ఏపీ ఎడ్‌సెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, దరఖాస్తు ప్రక్రియ
Admissions Andhra Pradesh Ap CETs

ఏపీ ఎడ్‌సెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, దరఖాస్తు ప్రక్రియ

బీఈడీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ 2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ ఎడ్‌సెట్ 2023 పరీక్షలను మే 20వ తేదీన నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతుంది.

Advertisement

కోవిడ్ కారణంగా గత మూడేళ్ళుగా గాడి తప్పిన విద్యా వ్యవస్థను దారిలో పెట్టేందుకు ఈ ఏడాది అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ముందుగా నిర్వహించి, అంతే త్వరంగా ప్రవేశాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు వెల్లడించింది.

ఏపీ ఎడ్‌సెట్ 2023

ఎడ్‌సెట్ పరీక్షను ఉపాధ్యాయులకు వృత్తి పరమైన శిక్షణ ఇచ్చే రెండేళ్ల బీఈడీ కోర్సులలో అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తారు. ఎడ్‌సెట్ అనగా ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. రెండేళ్ల బీఈడీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు ప్రైవేట్ స్కూళ్లతో పాటుగా, ప్రభుత్వ భర్తీ చేసే ఉపాద్యాయ ఉద్యోగ ప్రకటనల ద్వారా సర్కార్ బడుల్లో ఉపాధ్యాయులుగా స్థిరపడొచ్చు.

ఏపీ ఎడ్‌సెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. పూర్తి కంప్యూటర్ ఆధారంగా జరిగే ఈ పరీక్షలో మొత్తం 150 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు 150 నిముషాలలో సమాధానం చేయాల్సి ఉంటుంది. ఒక్క ఇంగ్లీష్ మెథడాలజీ సెక్షన్ మినహాయిస్తే పరీక్షను ఇంగ్లీష్ మరియు తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తారు.

Exam Name AP EdCET 2023
Exam Type Entrance Exam
Admission For B.Ed
Exam Date 20/05/2023
Exam Duration 3 Hours
Exam Level State Level (AP)

ఏపీ ఎడ్‌సెట్ 2023 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
  • అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి స్థానికతను సంతృప్తి పరచాల్సి ఉంటుంది.
  • 50 శాతం మార్కులతో యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న వారు కూడా అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 40% మాత్రం మార్కులు తప్పనిసరి.
  • 50 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు.
  • అభ్యర్థులు వయస్సు నోటిఫికేషన్ సమయానికి 19 ఏళ్ళు నిండి ఉండాలి. దరఖాస్తు చేసేందుకు యెటువంటి గరిష్ట వయోపరిమితి లేదు.
పార్ట్ C మెథడాలజీ సంబంధించి అర్హుత నియమాలు
మెథడాలజీ సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ
మ్యాథమెటిక్స్  మేథ్స్ ఒక సబ్జెక్టుగా B.A./B.Sc ఉత్తీర్ణత లేదా బీటెక్ /B.C.A (ఇంటర్ ఎంపీసీ)
బయాలజీ బయాలజీ ఒక సబ్జెక్టుగా B.Sc./B.Sc హోమ్ సైన్స్ ఉత్తీర్ణత/B.C.A (ఇంటర్ బైపీసీ)
ఫీజికల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ లు ఒక సబ్జెక్టుగా B.Sc/బీటెక్/మెటీరియల్ సైన్సెస్
సోషల్ స్టడీస్ ఇంటర్ లో సోషల్ సైన్సెస్ B.A./B.Com./B.B.M. or B.C.A అభ్యర్థులు
ఇంగ్లీష్ BA స్పెషల్ ఇంగ్లీష్/ MA ఇంగ్లీష్

ఏపీ ఎడ్‌సెట్ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 24 మార్చి 2023
దరఖాస్తు చివరి తేదీ 23 ఏప్రిల్ 2023
చేర్పులు మార్పులు 11 మే 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 12 మే 2023
ఏపీ ఎడ్‌సెట్ 2023 ఎగ్జామ్ 20 మే 2023
ఫలితాలు జూన్ 2023
కౌన్సిలింగ్ జులై 2023

ఏపీ ఎడ్‌సెట్ 2023 దరఖాస్తు ఫీజు

కేటగిరి రిజిస్ట్రేషన్ ఫీజు
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 450/-
జనరల్ కేటగిరి 650/- (OBC : 500/-)

దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్ ఆన్‌లైన్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు సమయంలో ఉండే అదనపు రుసుములు అభ్యర్థులే చెల్లించవల్సి ఉంటుంది.

ఏపీ ఎడ్‌సెట్ 2023 రిజిస్ట్రేషన్

ఏపీ ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అధికారిక ఎడ్ సెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

  • ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
  • ఆధార్ నెంబర్
  • PH, NCC, Sports సర్టిఫికేట్లు
  • ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
  • స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అభ్యర్థి యొక్క విద్యా, వ్యక్తిగత, చిరునామా వివరాలు పొందుపర్చడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.

దరఖాస్తు పూర్తిచేసే ముందు మీ వివరాలు పలుమార్లు సరి చూసుకోండి. చివరి దశలో మీ దరఖాస్తును ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ  పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.

ఏపీ ఎడ్‌సెట్ 2023 ఎగ్జామ్ సెంటర్లు

అనంతపూర్ చిత్తూరు కడప తిరుపతి
కర్నూలు నంద్యాల నెల్లూరు ఒంగోలు
గుంటూరు విజయవాడ భీమవరం కాకినాడ
రాజమహీంద్రవరం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం

ఏపీ ఎడ్‌సెట్ 2023 ఎగ్జామ్ నమూనా

ఏపీ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (CBT) విధానం లో నిర్వహించబడుతుంది. మూడు భాగాలుగా ఉండే ఎడ్ సెట్ ప్రశ్నపత్రంలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ A లో  జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించిన 25 ప్రశ్నలు ఇవ్వబడతాయి, పార్ట్ B లో జనరల్ నాలెడ్జికి సంబంధించి 15 ప్రశ్నలు మరియు టీచింగ్ ఆప్టిట్యూడ్ కు సంబంధించి 10 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది.

పార్ట్ Cలో అభ్యర్థి ఎంచుకున్న ఐచ్చిక సబ్జెక్టు నుండి 100 ప్రశ్నలకు జవాబు చేయాల్సిఉంటుంది. పార్ట్ A మరియు పార్ట్ B అందరి సాధారణంగా ఉంటాయి. పార్ట్ C అభ్యర్థులు ఎన్నుకున్న సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది. అభ్యర్థులకు ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. 150 ప్రశ్నలు 120 నిముషాలలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
పార్ట్ A జనరల్ ఇంగ్లీష్ 25 25
పార్ట్ B జనరల్ నాలెడ్జ్ 15 15
టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 10
పార్ట్ C మ్యాథమెటిక్స్ (100 ప్రశ్నలు 100 మార్కులు)
మ్యాథమెటిక్స్ 100 100
ఫీజికల్  సైన్స్ (100 ప్రశ్నలు 100 మార్కులు)
ఫిజిక్స్ 50 50
కెమిస్ట్రీ 50 50
బయోలాజికల్ సైన్స్ (100 ప్రశ్నలు 100 మార్కులు)
బోటనీ 50 50
జువాలజీ 50 50
సోషల్ సైన్స్ (100 ప్రశ్నలు 100 మార్కులు)
జియోగ్రఫీ 35 35
హిస్టరీ 30 30
ఎకనామిక్స్ 20 20
సివిక్స్ 15 15
ఇంగ్లీష్ (100 ప్రశ్నలు 100 మార్కులు)
ఇంగ్లీష్ 100 100

ఏపీ ఎడ్‌సెట్ క్వాలిఫై మార్కులు & ర్యాంకింగ్ విధానం

జనరల్ కేటగిరి అభ్యర్థులు ఎడ్‌సెట్ యందు క్వాలిఫై అవ్వాలంటే 25 శాతం మార్కులు సాధించాలి. 150 మార్కులకు జరిగే పరీక్షలో 37 మార్కులను దాటి సాధించిన వారినే ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు యెటువంటి కనీస క్వాలిఫై మార్కులు నిర్ణహించలేదు.

ఫీజికల్ సైన్సెస్ మరియు మ్యాథమెటిక్స్ మెథడాలజీస్ ఐచ్చికంగా తీసుకునే మహిళా అభ్యర్థులకు కూడా యెటువంటి కనీస అర్హుత మార్కుల నియమం లేదు. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష యొక్క ర్యాంకింగ్ ప్రక్రియ పరీక్షలో వివిధ భాగాలలో సాధించిన మెరిట్ ను ఆధారంగా చేసుకుని తుది జాభితా తయారు చేస్తారు. ఇందులో పార్ట్ C మెథడాలజీలో అభ్యర్థులు సాధించిన స్కోరు ర్యాంకింగులో ప్రధానపాత్ర వహిస్తుంది.

ఒకవేళ మూడు విభాగాల్లో అభ్యర్థుల స్కోరు సమమైతే కౌన్సిలింగ్ సమయంలో అప్పటి పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటారు లేదా అధిక వయస్సు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. సీట్లు కేటాయింపులో 85 శాతం లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం యూనివర్సిటీల నియమాలనుసారం భర్తీచేస్తారు.

Advertisement

Post Comment