Advertisement
ఏపీ ఈసెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions Ap CETs Engineering Entrance Exams

ఏపీ ఈసెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

నేరుగా రెండవ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఈసెట్ 2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ ఈసెట్ 2023 పరీక్షలను మే 5 వ తేదీన నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతుంది.

కోవిడ్ కారణంగా గత మూడేళ్ళుగా గాడి తప్పిన విద్యా వ్యవస్థను దారిలో పెట్టేందుకు ఈ ఏడాది అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ముందుగా నిర్వహించి, అంతే త్వరంగా ప్రవేశాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు వెల్లడించింది.

ఏపీ ఈసెట్ 2023

ఏపీ ఈసెట్ పరీక్షను డిప్లొమా మరియు బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన విద్యార్థులకు నేరుగా రెండవ ఏడాది ఇంజనీరింగు కోర్సులలో ప్రవేశం కల్పించేందుకు నిర్వహిస్తారు. అంతే కాకుండా డిప్లొమాలో ఫార్మసీ బ్రాంచ్ చదువుకునే విద్యార్థులు, ఈసెట్ ద్వారా నేరుగా బీఫార్మసీ రెండవ ఏడాదిలో అడ్మిషన్ పొందొచ్చు.

ఏపీ ఈసెట్ అర్హుత సాధించిన విద్యార్థులు ఎఐసిటీఈ గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టెక్నికల్ ఇన్టిట్యూట్లలో అడ్మిషన్ పొందొచ్చు. అలానే ఫార్మసీ కౌన్సిల్ అఫ్ ఇండియా అధీనంలో నడిచే అన్ని ఫార్మసీ కాలేజీల్లో నేరుగా బీఫార్మసీ రెండవ ఏడాదిలో ప్రవేశం పొందొచ్చు. ఈసెట్ ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు జేఎన్‌టీయూ అనంతపూర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.

Exam Name AP ECET 2023
Exam Type Entrance Exam
Exam For Admission for Engineering
Exam Date 05/05/2023
Exam Duration 3 Hours
Exam Level State Level (AP)

ఏపీ ఈసెట్ 2023 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయులై ఉండాలి.
  • అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినవారై ఉండాలి. అందుబాటులో ఉన్న సీట్లలో 85% ఆంధ్రప్రదేశ్ మరియు 15% తెలంగాణ అభ్యర్థులకు కేటాయించబడి ఉంటాయి.
  • ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి సంబంధిత డిప్లొమాలో 40% మార్కులతో ఉత్తీర్ణతై ఉండాలి.
  • లేదా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి 60% మార్కులతో బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసి ఉండాలి.
  • బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఈసెట్ ద్వారా బీఫార్మసీ కోర్సుల్లోకి ప్రవేశంలేదు

ఏపీ ఈసెట్ షెడ్యూల్ 2023

ఏపీ ఈసెట్ దరఖాస్తు ప్రారంభం 10 మార్చి 2023
ఏపీ ఈసెట్ దరఖాస్తు గడువు 15 ఏప్రిల్ 2023
చేర్పులు మార్పులు 25 ఏప్రిల్ 2023
ఏపీ ఈసెట్ హాల్ టికెట్ 28 ఏప్రిల్ 2023
ఏపీ ఈసెట్ 2023 ఎగ్జామ్ 05 మే 2023
ఏపీ ఈసెట్ ఫలితాలు మే 2023
ఏపీ ఈసెట్ ర్యాంకు కార్డు జూన్ 2023

ఏపీ ఈసెట్ 2023 దరఖాస్తు ఫీజు

జనరల్ అభ్యర్థులు 600/-
బీసీ అభ్యర్థులు 550/-
ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అభ్యర్థులు 500/-
  • 500/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2023

దరఖాస్తు రుసుములు తెలంగాణ  ఆన్‌లైన్, ఏపీ  ఆన్‌లైన్ తో పాటు  ఆన్‌లైన్ విధానంలో డెబిట్ కార్డు. క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో ఉండే అదనపు చార్జీలు అభ్యర్థులే భరించాలి.

ఏపీ ఈసెట్ 2023 రిజిస్ట్రేషన్

ఏపీ ఈసెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. ఏపీ అధికారిక ఈసెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

  • ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
  • ఆధార్ నెంబర్
  • PH, NCC, Sports సర్టిఫికేట్లు
  • ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
  • స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అభ్యర్థి యొక్క విద్యా, వ్యక్తిగత, చిరునామా వివరాలు పొందుపర్చడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.

దరఖాస్తు పూర్తిచేసే ముందు మీ వివరాలు పలుమార్లు సరి చూసుకోండి. చివరి దశలో మీ దరఖాస్తును ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ  పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.

ఏపీ ఈసెట్ 2023 ఎగ్జామ్ నమూనా

ఇంజనీరింగ్ మరియు బీఫార్మసీ రెండవ ఏడాది ప్రవేశాలను ఉద్దేశించి జరిగే ఈసెట్ ప్రవేశపరీక్ష పూర్తి ఆన్‌లైన్ విధానంలో జరపబడుతుంది. 3 గంటల నిడివిలో మొత్తం మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైనా సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వబడుతుంది.

ఇంజనీరింగ్ మరియు బీఫార్మసీ కోర్సులకు సంబంధించి వేరువేరుగా ప్రశ్నపత్రాలు ఇవ్వబడతాయి. ఇంజనీరింగ్ పప్రవేశంకోసం పోటీపడే డిప్లొమా మరియు బీఎస్సీ విద్యార్థులలో కూడా విభిన్నత ఉంటుంది. ఆయా ప్రశ్నపత్రాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈక్రింది పట్టికలు చుస్తే పూర్తిగా అర్ధమౌతుంది.

ఏపీ ఈసెట్ 2023 ఇంజనీరింగ్ పేపర్ మోడల్

సబ్జెక్టు / పేపర్ మార్కులు
మ్యాథమెటిక్స్ 50 అన్ని బ్రాంచీల అభ్యర్థులకు ఒకే పేపర్
ఫిజిక్స్ 25 అన్ని బ్రాంచీల అభ్యర్థులకు ఒకే పేపర్
కెమిస్ట్రీ 25 అన్ని బ్రాంచీల అభ్యర్థులకు ఒకే పేపర్
ఇంజనీరింగ్ పేపర్ : సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, మైనింగ్.. etc 100 ప్రతీ బ్రాంచీకి భిన్నమైన పేపర్

ఏపీ ఈసెట్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ పేపర్ మోడల్

సబ్జెక్టు / పేపర్ మార్కులు
మ్యాథమెటిక్స్ 100
అనలాటికల్ ఎబిలిటీ 50
కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 50

ఏపీ ఈసెట్ ఫార్మసీ పేపర్ మోడల్

సబ్జెక్టు / పేపర్ మార్కులు
ఫార్మస్యూటిక్స్ 50
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 50
ఫార్మాకోగ్నోసి 50
ఫార్మకాలజీ మరియు టాక్సికాలజీ 50

ఏపీ ఈసెట్ అడ్మిషన్ విధానం

ఏపీ ఈసెట్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా పూర్తి అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించబడుతుంది. వివిధ ఇంజనీరింగ్ బ్రాంచులకు సంబంధించి జరిగే సీట్లు కేటాయింపులో ఆయా బ్రాంచుల్లో డిప్లొమా ఉత్తీర్ణతన సాధించిన మెరిట్ అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి జరిగే సీట్లు కేటాయింపులో మొదటి ప్రాధాన్యం డిప్లొమా ఐటీ అభ్యర్థులకు మాత్రమే ఇవ్వబడుతుంది. వారికీ కేటాయించగా మిగిలిన సీట్లు మాత్రమే ఇతర డిప్లొమా విద్యార్థులకు కేటాయిస్తారు.
  • అలానే టెక్సటైల్ టెక్నాలజీకి సంబందించిన సీట్లలో మొదట ప్రాధాన్యత డిప్లొమా ఇన్ టెక్సటైల్ మరియు టెక్సటైల్ టెక్నాలజీ లో డిప్లొమా అభ్యర్థులకు మాత్రమే ఇవ్వబడుతుంది.
  • బయోటెక్నాలజీ సంబంధించిన సీట్లు డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులకు 1:1 నిష్పత్తి లో కేటాయిస్తారు

ఏపీ ఈసెట్ 2023 క్వాలిఫై మార్కులు

ఏపీ ఈసెట్ 2023 ప్రవేశపరీక్షకు సంబంధించి క్వాలిఫై మార్కులు 25 శాతంగా నిర్ణహించారు. 200 మార్కులకు జరిగే ఈ ప్రవేశపరీక్షలో 50 మార్కులు సాధించిన అభ్యర్థులందరిని ర్యాంకింగ్ కొరకు పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి క్వాలిఫైయింగ్ పరిమితిలేదు.

ఈసెట్ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. మార్కులు సమమైన అభ్యర్థుల ర్యాంకులు, ఆయా ప్రశ్నపత్రాలలో ఉండే ప్రధాన సబ్జెక్టులలో అభ్యర్థి సాధించిన గరిష్ట మార్కుల ఆధారంగా వేరుచేస్తారు. అప్పటికి సమయితే అభ్యర్థుల వయస్సు ఆధారంగా చేసి తుది ర్యాంకులు అందిస్తారు.

Post Comment