గ్లోబల్ డెంటల్ రిలీఫ్ వాలంటీర్లు : డెంటల్ వాలంటీర్లుగా చేరండి
Career Guidance Volunteer Programs

గ్లోబల్ డెంటల్ రిలీఫ్ వాలంటీర్లు : డెంటల్ వాలంటీర్లుగా చేరండి

గ్లోబల్ డెంటల్ రిలీఫ్ (GDR) 2001లో మొదట హిమాలయన్ డెంటల్ రిలీఫ్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. కొలరాడో స్టేట్ పార్క్స్ మాజీ డైరెక్టర్ లారీ మాథ్యూస్ మరియు ఆండ్రూ హోలెసెసెక్‌లు దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ ఆర్గనైజషన్ నేపాల్, ఇండియా, గ్వాటెమాల, మెక్సికో, కెన్యా, మరియు కంబోడియా దేశాలలో పిల్లలకు ఉచిత దంత సంరక్షణ సేవలు అందిస్తుంది.

2001 లో ప్రారంభమైన అప్పటి నుండి పై ఆరు దేశాలలో 2,969 మంది వాలంటీర్ల ద్వారా 193,000 మంది పిల్లలకు $ 40.1 మిలియన్ల విలువైన దంత సంరక్షణ వైద్య సేవలు అందించింది. గ్లోబల్ డెంటల్ రిలీఫ్ డెంటల్ నిపుణులతో పాటుగా నాన్ డెంటల్ వాలంటీర్లు కూడా అవకాశం కల్పిస్తుంది.

వారం నుండి నెల రోజుల వ్యవధితో అందించే ఈ ప్రోగ్రాంలలో 18 ఏళ్ళు నిండిన వారందరూ అర్హులు. రిజనబుల్ ప్యాకేజీ చార్జీలతో విమానాశ్రయం పికప్ నుండి వసతి, భోజనం వరకు అన్ని రకాల సేవలు కల్పిస్తారు. ప్రోగ్రాం పూర్తియ్యాక వాలంటీర్ సర్టిఫికెట్ కూడా అందిస్తారు అందిస్తారు.

సామాజిక సేవ & ట్రావెలింగ్ అంశాలపై అభిరుచి వుండే వారికీ గ్లోబల్ డెంటల్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ జీవితకాలం గుర్తుండిపోయే అనుభవాలను అందిస్తాయి. ఒక వైపు సామజిక సేవ చేసే అదృష్టంతో పాటుగా మరో వైపు ప్రపంచాన్ని సందర్శించే గొప్ప అవకాశం ఈ ప్రోగ్రాముల ద్వారా మీకు లభిస్తుంది.

గ్లోబల్ డెంటల్ రిలీప్‌తో విదేశాలలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడం వలన, మీ సాధారణ పర్యటన వైవిధ్యభరితం అవుతుంది. ఈ ప్రయాణం మిమ్మల్ని స్థానిక సమాజలతో భాగస్వామ్యం చేస్తుంది, కొత్త సంస్కృతులను ప్రామాణికమైన రీతిలో అనుభవించే అవకాశం లభిస్తుంది. ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ఇది ఉత్తమమైన మార్గం.

మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి, జీవితకాల స్నేహాలను పెంచుకోవడానికి మరియు మీ అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ క్లిష్ట సమయంలో నిజమైన ప్రభావం చూపాలనుకుంటే ఈ అనుభూతిని తప్పక ఆస్వాదించాల్సిందే.

Post Comment