Advertisement
టెన్త్ మరియు ఇంటర్ తర్వాత ఆర్మీలో ఉద్యోగాలు
Career Guidance Career Options

టెన్త్ మరియు ఇంటర్ తర్వాత ఆర్మీలో ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీలో టెన్త్, ఇంటర్ తర్వాత పదుల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పలు రకాల సోల్జర్ మరియు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఏటా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందటం ద్వారా తక్కువ విద్య అర్హుతతో చిన్న వయస్సులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అవకాశం ఉంటుంది.

దేశ రక్షణ కోసం సరిహద్దులో విధులు నిర్వర్తించే సైనికులకు సంబంధించి వివిధ సేవలు అందించే సోల్జర్ మరియు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సిబ్బంది భర్తీ కోసం సహసవంతమైనా యువత నుండి భారతీయ రక్షణ దళం ఏటా ఆహ్వానం పలుకుతుంది.

ఒకప్పుడు ఆర్మీ లో ఉద్యోగం అంటే  పలుమార్లు ఆలోచించేవారు. దీనికి కారణం నాడు సరైన వసతి సౌకర్యాలు ఉండేవికావు, సమయానికి జీత భత్యాలు అందేవికావు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. నేడు ఆర్మీ ఉద్యోగం అంటే ఒక స్టేటస్ సింబల్. ఉచితాలకు, అలేవేన్సులకు, ప్రోత్సాహకాలకు లోటులేదు.

ప్రారంభంలో ఐదు అంకెల జీవితం, ఏడాదికి 90 రోజులు విశ్రాంతి, ఉచిత వైద్య సదుపాయాలు, ఉచిత రైల్వే ప్రయాణాలు, వివాహితలకు ప్రత్యక వసతి సదుపాయాలు, ఉచిత రేషన్ , ఉచిత యూనిఫాం. పిల్లలకు విద్య అవకాశాలు, ఇతర CDS సదుపాయాలు ఇలా ఇంకెనో ప్రోత్సాహకాలు వారి సొంతం.

ఆర్మీ లో జూనియర్ స్థాయిలో వివిధరకాల విధులు నిర్వహణ  కోసం దాదాపు 8 కేటగిరీలలో భర్తిచేసే JCO/OR ఉద్యోగ ప్రకటన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల నుండి ప్రతి ఏడాది కనీసం ఒక్కసారైనా విడుదల చేస్తారు. ఈ ఉద్యోగ ప్రకటన సమాచారం మీకు స్థానిక న్యూస్ పేపర్ల ద్వారా, ఇతర ఎంప్లాయిమెంట్ మీడియా ద్వారా అందజేస్తారు. ర్యాలీ జరిపే తేదికి నెల రోజుల ముందు ఈ ప్రకటన విడుదల చేస్తారు. ఈ భర్తీ ప్రక్రియ ఐదు దశలలో జరుగుతుంది.

  • సర్టిఫికెట్ వెరిఫికేషన్
  • ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
  • ఫిజికల్ మేజేర్మేంట్ టెస్ట్
  • మెడికల్ టెస్ట్
  • రాత పరీక్ష

ఈ ఐదు దశల వడపోత తర్వాత ప్రకటనలోని ఖాళీలు ఆధారంగా ఉత్తమ ప్రతిభ చూపిన అభ్యర్దుల మెరిట్ లిస్టు తయారుచేసి, ఎంపికైన అభ్యర్దులను దేశవ్యాప్తంగా ఉన్నా ఆర్మీ ట్రైనింగ్ కేంద్రాలలో శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్దులకు  సంభందిత విధులు అప్పగిస్తారు.

సోల్జర్ జనరల్ డ్యూటీ

యుద్ద రంగంలో ముఖ్య భూమిక పోషించే సైనకులు, యుద్ద టాంకర్స్ నడిపే డ్రైవర్లు, ఆయుద ఆపరేటర్లు, గన్నర్లు జనరల్ డ్యూటీ కిందకు వస్తారు. వీరంతా ఆర్మీ సర్వీస్ కార్ప్స్(ASC), ఆర్మీ అర్ద్నన్స్ కార్ప్స్(AOC), ఆర్మీ మెడికల్ కార్ప్స్(AMC) విభాగాలలో సేవలు అందిస్తారు.

  • విద్య అర్హుత: 45% మార్కులతో టెన్త్/ మెట్రిక్యులేషన్ పాస్.
  • వయోపరిమితి: 17 1/2  ఏళ్ళ నుండి 21 ఏళ్ళ మద్య.
  • ప్రమాణాలు: ఎత్తు-166cm, చాతి-77cm,  బరువు-50 కేజీలు

సోల్జర్ టెక్నికల్ డ్యూటీ

ఇండియన్ ఆర్మీ యొక్క ఆయుదాలు, యుద్ద వాహనాలు, ఇతర సాంకేతిక  పరికరాల రోజువారీ నిర్వహణ మరియు సాంకేతిక సమస్యలు పరిష్కరించే ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి ఇంజనీరింగ్ నిపుణులు ఈ టెక్నికల్ విభాగం కింద విధులు నిర్వర్తిస్తారు.

  • విద్య అర్హుత: 50% మార్కులతో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తో కూడిన 10+2/ఇంటర్మీడియట్  పాస్
  • వయోపరిమితి: 17 1/2 నుండి 23 ఏళ్ళ మద్య
  • శారీరక ప్రమాణాలు: ఎత్తు: 163 cm, ఛాతి: 77cm,  బరువు: 50 కేజీలు.

సోల్జర్ (క్లర్క్ & స్టోర్ కీపర్)

ప్రపంచంలో అతిపెద్ద ఆర్మీలలో ఒకటిగా ఉన్నా ఇండియన్ ఆర్మీ యొక్క రోజువారీ ఆఫీసు విధులు నిర్వహణ కొరకు ఆఫీస్ క్లార్క్స్, స్టోర్ కీపర్స్ అవసరం ఉంటుంది. దాదాపు 600-1000 యూనిట్స్ గా ఉండే బారతీయ సైనకుల యొక్క రోజువారీ డాక్యుమెంటేషన్, స్టోర్స్ నిర్వహణ, ఇతర ఆఫీస్ విధులు నిర్వహణ లో వీరు భాగస్వాములు అవుతారు.

  • విద్య అర్హుత: 60% మార్కులతో ఆర్ట్స్, సైన్సు, కామర్స్ లలో ఏదో ఒక గ్రూపు నుండి 10+2/ఇంటర్మీడియట్ పాస్.
  • వయోపరిమితి: 17 1/2 నుండి 23 ఏళ్ళ మద్య.
  • శారీరిక ప్రమాణాలు: ఎత్తు: 162 cm, ఛాతి: 77cm, బరువు: 50 కేజీలు.

సోల్జర్ - నర్సింగ్ అసిస్టెంట్

ఆర్మీ కి సంభందించిన హాస్పిటల్స్, క్లినిక్స్ లలో వైద్యులకు సహాయపడే నర్సింగ్ అసిస్టెంట్స్ అవసరం ఉంటుంది. వీరు ఆర్మీ చెందిన వివిధ హాస్పిటల్స్ లలో పార మెడికల్ సిబ్బంది  గా విధులు నిర్వర్తిస్తారు , ఆపరేషన్ థియేటర్స్ లో వైద్యులకు సహాయకులుగా, ఫస్ట్ ఎయిడ్ చేసే సిబ్బందిగా, మెడికల్ స్టోర్ నిర్వహణ వంటి విధులు వీరు నిర్వహించవలసి ఉంటుంది.

  • విద్య అర్హుత: 50% మార్కులతో బయాలజీ, ఫిజిక్స్బ, కెమిస్ట్రీ లతో 10+2/ఇంటర్మీడియట్ పాస్
  • వయోపరిమితి: 17 1/2 నుండి 23 ఏళ్ళ మద్య.
  • శారీరిక ప్రమాణాలు: ఎత్తు:165 cm, ఛాతి: 77cm, బరువు:50కేజీలు.

సోల్జర్ - ట్రేడ్స్‌మ్యాన్

ఆర్మీ క్వార్టర్స్, ఆర్మీ కంపౌండ్స్, ఆర్మీ క్యాంటీన్ లలో రోజువారీ విధులు నిర్వహణ కోసం అన్ని రకాల సిబ్బంది అవసరం ఉంటుంది. చెఫ్స్, స్టివార్డ్స్ , వాషేర్స్, గార్దినర్స్, జంతు సంరక్షకులు, ప్లంబర్, సంగీత వాయుద్యులు, ఆర్టిస్టులు, టైలర్స్, టెక్నీషియన్స్, హౌస్ కీపర్స్, వాచ్ మెన్స్, కేన్నెల్ మెన్స్, మెస్ కీపర్స్, వాషేర్ మెన్స్ వంటి వివిధరకాల సేవలు వీరు అందిస్తారు.

  • విద్య అర్హుత: హౌస్ కీపర్స్, మెస్ కీపర్స్: 8th క్లాసు పాస్, ఇతర అన్ని ట్రేడ్స్ కు పది పాస్ అయ్యిండాలి.
  • వయోపరిమితి: 17 1/2 నుండి 23 ఏళ్ళ మద్య .s

సోల్జర్ - నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ

ఆర్మీ కి సంభందించిన వెటర్నరీ హాస్పిటల్ లో సేవలు అందించేందుకు వెటర్నరీ నర్సింగ్ అసిస్టెంట్స్ అవసరం ఉంటుంది. వీరు ఆర్మీ కి సంభందించే గుర్రాలు, కుక్కలు వంటి జంతువల ఆరోగ్య సంరక్షణ విధులు నిర్వర్తిస్తారు.

  • విద్య అర్హుత: 50% మార్కులతో బయాలజీ, ఫిజిక్స్బ, కెమిస్ట్రీ లతో 10+2/ఇంటర్మీడియట్ పాస్
  • వయోపరిమితి: 17 1/2 నుండి 23 ఏళ్ళ మద్య.
  • శారీరిక ప్రమాణాలు: ఎత్తు:165 cm, ఛాతి: 77cm, బరువు:50కేజీలు.

హవిల్దార్ - సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్

శత్రు దేశాల సైనిక స్తావరాలు గుర్తింపు, సరిహద్దు దేశాల బౌగోళిక స్వరూపాలు సేకరించటం, దేశ సరిహద్దులకు  సంభందించిన కచ్చితమైన మ్యాప్ ల నిర్వహణ వంటి విధులు నిర్వహించేందుకు సర్వేయర్ల అవసరం ఉంటుంది.

  • విద్య అర్హుత: 10+2/ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుని  BA/BSC లలో గణితం ఒక సబ్జెక్టు గా ఉత్తీర్ణత.
  • వయోపరిమితి:20 నుండి 25 ఏళ్ళ మద్య.

జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలీజియస్ టీచర్)

క్లిష్టమైన సమయాలలో ఓదార్పును ఇచ్చేందుకు, మోటివేషన్ కల్పించేందుకు సైనంలో మత గువుల అవసరం ఉంటుంది. సైన్యం కు సంభందించిన మతపరమైన ప్రదేశాలలో పనిచేందుకు పండిట్స్, మౌల్విస్, ప్యాడిస్ గ్రాంటిస్ లకు అవకాసం ఉంది. వీరు మత పరమైన ప్రదేశాల నిర్వహణ, సైనికులలో మనో దైర్యాన్ని నింపే మనిసిక కౌన్సిలర్స్ గా విధులు నిర్వర్తిస్తారు.

  • విద్య అర్హుత: అప్పటి నోటిఫికేషన్ అనుచరించి ఉంటుంది.
  • వయోపరిమితి: 25 ఏళ్ళ నుండి 34 ఏళ్ళ మద్య

జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (కేటరింగ్)

3 నుండి 4 మిలియన్ల సైనిక సామర్ద్యం ఉండే ఇండియన్ ఆర్మీ కి రోజువారీ బోజన అవసరాల నిర్వహణ ఎంతో శ్రమతో కూడుకున్న పని. వందల సంఖ్యలో ఉండే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు, సైనిక శిబిరాలు లకు బోజన సరఫరా, వాళ్ళకి అన్నివిధాలుగా శక్తినిచ్చే పౌష్టికాహారం ఇచ్చేందుకు  ప్రోఫిసినల్ కేటరింగ్ సిబ్బంది, ఆఫీసర్స్ అవసరం.

  • డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు కేటరింగ్ టెక్నాలజీ
  • 21 ఏళ్ళ నుండి 27 ఏళ్ళ మద్య

ఏడాది పొడుగునా విడులయ్యే ఆర్మీ ఉద్యోగ ప్రకటన సమాచారం, ఎంపిక పరీక్షల పూర్తి సమాచారం కోసం ఆర్మీ వెబ్సైట్ సందర్శించగలరు.