ఏపీ సెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ
Admissions Research Entrance Exams Teaching Entrance Exams

ఏపీ సెట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు మరియు కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా లేదా లెక్చరర్లుగా అర్హుత కల్పించేందుకు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ మరియు ప్రైవేట్ యూనివర్సిటీలు & కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా లేదా లెక్చరర్లుగా చేరేందుకు అర్హుత లభిస్తుంది. అలానే డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

ఏపీ సెట్ ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏడాదికోసారి నిర్వహించబడుతుంది. దాదాపు 30 స్పెషలైజ్డ్ సబ్జెక్టులలో సెట్ రాసేందుకు అవకాశం ఉంది. పరీక్షా రెండు పేపర్లుగా జరుగుతుంది. పేపర్ I జనరల్ స్టడీస్ సంబంధించి అందరికి కామన్ గా ఉంటుంది. పేపర్ II అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుకు చెందినదై ఉంటుంది.

Exam Name AP SET 2023
Exam Type Eligibility Test
Eligibility For Lecturer & Ast professor
Exam Date -
Exam Duration 3 Hours
Exam Level State Level (AP)

ఏపీ సెట్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన ఉండివర్సిటీ నుండి 55 శాతం మార్కులతో పోస్టుగ్రాడ్యుషన్ పూర్తిచేసి ఉండాలి. చివరి సెమిస్టర్ రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసేందుకు అర్హులు
  • 1991 తర్వాత మాస్టర్ డిగ్రీ చేసిన పీహెచ్డీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసేందుకు అర్హులు
  • ఇంతకముందు ఒక సబ్జెక్టులో యూజీసి నెట్ లేదా సెట్ లో అర్హుత సాధించిన అభ్యర్థులు తిరిగి అదే సబ్జెక్టుకు దరఖాస్తు చేసేందుకు అనర్హులు
  • దరఖాస్తు చేసేందుకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు

ఏపీ సెట్ 2023 ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ -
దరఖాస్తు తేదీలు -
ఎగ్జామ్ తేదీ -
ఫలితాలు -

ఏపీసెట్ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి 1200/-
ఓబీసీ కేటగిరి 1000/-
ఎస్సీ, ఎస్టీ పీడీ అభ్యర్థులు 700/-

ఏపీసెట్ పరీక్ష కేంద్రాలు

విశాఖపట్నం
రాజమండ్రి
గుంటూరు
నెల్లూరు
అనంతపురం
తిరుపతి
కడప
కర్నూలు

ఏపీసెట్ దరఖాస్తు విధానం

ఏపీ సెట్ రాసేందుకు ఆసక్తి అర్హుత ఉన్న అభ్యర్థులు ఏపీ సెట్ అధికారిక (www.apset.net.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. యూజీసీ నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఏపీసెట్ ఎగ్జామ్ నమూనా

ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో రెండు పేపర్లుగా, 3 గంటల నిడివితో జరుగుతుంది. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 2 మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.

పేపర్ I :  పేపర్ I అభ్యర్థులు అందరికి కామన్ పేపరుగా ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ (రీసెర్చ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్) నుండి మొత్తం 50 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. అన్ని ప్రశ్నలకు తప్పనిసరి సమాధానం చేయాలి. ఈ పేపర్లో అభ్యర్థి గరిష్టంగా 100 మార్కులు స్కోర్ చెయ్యొచ్చు.

పేపర్ II: పేపర్ II అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టుకు సంబంధించి నిర్వహించబడుతుంది. ఇందులో మొత్తం 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వబడతయి. ఈ పేపర్లో అభ్యర్థి గరిష్టంగా 200 మార్కులు స్కోర్ చెయ్యొచ్చు.

AP SET Exam Pattern

 పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
 పేపర్ I (జనరల్ స్టడీస్) 50 ప్రశ్నలు 100 3 గంటలు
 పేపర్ II (ఆప్షనల్ స్పెషలైజ్డ్ సబ్జెక్టు) 100 ప్రశ్నలు 200

ఏపీసెట్ క్వాలిఫై మార్కులు & రిజర్వేషన్లు

ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టులో అర్హుత సాధించిన అభ్యర్థుల జాబితాను సబ్జెక్టు వారీగా వివిధ రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని ప్రకటిస్తారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు ఏపీ సెట్లో అర్హుత పొందాలంటే రెండు పేపర్లలో కనీసం 40 శాతం మార్కులు స్కోరు చేసి ఉండాలి.

ఇతర కేటగిరి అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించి ఉండాలి. అర్హుత సాధించిన అభ్యర్థులలో  సబ్జెక్టు వారీగా టాప్  6 శాతం మంది అసిస్టెంట్ ప్రొఫసర్లుగా అర్హుత పొందుతారు. మిగతా అభ్యర్థులు లెక్చరర్లుగా పనిచేసేందుకు అర్హుత కల్పిస్తారు. వివిధ కేటగిర్ల వారీగా రిజర్వేషన్ కోటా ఈ కింది విధంగా ఉంటుంది.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఓబీసీ 29%
ఎస్సీ 15
ఎస్టీ 6%
మహిళలు 33% (అన్ని కేటగిర్లు కలిపి)

ఏపీసెట్ ఆప్షనల్ సబ్జెక్టులు & సిలబస్

సబ్జెక్టు సిలబస్ సబ్జెక్టు సిలబస్
ఆంత్రపాలజీ
హిస్టరీ
కెమికల్ సైన్సెస్
కామర్స్
కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్
ఎకనామిక్స్
ఎడ్యుకేషన్
ఇంగ్లీష్
ఎర్త్, అటామ్స్పిరిక్, ఓషన్ & ప్లానెటరీ సైన్స్
ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
జియోగ్రఫీ
హిందీ
జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్
లా
లైఫ్ సైన్సెస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్
మానేజ్మెంట్
మాథమేటికల్ సైన్సెస్
ఫీజికల్ సైన్సెస్
ఫీజికల్ ఎడ్యుకేషన్
ఫీలాసఫీ
పొలిటికల్ సైన్స్
సైకాలజీ
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
సంస్కృతం
సోషియాలజీ
సోషల్ వర్క్
తెలుగు
ఉర్దూ
విసువల్ ఆర్ట్స్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్
సిలబస్

 

జనరల్ స్టడీస్  ఆల్ పేపర్స్ సిలబస్

Post Comment