ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ పీజీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ 2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ పీజీఈసెట్ 2023 పరీక్షలను మే 28 నుండి 30 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతుంది.
కోవిడ్ కారణంగా గత మూడేళ్ళుగా గాడి తప్పిన విద్యా వ్యవస్థను దారిలో పెట్టేందుకు ఈ ఏడాది అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ముందుగా నిర్వహించి, అంతే త్వరంగా ప్రవేశాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు వెల్లడించింది.
ఏపీ పీజీఈసెట్ 2023
ఏపీ పీజీఈసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు, టెక్నికల్ ఇనిస్టిట్యూట్లు మరియు ఫార్మసీ కాలేజీల్లో ఎంటెక్, ఎంఫార్మా, ఫార్మా డీ కోర్సుల యందు మొదటి యేడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. పీజీఈసెట్ అనగా పోస్టుగ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.
ఏపీ పీజీఈసెట్ పరీక్షను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉమ్మడిగా నిర్వహిస్తాయి. బీటెక్, బీఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
Exam Name | AP PGECET 2023 |
Exam Type | Entrance Test |
Entrance For | M.Tech, M.Pharmacy |
Exam Date | 28-30/05/2023 |
Exam Duration | 2 Hours |
Exam Level | State Level (AP) |
ఏపీ పీజీఈసెట్ 2023 ఎలిజిబిలిటీ
- అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల నియమ నిబంధనలను అనుసరించి అభ్యర్థులు తమ స్థానికతను నిరూపించుకోవాలి.
- AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి .
- అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్లు స్థానికేతరులకు కేటాయిస్తారు.
- కౌన్సిలింగ్ సమయంలో గేట్, జీప్యాట్ లలో అర్హుత సాధించిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
ఏపీ పీజీఈసెట్ 2023 షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ | 21 మార్చి 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 30 ఏప్రిల్ 2023 |
చేర్పులు మార్పులు | 16 మే 2023 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | 22 మే 2023 |
పరీక్ష తేదీ | 28-30 మే 2023 |
ఫలితాలు | జూన్ 2023 |
కౌన్సిలింగ్ | జులై 2023 |
ఏపీ పీజీఈసెట్ 2023 రిజిస్ట్రేషన్
ఏపీ పీజీఈసెట్-2023 దరఖాస్తు ఆన్‌లైన్ విధానంలో చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అభ్యర్థి యొక్క విద్యా, వ్యక్తిగత, చిరునామా వివరాలు పొందుపర్చడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.
దరఖాస్తు పూర్తిచేసే ముందు మీ వివరాలు పలుమార్లు సరి చూసుకోండి. చివరి దశలో మీ దరఖాస్తును ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.
- వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
- మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
- ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
- దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
- నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు
ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ఫీజు
ధరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1200 రూపాయలు, బీసీ విద్యార్థులకు 900/- మరియు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 700/- రూపాయలుగా నిర్ణహించారు. దరఖాస్తు రుసుములు టీఎస్/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలలో పాటుగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ విధానాల ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు. చెల్లింపు సమయంలో ఉండే అదనపు సర్వీస్ చార్జీలను అభ్యర్థులే భరించాల్సి వుంటుంది.
కేటగిరి | ధరఖాస్తు రుసుము |
జనరల్ అభ్యర్థులు | 1200/- |
బీసీ అభ్యర్థులు | 900/- |
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు | 700/- |
ఏపీ పీజీఈసెట్ 2023 ఎగ్జామ్ సెంటర్లు
అనంతపురం గుంటూరు భీమవరం విజయవాడ కర్నూలు కడప కాకినాడ నెల్లూరు ఎన్టీఆర్ |
ఒంగోలు రాజమహేంద్రవరం చిత్తూరు తిరుపతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం హైదరాబాద్ పలనాడు |
ఏపీ పీజీఈసెట్ 2023 ఎగ్జామ్ నమూనా
ఏపీ పీజీఈసెట్ పూర్తి కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో మొత్తం 120 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలకు 2 గంటల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
ఎంపిక చేసుకున్న స్పెషలైజ్డ్ సబ్జెక్టు యొక్క యూజీ సిలబస్ | 120 ప్రశ్నలు | 120 మార్కులు | 2 గంటలు |
ఏపీ పీజీఈసెట్ 2023 క్వాలిఫై మార్కులు
ఏపీ పీజీఈసెట్ 2020 క్వాలిఫై మార్కులు 25% గా ప్రకటించారు. 120 మార్కులకు జరిగిన పరీక్షలో 30 మార్కులు దాటి సాధించిన అభ్యర్థులను ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి అర్హుత మార్కులు నిర్ణయించలేదు.