైన శిక్షణ ఇచ్చే రెండేళ్ల బీఈడీ కోర్సులలో అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తారు. ఎడ్‌సెట్ అనగా ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.

ఏపీ ఈసెట్ 2023 | రెండవ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలు
ఏపీ ఈసెట్ పరీక్షను డిప్లొమా మరియు బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన విద్యార్థులకు నేరుగా రెండవ ఏడాది ఇంజనీరింగు కోర్సులలో ప్రవేశం కల్పించేందుకు నిర్వహిస్తారు.
ఏపీ లాసెట్ 2023 | ఎల్ఎల్‌బి & ఎల్ఎల్ఎం కోర్సులలో ప్రవేశాలు
ఏపీ లాసెట్ & ఏపీ పీజీఎల్ సెట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ న్యాయ కళాశాలలో యూజీ మరియు పీజీ కోర్సులలో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు.
ఏపీ పీజీఈసెట్ 2023 | ఇంజనీరింగ్ & ఫార్మసీ పీజీ కోర్సులలో ప్రవేశాలు
ఏపీ పీజీఈసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు, టెక్నికల్ ఇనిస్టిట్యూట్లు మరియు ఫార్మసీ కాలేజీల్లో ఎంటెక్, ఎంఫార్మా, ఫార్మా డీ కోర్సుల యందు మొదటి యేడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు.
ఏపీ పీఈసెట్ 2023 | ఫీజికల్ ఎడ్యుకేషన్ కోర్సులలో ప్రవేశాలు
ఏపీ పీఈసెట్ పరీక్షను రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (B.P.Ed) లేదా డిప్లొమా ఇన్ ఫీజికల్ ఎడ్యుకేషన్ (D.P.Ed) కోర్సుల యందు మొదటి యేడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు.

ఏపీ ఆర్‌సెట్ 2023 | ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులలో ప్రవేశాలు
ఏపీ ఆర్‌సెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యందు ఉన్న యూనివర్సిటీలు మరియు దాని అనుబంధ కళాశాలల్లో ఫుల్ మరియు పార్ట్ టైమ్ ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు.

ఏపీ పీజీసెట్ 2023 | పీజీ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్ ప్రవేశాలు
ఏపీ పీజీసెట్ పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీ మరియు వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 145 కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
ఏపీ స్కూల్ & కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్టులు