ఏపీ ఈఎపీసెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ
Admissions Ap CETs

ఏపీ ఈఎపీసెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ ఈఏపీసెట్ 2023 పరీక్షలను మే 15 నుండి నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతుంది.

Advertisement

కోవిడ్ కారణంగా గత మూడేళ్ళుగా గాడి తప్పిన విద్యా వ్యవస్థను దారిలో పెట్టేందుకు ఈ ఏడాది అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ముందుగా నిర్వహించి, అంతే త్వరంగా ప్రవేశాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు వెల్లడించింది.

ఏపీ ఈఏపీసెట్ 2023

ఏపీ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు మరియు టెక్నికల్ ఇనిస్టిట్యూట్లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల యందు మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈఏపీసెట్ అనగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ పార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.

Exam Name AP EAPCET 2023
Exam Type Entrance Test
Admission For B.Tech, Ag B.Sc, Pharmacy courses
Exam Date 15/05/2023 O/W
Exam Duration 3 Hours
Exam Level State Level (AP)

ఏపీ ఈఏపీసెట్ సమాచారం

ఏపీ ఎంసెట్ హిస్టరీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ పేరుతో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షను, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఈఏపీసెట్ మరియు టీఎస్ ఎంసెట్ పేర్లతో విడివిడిగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఈఏపీసెట్ పరీక్షను కాకినాడ జవాహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ నిర్వహిస్తుండగా, టీఎస్ ఎంసెట్ ను జవాహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరపబడుతుంది.

ఏపీ ఈఏపీసెట్ పరీక్షకు ఏటా రెండు లక్షల నుండి మూడు లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అందులో రెండులక్షలు వరకు ఇంజినీరింగ్ పరీక్షకు హాజరవుతుండగా డబ్భై నుండి యెనభైవేల మంది అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్ష రాస్తున్నారు. డిపార్టుమెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కనుసన్నలలో కాకినాడ జేఎన్టీయూ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్-ఫార్మసీ పేరుతొ వేర్వేరుగా జరిగే ఈ పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో అందుబాటులో ఉంటుంది. పూర్తి ఆన్‌లైన్‌(CBT) విధానంలో జరిగే ఈ పరీక్షలో 160 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు 3 గంటల నిడివిలో సమాధానం చేయాల్సి ఉంటుంది.

ఏపీ ఈఎపీసెట్ ద్వారా అడ్మిషన్ పొందే కోర్సులు

ఇంజనీరింగ్ కోర్సులు అగ్రికల్చర్ కోర్సులు
బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ & బయోటెక్నాలజీ
బయోటెక్నాలజీ వెటర్నరీ సైన్స్
బీటెక్ (డైరీ టెక్నాలజీ ) బీఎస్సీ హార్టీ కల్చర్
బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) బ్యాచిలర్ అఫ్ ఫిషరీ సైన్స్
బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ యానిమల్ హుస్బెండరీ
బీఫార్మసీ & ఫార్మాడీ బీఫార్మసీ & ఫార్మాడీ

ఎంబీబీస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్ వంటి మెడికల్ కోర్సుల ప్రవేశాలు జాతీయ స్థాయిలో జరిగే నీట్ ప్రవేశపరీక్ష ద్వారా భర్తీచేయబడతాయి.

ఏపీ ఈఎపీసెట్ 2023 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. భారతీయ మూలాలు కలిగిన విదేశీయలు(PIO) మరియు విదేశాల్లో స్థిరపడిన భారతీయలు (OCI) కూడా అర్హులు.
  • ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణా సంబంధించిన విద్యార్థులు లోకల్ లేదా నాన్ లోకల్ సంబంధిత అర్హుత నిమయాలు సంతృప్త పరచాలి.
  • ఇంజనీరింగ్ & ఫార్మసీ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసేవారు మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్ లేదా 10+2 పూర్తిచేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్నవారు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాలకోసం దరఖాస్తు చేసేవారు బోటనీ, జువాలజీలు ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ లేదా 10+2 పూర్తిచేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్నవారు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • సంబంధిత సబ్జెక్టులకు అనుగుణంగా ఒకేషనల్ మరియు రెండేళ్ల డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • ఇంజనీరింగ్ మరియు ఫార్మా కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 16 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
  • అగ్రికల్చర్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 17 ఏళ్ళు నుండి 22 ఏళ్ళ మధ్య ఉండలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3 ఏళ్ళ సడలింపు ఉంటుంది.

ఏపీ ఈఎపీసెట్ 2023 షెడ్యూల్

ఏపీ ఈఎపీసెట్ దరఖాస్తు ప్రారంభం 11 మార్చి 2023
ఏపీ ఈఎపీసెట్ దరఖాస్తు గడువు 15 ఏప్రిల్ 2023
దరఖాస్తులో చేర్పులు-మార్పులు 4 మే 2023
ఏపీ ఈఎపీసెట్ హాల్ టికెట్ 7 మే 2023
ఏపీ ఈఎపీసెట్ ఇంజనీరింగ్ పరీక్ష 15 - 18 మే 2023
ఏపీ ఈఎపీసెట్ అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష 22 & 23 మే 2023
ఏపీ ఈఎపీసెట్ ఫలితాలు జూన్ 2023
 ఎగ్జామ్ సమయం (ఉదయం) 9:00 AM TO 12:00 PM
ఎగ్జామ్ సమయం (మధ్యాహ్నం) 03:00 PM TO 06:00 PM

ఏపీ ఈఎపీసెట్ 2023 దరఖాస్తు ఫీజు

పరీక్ష పేపర్ రిజిస్ట్రేషన్ ఫీజు
ఇంజినీరింగ్ (E) 600/- (OC) 550/- (BC) 500/- (SC/ST)
అగ్రికల్చర్ (A) 600/- (OC) 550/- (BC) 500/- (SC/ST)
ఇంజనీరింగ్ & అగ్రికల్చర్ (E & A) 1200/- (OC) 1100/- (BC) 1000/- (ST)
  • 500/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ : 30 ఏప్రిల్ 2023
  • 1,000/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ : 5 మే 2023
  • 5,000/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ : 12 మే 2023
  • 10,000/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ : 14 మే 2023

దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్ ఆన్‌లైన్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు సమయంలో ఉండే అదనపు రుసుములు అభ్యర్థులే చెల్లించవల్సి ఉంటుంది.

ఏపీ ఈఎపీసెట్ 2023 రిజిస్ట్రేషన్

ఏపీ ఈఎపీసెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అధికారిక ఈఎపీసెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

  • ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్ (ఇంటర్మీడియట్)
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
  • ఆధార్ నెంబర్
  • PH, NCC, Sports సర్టిఫికేట్లు
  • ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
  • స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అభ్యర్థి యొక్క విద్యా, వ్యక్తిగత, చిరునామా వివరాలు పొందుపర్చడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.

దరఖాస్తు పూర్తిచేసే ముందు మీ వివరాలు పలుమార్లు సరి చూసుకోండి. చివరి దశలో మీ దరఖాస్తును ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ  పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.

ఏపీ ఈఎపీసెట్ 2023 రీజనల్ ఎగ్జామ్ సెంటర్లు

  • అనంతపూర్ : అనంతపూర్, గూటీ, హిందూపూర్, పుట్టపర్తి.
  • చిత్తూరు : చిత్తూరు: మదనపల్లి, పుత్తూరు, తిరుపతి.
  • తూర్పు గోదావరి :  అమలాపురం, కాకినాడ, రాజమండ్రి.
  • గుంటూరు : గుంటూరు, నరసరావుపేట.
  • కృష్ణ : గుడ్లవల్లేరు, కంచికచర్ల, మచిలీపట్టణం, మైలవరం, విజయవాడ.
  • కర్నూల్ : కర్నూల్, నంద్యాల.
  • నెల్లూరు : గూడూరు, కావాలి, నెల్లూరు.
  • ప్రకాశం : చీరాల, మార్కాపురం, ఒంగోలు.
  • శ్రీకాకుళం : రాజాం, శ్రీకాకాకుళం, టెక్కలి.
  • విశాఖపట్నం : అనకాపల్లి, గాజువాక, ఆనందపురం, విశాఖపట్నం సిటీ.
  • విజయనగరం : బొబ్బిలి, విజయనగరం.
  • పశ్చిమ గోదావరి : భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఏలూరు.
  • కడప : కడప, పొద్దుటూరు, రాజంపేట.
  • హైదరాబాద్ : ఎల్బీ నగర్, నాచారం. సికింద్రాబాద్.

ఏపీ ఈఎపీసెట్ 2023 ఎగ్జామ్ నమూనా

ఏపీ ఈఎపీసెట్ 2023 పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (CBT) విధానంలో కంప్యూటర్ ఆధారంగా నిర్వహించబడుతుంది. మూడు గంటల నిడివితో 160 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. పరీక్ష నిర్ణహించిన తేదీల్లో రెండు సెషన్లలో జరుగుతుంది.

మొదటి సెషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు జరపబడుతుంది. ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకునేవారికి ఒకే రోజు రెండు సెషన్లలో పరీక్ష పూర్తివుతుంది.

ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి జరిగే ప్రశ్నపత్రంలో మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీల నుండి 160 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇందులో మ్యాథ్స్ నుండి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 40 ప్రశ్నలు మరియు కెమిస్ట్రీ నుండి 40 ప్రశ్నలు వచ్చే విదంగా పేపర్ కూర్పు ఉంటుంది. సమయం 3 గంటలు. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.

అగ్రికల్చర్, ప్రవేశాలకు సంబంధించి జరిగే ప్రశ్నపత్రంలో బయాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీల నుండి 160 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇందులో బోటనీ నుండి 40 ప్రశ్నలు, జూవాలజి నుండి 40 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 40 ప్రశ్నలు మరియు కెమిస్ట్రీ నుండి 40 ప్రశ్నలు వచ్చే విదంగా పేపర్ కూర్పు ఉంటుంది. సమయం 3 గంటలు. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.

ఏపీ ఈఎపీసెట్ సిలబస్ ప్రశ్నలు మార్కులు
ఇంజనీరింగ్ సెట్ మ్యాథ్స్ (80 ప్రశ్నలు)
ఫిజిక్స్ (40 ప్రశ్నలు)
కెమిస్ట్రీ (40 ప్రశ్నలు)
160 ప్రశ్నలు 160 మార్కులు
అగ్రికల్చర్ సెట్ ఫిజిక్స్ (40 ప్రశ్నలు)
కెమిస్ట్రీ (40 ప్రశ్నలు)
బోటనీ (40 ప్రశ్నలు)
జూవాలాజీ (40 ప్రశ్నలు)
160 ప్రశ్నలు 160 మార్కులు

ఏపీ ఈఎపీసెట్ క్వాలిఫై మార్కులు & ర్యాంకింగ్ విధానం

ఏపీ ఈఎపీసెట్ పరీక్షలో 25 శాతంకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులందరిని ర్యాంకింగు కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు యెటువంటి క్వాలిఫై మార్కులు లేవు. ఎంసెట్ హాజరైన వారందరికీ వారి కోటా అనుసారం ప్రవేశాలు కల్పిస్తారు. ఇకపోతే ఎంసెట్ మార్కుల లెక్కింపు నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది.

వివిధ సెషన్లలో అభ్యర్థులకు వచ్చిన మార్కులును నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి కేటగిరి వారీగా, అర్హుత నిబంధలను అనుచరించి తుది మెరిట్ జాబితా తయారుచేస్తారు. అభ్యర్థుల తుది ర్యాంకుల ప్రకటన ఎంసెట్ మరియు ఇంటర్మీడియట్ లో వారు సాధించిన మార్కుల ఆధారంగా వెలువడుతుంది.

75శాతం ఎంసెట్ వెయిటేజీని మరియు 25 శాతం ఇంటర్మీడియేట్ వెయిటేజీని ఆధారంగా చేసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఫలితాలు ప్రకటన జరిగిన ఇది పది రోజుల్లో ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ లో ర్యాంకు కార్డుతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్ అందుబాటులో ఉంచబడుతుంది.

Where,
SASD: Sum of Average (A) and Standard Deviation (SD) of the subject of a session in which the candidate appeared.
GASD: Sum of Average (A) and Standard Deviation (SD) of all the candidates across all sessions of the subject put together.
STA: Average mark of the top 0.1% of the candidates in the subject of a session in which the candidate appeared.
GTA: Average mark of the top 0.1% of all the candidates across all the sessions of the subject put together.

Advertisement

Post Comment