Advertisement
యూఎస్‌లో ఉన్నత విద్య కోసం ప్రవేశ పరీక్షలు | యూఎస్ అడ్మిషన్ టెస్టులు
Abroad Education

యూఎస్‌లో ఉన్నత విద్య కోసం ప్రవేశ పరీక్షలు | యూఎస్ అడ్మిషన్ టెస్టులు

ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థులు అక్కడ యూనివర్శిటీలలో అడ్మిషన్ పొందేందుకు ఏదొక ప్రవేశ పరీక్షలో అర్హుత పొందాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ప్రవేశ పరీక్షల్లో అర్హుత పొందటం ద్వారా యూఎస్ స్టూడెంట్ వీసా పొందే ప్రక్రియ సులభతరం అవుతుంది.

అమెరికా యూనివర్శిటీలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరేందుకు పలు రకాల ప్రవేశ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరేందుకు శాట్ మరియు యాక్ట్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం జీఆర్ఈ, జీమ్యాట్, ఎంక్యాట్, ఎల్‌శాట్, డాట్, పీక్యాట్ వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.

స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్ ఎగ్జామ్)

SAT Admission Test - Dates, Registration, Fees, Eligibilityశాట్ ఎగ్జామ్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే ఒకానొక పాపులర్ అడ్మిషన్ టెస్ట్. శాట్ అనగా స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అర్ధం. ఈ పరీక్షను అమెరికాకు చెందిన కాలేజ్ బోర్డ్ మరియు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సంస్థలు నిర్వహిస్తాయి.

శాట్ ప్రవేశ పరీక్షలో అర్హుత పొందటం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని యూనివర్శిటీలు మరియు కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల యందు ప్రవేశం పొందొచ్చు. అమెరికా తీరప్రాంత రాష్ట్రాల యూనివర్శిటీలు శాట్ ప్రవేశ పరీక్షకు మొదటి ప్రాధన్యత ఇస్తాయి.

శాట్ ప్రవేశ పరీక్ష ఏడాదిలో 7 సార్లు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు సగటున 1.5 మిల్లియన్ల మంది విద్యార్థులు ఏటా హాజరవుతున్నారు. శాట్ ప్రవేశ పరీక్ష ప్రధానంగా జూనియర్, సీనియర్ హైస్కూల్ విద్యార్థులు, తమ పాఠశాలలో నేర్చుకున్న నైపుణ్యాలను అంచనా వేస్తుంది.

శాట్ ప్రవేశ పరీక్ష పూర్తి సీబీటీ విధానంలో జరుపుతారు. పరీక్షను పూర్తి చేసేందుకు 3 గంటల సమయం పడుతుంది. రీడింగ్, లాంగ్వేజ్ మరియు మ్యాథమెటిక్స్ అంశాలతో శాట్ పరీక్షను మూడు అంచెలలో నిర్వహిస్తారు.

శాట్ ఎగ్జామ్ స్కోర్ యూఎస్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలలో అడ్మిషన్ పొందేందుకు ఉపయోగపడుతుంది. శాట్ స్కోరు కనిష్టంగా 400 – 1600 మధ్య ఉంటుంది. స్కోర్ రెండు భాగాలగా లెక్కిస్తారు. అందులో ఎవిడెన్స్-బేస్డ్ రీడింగ్ & రైటింగ్ మరియు మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఈ రెండు సెక్షన్ స్కోర్‌లలో ప్రతి దానిలో 200 – 800 వరకు స్కోర్ పొందే అవకాశం ఉంటుంది.

అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలలో అడ్మిషన్ పొందేందుకు సగటున 1050 శాట్ ఎగ్జామ్ స్కోర్ పొందాల్సి ఉంటుంది. 1350 దాటి శాట్ స్కోరు పొందిన విద్యార్థులు టాప్ యూనివర్శిటీలలో అడ్మిషన్ సొంతం చేసుకోవచ్చు. శాట్ స్కోరు మెరుగుపరుచుకునేందుకు విద్యార్థులు పరీక్షకు పలు మార్లు హాజరు కావొచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ ఎగ్జామ్ (యాక్ట్ ఎగ్జామ్)

ACT Exam Eligibility, Important dates, Formatశాట్ ఎగ్జామ్ తర్వాత యునైటెడ్ స్టేట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే మరో పాపులర్ అడ్మిషన్ టెస్ట్ యాక్ట్. యాక్ట్ అనగా అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ అని అర్ధం. ఈ పరీక్షను అమెరికాకు చెందిన యాక్ట్ ఇంక్ నిర్వహిస్తుంది.

యాక్ట్ ప్రవేశ పరీక్షలో అర్హుత పొందటం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని యూనివర్శిటీలు మరియు కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల యందు ప్రవేశం పొందొచ్చు. మధ్య అమెరికా రాష్ట్రాలు, కెనడా యూనివర్శిటీలు యాక్ట్ ప్రవేశ పరీక్షకు మొదటి ప్రాధన్యత ఇస్తాయి.

యాక్ట్ ప్రవేశ పరీక్షకు ఏటా 1.34 మిలియన్లకు పైగా ఉన్నత పాఠశాల గ్రాడ్యుయేట్లు హాజరౌతున్నారు. యూఎస్, కెనడా లోకల్ విద్యార్థుల కోసం సంవత్సరానికి 7 సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇతర దేశాల విద్యార్థుల కోసం సంవత్సరానికి 5 సార్లు ఈ పరీక్ష అందుబాటులో ఉంటుంది.

యాక్ట్ పరీక్ష సీబీటీ విధానంలో మొత్తం 215 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో జరుపుతారు. ప్రశ్నపత్రంలో ఇంగ్లీష్, గణితం, రీడింగ్ మరియు సైన్స్ అంశాలకు చెందిన ప్రశ్నలను నాలుగు సెక్షన్లుగా ఇస్తారు. యాక్ట్ పరీక్షకు సంబంధించి ఎటువంటి అర్హుత మార్కులు కానీ, నెగిటివ్ మార్కింగ్ విధానం కానీ లేవు. అత్యధిక స్కోరు పొందిన విద్యార్థులకు అడ్మిషన్ పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి.

యాక్ట్ పరీక్షలో విద్యార్థి అత్యధికంగా 36 స్కోర్ చేయగలరు. హార్వర్డ్‌లో అడ్మిషన్ పొందే విద్యార్థుల సగటు యాక్ట్ స్కోర్ 32 మరియు 35 మధ్య ఉంటుంది. మిగతా యూనివర్శిటీల యందు అడ్మిషన్ పొందేందుకు 25కి మించి ఉండాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్)

GMAT - Exam Date, Syllabus, Exam Patternఅమెరికాకు ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్‌ కోర్సులలో చేరేందుకు వెళ్లే భారతీయ విద్యార్థులు జీమ్యాట్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2400 బిజినెస్ స్కూళ్లలో పీజీ స్థాయి మేనేజ్‌మెంట్‌ కోర్సుల యందు ప్రవేశాలు పొందేందుకు జీమ్యాట్ ఉపయోగపడుతుంది. ఏటా దాదాపు 2 లక్షలు మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

ఏడాది పొడుగునా జరిగే జీమ్యాట్ ముఖ్యంగా మేనేజ్‌మెంట్ ప్రవేశాల కోసం వచ్చే అభ్యర్థుల అకాడమిక్ మరియు వ్యక్తిగత నైపుణ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించబడుతుంది. జీమ్యాట్ యందు అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా  వారు మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రేవేశం పొందేందుకు మరియు ఆ కోర్సు పూర్తి చేసేందుకు యెంత సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తుంది.

సీబీటీ ఆధారంగా జరిగే జీమ్యాట్ క్యూస్షన్ పేపర్ నాలుగు భాగాలుగా ఉంటుంది. ప్రతి భాగంలో కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నల సంఖ్యతో పాటు నిర్దిష్ట సమయాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 3 గంట 7 నిముషాల నిడివితో సాగే ఈ పరీక్షలో రెండు భాగాలు పూర్తయిన తర్వాత 8 నిముషాలు విరామం తీసుకోవచ్చు. జీమ్యాట్ పూర్తి వివరాలు.

గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జీఆర్ఈ)

GRE Exam - Dates, Registration, Fees, Eligibilityఅమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఎంఏ, ఎంఎస్సీ చేయాలనుకునే తెలుగు విద్యార్థులు గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్ (జీఆర్ఈ ఎగ్జామ్) అర్హుత సాధించటం తప్పనిసరి. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) ఆధ్వర్యంలో జరిగే ఈ అర్హుత పరీక్ష దాదాపు 160 దేశాల్లో 1000 కి పైగా పరీక్ష కేంద్రాలలో ఏడాది పొడుగునా నిర్వహించబడుతుంది.

జీఆర్ఈ స్కోరు మేనేజ్‌మెంట్‌ మరియు లా కోర్సులతో పాటుగా కొన్ని వందల కొలది గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ యందు చేరేందుకు ఉపయోగపడుతుంది. జీఆర్ఈ స్కోరు కార్డు, అర్హుత సాధించిన ఏడాది నుండి ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. పరీక్ష ఫీజు సుమారు 205 డాలర్లు (14000 నుండి 15000 రూ) ఉంటుంది.

జీఆర్ఈ జనరల్ టెస్ట్ మరియు జీఆర్ఈ సబ్జెక్ట్స్ టెస్ట్ పేరుతొ జరిగే ఈ అర్హుత పరీక్షలకు ప్రతి యేటా వేలాది మంది తెలుగు విద్యార్థులు పోటీ పడుతుంటారు. అమెరికాలో మాస్టర్స్ చేయాలనుకునే కలను నిజం చేసే జీఆర్ఈ పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (ఎల్‌శాట్‌ ఇండియా)

LSAT India - Exam Date, Syllabus, Exam Patternలా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌శాక్‌) అనేది యూఎస్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది ఏటా ప్రపంచ వ్యాప్తంగా యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా వంటి అనేక దేశాల్లో 60 వేలకు పైగా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన న్యాయ విద్య ప్రవేశాలను కల్పిస్తుంది.

ఎల్‌శాక్‌ సంస్థ నిర్వహించే ఎల్‌శాట్‌ ప్రవేశ పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 920 సెంటర్లలో జరుగుతుండగా, దానికి లక్ష నలభైవేలకు పైగా అభ్యర్థులు హాజరౌతున్నారు. ఎల్‌శాట్‌ ఇండియా అర్హుతతో ఇండియాతో పాటుగా యూఎస్ ప్రముఖ లా ఇనిస్టిట్యూట్లలో అడ్మిషన్ పొందొచ్చు.

లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ 2009 నుండి ఇండియాలో తమ సేవలను అందిస్తుంది. ఇండియా లా కాలేజీలకు అనుగుణంగా ఎల్‌శాట్‌ ఇండియా పేరుతో ఎల్ఎల్ఎం, ఎల్ఎల్‌బి కోర్సులలో అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఎల్‌శాట్‌ ఇండియాలో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థికి 4 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేస్తారు.

ఎల్‌శాట్‌ కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 2 గంటల 20 నిముషాల నిడివితో జరుగుతుంది. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 నుండి 3 మార్కులు కేటాయిస్తారు.

నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. ఎల్ఎల్ఎం, ఎల్ఎల్‌బి మరియు పీహెచ్డీ ప్రోగ్రామ్ లకు సంబంధించి వేరు వేరు ప్రశ్న పత్రాలు ఇవ్వబడతయి. ఇందులో ఉండే ప్రశ్నల సంఖ్యా, సిలబస్ మినహా రెండు పరీక్షలు ఒకేరీతిలో నిర్వహించబడతాయి. ఎల్‌శాట్‌ ఎగ్జామ్ పూర్తి వివరాలు.

మెడికల్ కాలేజీ అడ్మిషన్ టెస్ట్ (ఎంక్యాట్)

MCAT - Eligibility, Exam Dates, Application Formఎంబీబీఎస్ వంటి మెడికల్ కోర్సులలో చేరేందుకు అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులు మెడికల్ కాలేజీ అడ్మిషన్ టెస్ట్ (ఎంక్యాట్) రాయాల్సి ఉంటుంది. భారతదేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మెజారిటీ బారతీయ విద్యార్థులు ఏటా ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

ఎంక్యాట్ మొత్తం 230 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో జనరల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజిక్స్, సైకాలజీ మరియు సోషియాలజీ అంశాలకు సంబంధించి ఉంటుంది. ఈ పరీక్షను పూర్తి చేసేందుకు మొత్తం 7.5 గంటల సమయం పడుతుంది. ఇది ప్రధానంగా విద్యార్థి క్రిటికల్ అనాలిసిస్ మరియు రీజనింగ్ స్కిల్స్ యొక్క పరిజ్ఞానాన్ని అంచనా వేస్తుంది.

ఎంక్యాట్ పరీక్షను ఏడాది పొడుగునా నిర్వహిస్తారు. డెడపు 21 దేశాల్లో ఏడాదికి 25 సార్లు నిర్వహించబడుతుంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో మూడు సార్లు మరియు రెండు క్యాలెండర్ సంవత్సరాలలో నాలుగు సార్లు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది. ఒక విద్యార్థి తన జీవితకాలంలో గరిష్టంగా ఏడు సార్లు మాత్రమే ఈ పరీక్షను రాసేందుకు అనుమతి ఉంటుంది. పూర్తి వివరాలు

Post Comment