ఏపీ ఆర్‌సెట్‌ 2024 : షెడ్యూల్ మరియు ఎగ్జామ్ నమూనా
Admissions Ap CETs

ఏపీ ఆర్‌సెట్‌ 2024 : షెడ్యూల్ మరియు ఎగ్జామ్ నమూనా

ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఆర్‌సెట్‌ 2024 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ ఆర్‌సెట్‌ 2024 పరీక్షలను ఏప్రిల్ మూడవ వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి సన్నద్ధం అవుతుంది.

Advertisement

ఏపీ ఆర్‌సెట్‌ 2024

ఏపీ ఆర్‌సెట్‌ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యందు ఉన్న యూనివర్సిటీలు మరియు దాని అనుబంధ కళాశాలల్లో ఫుల్ మరియు పార్ట్ టైమ్ ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఏపీ ఆర్‌సెట్‌ అనగా ఆంధ్ర ప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.

ఆంధ్రప్రదేశ్ పరిధిలో నిర్వహించే ఈ అర్హుత పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 స్టేట్ యూనివర్సిటీలలో దాదాపు 70 రకాల కోర్సులల్లో ఫుల్ టైమ్  మరియు పార్ట్ టైమ్ ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులకు అడ్మిషన్ పొందొచ్చు. పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతయిన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అడ్మిషన్లు రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.

Exam Name AP RCET 2024
Exam Type Eligibility Test
Admission For M.Phil & P.hD
Exam Duration 180 Minutes
Exam Level State Level (AP)

ఏపీ ఆర్‌సెట్‌ 2024 ఎలిజిబిలిటీ

  1. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అభ్యర్థులు అర్హులు
  2. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత
  3. యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ నెట్, గేట్, స్లేట్ పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  4. పీజీ కాలేజీలో ఫ్యాకల్టీ/లైబ్రేరియన్ (2 ఏళ్ళు) మరియు 4 ఏళ్ళ అనుభవం కలిగిన జూనియర్ కాలేజీ ఫ్యాకల్టీ దరఖాస్తు చేసేందుకు అర్హులు.

ఏపీ ఆర్‌సెట్‌ 2024 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 20 ఫిబ్రవరి 2024
దరఖాస్తు చివరి తేదీ 19 మార్చి 2024
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 10 ఏప్రిల్ 2024
పరీక్ష తేదీ ఏప్రిల్ 2024
ఫలితాలు జూన్ 2024
కౌన్సిలింగ్ జూన్ 2024

ఏపీ ఆర్‌సెట్‌ 2024 సీట్ల వివరాలు

యూనివర్సిటీ సీట్లు యూనివర్సిటీ మొత్తం సీట్లు
ఆంధ్ర యూనివర్సిటీ 453 శ్రీకష్ణ దేవరాయ యూనివర్సిటీ 76
జేఎన్టీయూ కాకినాడ 426 నన్నయ్య యూనివర్సిటీ 122
జేఎన్టీయూ అనంతపూర్ 384 ద్రవిడియన్ యూనివర్సిటీ 63
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 209 కృష్ణ యూనివర్సిటీ 58
నాగార్జున యూనివర్సిటీ 231 విక్రం సింహపురి యూనివర్సిటీ 45
యోగి వేమన యూనివర్సిటీ 140 బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 27
జేఎన్టీయూ విజయనగరం 201 ఆర్జీయూకేటీ 24
పద్మావతి యూనివర్సిటీ 125 రాయలసీమ యూనివర్సిటీ 05
ఆంధ్ర కేసరి యూనివర్సిటీ 80

ఏపీ ఆర్‌సెట్‌ 2024 దరఖాస్తు ఫీజు

  • జనరల్ కేటగిరి అభ్యర్థులు 1,500/- దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • బీసీ అభ్యర్థులు 1,300/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి
  • ఎస్సీ, ఎస్టీ మరియు అంగవైకుల్యం ఉన్న అభ్యర్థులు 1,000/- చెల్లించాలి.
  • 2,000/- లేటు ఫీజుతో 20 మార్చి - 29 మార్చి 2024 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 5,000/- లేట్ ఫీజుతో 30 మార్చి - 06 ఏప్రిల్ 2024 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఆర్‌సెట్‌ 2024 ఎగ్జామ్ సెంటర్లు

శ్రీకాకుళం విజయనగరం
విశాఖపట్నం రాజమండ్రి
ఏలూరు కాకినాడ
భీమవరం ఒంగోలు
తిరుపతి నెల్లూరు
హైదరాబాద్ అనంతపురం
కర్నూలు కడప

రెండు వందలకు మించి దరఖాస్తు చేయని కోర్సులకు రాతపరీక్ష విశాఖపట్నంలో మాత్రమే నిర్వహించబడుతుంది. తెలంగాణ విద్యార్థుల కోసం హైదరాబాద్ యందు ఎగ్జామ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఏపీ ఆర్‌సెట్‌ 2024 రిజిస్ట్రేషన్

ఏపీ ఆర్‌సెట్‌ 2024 దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏపీ ఆర్‌సెట్‌ 2024 అధికారిక వెబ్సైటు ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో భాగంగా మొదట ఎగ్జామ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, పుట్టిన వివరాలు, రిజర్వేషన్ కేటగిరి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు పొందుపర్చి అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

రెండవ దశలో పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి,  దరఖాస్తులో కోరిన వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలు తప్పులు దొర్లకుండా నింపాలి. అలానే ఉత్తీర్ణత సాధించిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, టెన్త్ హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్ సెంటర్లు, యూనివర్సిటీ ఎంపిక వంటి వివరాలు పొందుపర్చాలి. అలానే పాస్‌ఫోటో సైజు ఫోటో, సిగ్నేచర్ ఫైల్ అప్లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఏపీ ఆర్‌సెట్‌ 2024  ఎగ్జామ్ నమూనా

ఏపీ ఆర్‌సెట్‌ పరీక్షను కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ రెండు సెక్షన్ల వారీగా నిర్వహిస్తారు. సెక్షన్ A యందు రీసెర్చ్ మెథడాలజీ సంబంధించి 75 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్ B యందు అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుండి 75 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.

పరీక్ష రెండు కేటగిరీల వారీగా నిర్వహిస్తారు. మొదటి కేటగిరిలో యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ నెట్, స్లేట్/గేట్ పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థుల కోసం నిర్వహిస్తారు. వీరు సెక్షన్ యందు నిర్వహించే 75 మార్కుల రీసెర్చ్ మెథడాలజీ ప్రశ్నలు పూర్తి చేస్తే సరిపోతుంది.

రెండవ కేటగిరిలో జనరల్ పీజీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థుల కోసం నిర్వహిస్తారు. వీరు సెక్షన్ A యందు రీసెర్చ్ మెథడాలజీ సంబంధించి 75 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు మరియు సెక్షన్ B యందు అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుండి 75 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది.

ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఇవ్వబడతయి. వాటి నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానాలకు ఋణాత్మక మార్కులు లేవు. పరీక్ష 180 నిముషాల వ్యవధితో 140 మార్కులకు జరుగుతుంది.

సెక్షన్ కేటగిరి & పేపర్ మార్కులు వ్యవధి
సెక్షన్ A రీసెర్చ్ మెథడాలజీ (కేటగిరి I & II అభ్యర్థులు) 70 90 నిముషాలు
సెక్షన్ B ఆప్షనల్ స్పెషలైజషన్ (కేటగిరి II అభ్యర్థులు) 70 90 నిముషాలు
140 180 నిముషాలు

ఏపీ ఆర్‌సెట్‌ ఇంటర్వ్యూ & సీట్లు కేటాయింపు

ఏపీ ఆర్‌సెట్‌ అడ్మిషన్ ప్రక్రియ రాతపరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు రెండవ దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో భాగంగా కేటగిరి I అభ్యర్థులకు 30 మార్కులకు, కేటగిరి II అభ్యర్థులకు 60 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ యందు సాధించిన మెరిట్ ఆధారంగా తుది షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు.

అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు ఆంధప్రదేశ్ విద్యార్థులకు మిగతా సీట్లు తెలంగాణ రాష్ట్రా విద్యార్థులకు కేటాయిస్తారు. రేజర్వేషన్ల పరంగా ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 6%, బీసీ అభ్యర్థులకు 29%, NCC అభ్యర్థులకు 1%, క్రీడాకులకు 0.5% మరియు మహిళకు 33% సీట్లు కేటాయిస్తారు.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఎస్సీ అభ్యర్థులు 15% శాతం
ఎస్టీ అభ్యర్థులు 8 శాతం
బీసీ కులాలు 29 శాతం
మహిళలు 33% శాతం
NCC, Sports 1 శాతం, 0.5 శాతం

ఏపీ ఆర్‌సెట్‌ 2024 ఇతర వివరాలు

ఏపీ ఆర్‌సెట్‌ 2024 ఇన్ఫర్మేషన్ బౌచర్ ఏపీ ఆర్‌సెట్‌ రిజిస్ట్రేషన్
ఏపీ ఆర్‌సెట్‌ పేమెంట్ లింక్ ఏపీ ఆర్‌సెట్‌ సిలబస్
ఏపీ ఆర్‌సెట్‌ మాక్ టెస్ట్ ఆప్షనల్ సబ్జెక్టులు

Advertisement

Post Comment