Advertisement
ఏపీ ఐసెట్ 2023 : ఎలిజిబిలిటీ, దరఖాస్తు, ఎగ్జామ్ తేదీ
Admissions Ap CETs MBA Entrance Exams

ఏపీ ఐసెట్ 2023 : ఎలిజిబిలిటీ, దరఖాస్తు, ఎగ్జామ్ తేదీ

ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ ఐసెట్  2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీఐసెట్ 2023 పరీక్షలను మే 25 మరియు 26 తేదీల్లో నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతుంది.

కోవిడ్ కారణంగా గత మూడేళ్ళుగా గాడి తప్పిన విద్యా వ్యవస్థను దారిలో పెట్టేందుకు ఈ ఏడాది అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ముందుగా నిర్వహించి, అంతే త్వరంగా ప్రవేశాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు వెల్లడించింది.

ఏపీ ఐసెట్ 2023

ఏపీ ఐసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు మరియు మానేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసెట్ అనగా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. ఏపీ ఐసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కనుసన్నలలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో 200 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. పరీక్షలో సెక్షన్ A మరియు సెక్షన్ B తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంటాయి. సెక్షన్ C కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.

Exam Name AP ICET 2023
Exam Type Entrance Exam
Admission For MBA & MCA
Exam Date 25 & 26/05/2023
Exam Duration 3 Hours
Exam Level State Level (AP)

ఏపీ ఐసెట్ 2023 వివరాలు

ఐసెట్ ద్వారా అడ్మిషన్ పొందే కోర్సులు

  • మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ).
  • మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ)

ఏపీ ఐసెట్ 2023 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారత పౌరులయి ఉండాలి. అలానే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలకు సంబంధించి లోకల్ లేదా నాన్ లోకల్ నియమాలను సంతృప్తి పరచాలి.
  • అడ్మిషన్ పొందే యూనివర్సిటీ యొక్క నియమ అర్హుతలను అభ్యర్థి కలిగి ఉండాలి.
  • 50 శాతం మార్కులతో యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 10+2+3 విధానంలో అడ్మిషన్ సమయానికి ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది.
  • ఎంబీఏ ప్రవేశాలకోసం దరఖాస్తు చేసుకునే వారు పదిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదువుకుని ఉండాలి.
  • ఎంసీఏ ప్రవేశాలకోసం దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదుకుని ఉండాలి.
  • ఎంసీఏ-2 వ ఏడాదిలో డైరెక్ట్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు బీసీఏ లేదా ఐటీ/సీఎస్ విద్యార్థులు ఇంటర్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదువుకుని ఉండాలి.

ఏపీ ఐసెట్ 2023 షెడ్యూల్

ఏపీ ఐసెట్ దరఖాస్తు ప్రారంభం 20 మార్చి 2023
ఏపీ ఐసెట్ దరఖాస్తు గడువు 19 ఏప్రిల్ 2023
దరఖాస్తులో చేర్పులు-మార్పులు 17 మే 2023
ఏపీ ఐసెట్ హాల్ టికెట్ 20 మే 2023
ఏపీ ఐసెట్ 2023 ఎగ్జామ్ తేదీ 24 & 25 మే 2023
ఏపీ ఐసెట్ ఫలితాలు జూన్ 2023
ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ జులై 2023
ఎగ్జామ్ సమయం (ఉదయం) 09:00 AM TO 11:30 AM
ఎగ్జామ్ సమయం (మధ్యాహ్నం) 03:00 PM TO 05:30 PM

ఏపీ ఐసెట్ 2023 దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజు చివరి తేదీ
650/- (OC), 600/- (BC) & 550/- (SC/ST/PH) 19 ఏప్రిల్ 2023
2000/- అపరాధ రుసుముతో 04 మే 2023

దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్ ఆన్‌లైన్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు సమయంలో ఉండే అదనపు రుసుములు అభ్యర్థులే చెల్లించవల్సి ఉంటుంది.

ఏపీ ఐసెట్ 2023 రిజిస్ట్రేషన్

ఏపీ ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అధికారిక ఐసెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

  • ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్ (డిగ్రీ)
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
  • ఆధార్ నెంబర్
  • PH, NCC, Sports సర్టిఫికేట్లు
  • ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
  • స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అభ్యర్థి యొక్క విద్యా, వ్యక్తిగత, చిరునామా వివరాలు పొందుపర్చడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.

దరఖాస్తు పూర్తిచేసే ముందు మీ వివరాలు పలుమార్లు సరి చూసుకోండి. చివరి దశలో మీ దరఖాస్తును ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ  పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.

ఏపీ ఐసెట్ 2023 రీజనల్ ఎగ్జామ్ సెంటర్లు

  • అనంతపూర్ : అనంతపూర్, గూటీ, హిందూపూర్.
  • చిత్తూరు : చిత్తూరు: మదనపల్లి, పుత్తూరు, తిరుపతి.
  • తూర్పు గోదావరి :  అమలాపురం, కాకినాడ, రాజమండ్రి.
  • గుంటూరు : గుంటూరు, నరసరావుపేట, బాపట్ల.
  • కృష్ణ : గుడ్లవల్లేరు, కంచికచర్ల, మచిలీపట్టణం, మైలవరం, విజయవాడ.
  • కర్నూల్ : కర్నూల్, నంద్యాల.
  • నెల్లూరు : గూడూరు, కావాలి, నెల్లూరు.
  • ప్రకాశం : చీరాల, మార్కాపురం, ఒంగోలు.
  • శ్రీకాకుళం : రాజాం, శ్రీకాకాకుళం, టెక్కలి.
  • విశాఖపట్నం : అనకాపల్లి, గాజువాక, ఆనందపురం, విశాఖపట్నం సిటీ.
  • విజయనగరం : బొబ్బిలి, విజయనగరం.
  • పశ్చిమ గోదావరి : భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఏలూరు.
  • కడప : కడప, పొద్దుటూరు, రాజంపేట.
  • హైదరాబాద్ : ఎల్బీ నగర్.

ఏపీ ఐసెట్ 2023 ఎగ్జామ్ నమూనా

ఐసెట్ పరీక్ష పూర్తి కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు 150 నిమిషాల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ప్రధానంగా వెర్బల్ మరియు మాథమెటికల్ నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని అభ్యర్థి యొక్క క్రమబద్ధమైన ఆలోచన సామర్ధ్యాన్ని అంచనా వేచే విధంగా ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి.

ఈ మూడు సెక్షనాలలో అనలైటికల్ ఎబిలిటీ, మాథమెటికల్ ఎబిలిటీ మరియు కమ్యూనికేషన్ ఎబిలిటీ కి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ పరీక్ష పూర్తి స్వరూపం ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకుందాం.

AP-ICET-EXAM-PATTERN

ఏపీ ఐసెట్ క్వాలిఫై మార్కులు & ర్యాంకింగ్ విధానం

ఐసెట్ పరీక్షలో 25 శాతంకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులందరిని ర్యాంకింగు కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు యెటువంటి క్వాలిఫై మార్కులు లేవు. ఎంసెట్ హాజరైన వారందరికీ వారి కోటా అనుసారం ప్రవేశాలు కల్పిస్తారు.

ఇకపోతే ఐసెట్ మార్కుల లెక్కింపు నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. వివిధ సెషన్లలో అభ్యర్థులకు వచ్చిన మార్కులును నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి కేటగిరి వారీగా, అర్హుత నిబంధలను అనుచరించి తుది మెరిట్ జాబితా తయారుచేస్తారు.

అభ్యర్థుల మార్కులు సమమైనప్పుడు సెక్షన్ A, Bలలో వచ్చిన మెరిట్ పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికి సమమైతే అధిక వయసు ఉన్న అభ్యర్థులకు మొదట ప్రాధన్యత ఇస్తారు. ఐసెట్ ర్యాంకు కేవలం ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాలేజీలు మరియు యూనివర్సిటీలలో అడ్మిషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఫలితాలు ప్రకటన జరిగిన ఇది పది రోజుల్లో ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ లో ర్యాంకు కార్డుతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్ అందుబాటులో ఉంచబడుతుంది.

Eamcet-normalization-formula

Where,
SASD: Sum of Average (A) and Standard Deviation (SD) of the subject of a session in which the candidate appeared.
GASD: Sum of Average (A) and Standard Deviation (SD) of all the candidates across all sessions of the subject put together.
STA: Average mark of the top 0.1% of the candidates in the subject of a session in which the candidate appeared.
GTA: Average mark of the top 0.1% of all the candidates across all the sessions of the subject put together.

Post Comment