వాలంటీరింగ్ సొల్యూషన్స్ : విదేశాల్లో మెడికల్ & నర్సింగ్ ఇంటర్న్‌షిప్
Career Guidance Volunteer Programs

వాలంటీరింగ్ సొల్యూషన్స్ : విదేశాల్లో మెడికల్ & నర్సింగ్ ఇంటర్న్‌షిప్

వాలంటీరింగ్ సొల్యూషన్స్ విదేశాలలో అద్భుతమైన విద్యార్థి వాలంటీర్ ప్రోగ్రామ్‌లు ఆఫర్ చేస్తుంది. వీరు ప్రధానంగా చైల్డ్ కేర్, టీచింగ్, హెల్త్‌కేర్, మహిళా సాధికారత వంటి ముఖ్యమైన అంశాలలో వాలంటీర్ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నారు.

Advertisement

వాలంటీరింగ్ సొల్యూషన్స్ విస్తృత శ్రేణిలో హైస్కూల్/ కాలేజీ విద్యార్థులకు సరిపడే దాదాపు 150 కి పైగా వాలంటీర్ ప్రోగ్రామ్‌లను 26 కి పైగా దేశాలలో ఆఫర్ చేస్తుంది. కంఫర్ట్ జోన్ నుండి బయటపడి సరికొత్త జీవిత గమ్యాన్ని చేరుకోవాలనే ఆలోచన ఉన్నవారికి వాలంటీరింగ్ సొల్యూషన్స్ యొక్క ప్రోగ్రాంలు నూటికి నూరు శాతం సంతృప్తిని అందిస్తాయి.

2007 లో స్థాపించబడిన వాలంటీరింగ్ సొల్యూషన్స్, ప్రస్తుతం 26 కి పైగా దేశాలలో 15 వేలకు పైగా వాలంటీర్లతో పిల్లల సంరక్షణ, టీచింగ్, మెడికల్ మరియు హెల్త్‌కేర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, మెరైన్ కన్జర్వేషన్ వంటి 150 కంటే ఎక్కువ స్వచ్ఛంద మరియు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలను అందించింది.

వాలంటీరింగ్ సొల్యూషన్స్ యొక్క ప్రోగ్రామ్స్ ప్రధానంగా విద్యార్థులు మరియు యువ ట్రావెలర్లకు అనువుగా ఉంటాయి. ఇవి వారం రోజుల కనీస నిడివి నుండి గరిష్టంగా ఆరు నెలల వరకు ఉంటాయి. పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సమ్మర్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు.

ఈ ప్రోగ్రామ్స్ 200$ డాలర్ల ప్రారంభ రుసుములతో అందుబాటులో ఉన్నాయి. చెల్లించే ప్రోగ్రామ్ ఫీజులో మీ ప్రీ-డిపార్చర్ గైడెన్స్, ఎయిర్‌పోర్ట్ పికప్, వసతి & భోజనం, ప్రోగ్రామ్ ఓరియంటేషన్ మరియు ప్లేస్‌మెంట్, వాలంటీర్ సర్టిఫికెట్ వంటి ప్రయోజనాలు ఉంటాయి.

సామాజిక సేవ & ట్రావెలింగ్ అంశాలపై అభిరుచి వుండే వారికీ ఇంటర్నేషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్స్ జీవితకాలం గుర్తుండిపోయే అనుభవాలని అందిస్తుంది. ఒక వైపు సామజిక సేవ చేసే అదృష్టంతో పాటుగా మరో వైపు ప్రపంచాన్ని సందర్శించే గొప్ప అవకాశం ఈ ప్రోగ్రాముల ద్వారా మీకు లభిస్తుంది.

విదేశాలలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడం వలన, మీ సాధారణ పర్యటన వైవిధ్య భరితమవుతుంది. ఈ ప్రయాణం మిమ్మల్ని స్థానిక సమాజలతో భాగస్వామ్యం చేస్తుంది, కొత్త సంస్కృతులను ప్రామాణికమైన రీతిలో అనుభవించే అవకాశం కల్పిస్తుంది.

ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ఇది ఉత్తమమైన మార్గం. మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి, జీవితకాల స్నేహాలను పెంచుకోవడానికి మరియు మీ అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ క్లిష్ట సమయంలో నిజమైన ప్రభావం చూపాలనుకుంటే ఈ అనుభూతిని తప్పక ఆస్వాదించాల్సిందే.

Advertisement

Post Comment