Advertisement
పీజీ విద్యార్థులకు యూజీసీ SC, ST స్కాలర్‌షిప్ 2024
Scholarships

పీజీ విద్యార్థులకు యూజీసీ SC, ST స్కాలర్‌షిప్ 2024

భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు/ఇన్‌స్టిట్యూట్‌లు/కళాశాలల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెషనల్ కోర్సులలో పోస్ట్-గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ  పీజీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించడం కోసం యూజీసీ ఈ పీజీ స్కాలర్షిప్ అందిస్తుంది. ఫ్రొఫిషినల్ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబల్ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో అందిస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, అగ్రికల్చర్, ఫార్మసీ, మానేజ్మెంట్, లా మరియు ఇతర సైన్స్ ప్రొఫిషినల్ పీజీ కోర్సులు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.

యూజీసీ పీజీ ఎస్సీ, ఎస్టీ స్కాలర్షిప్ కోసం ఎంపికైన విద్యార్థులకు నెలకు 4500/- నుండి 7800/- రూపాయల వరకు స్టైపెండ్ అందిస్తుంది. ఈ స్కాలర్షిప్ దేశ వ్యాప్తంగా 1000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే అందిస్తారు.

స్కాలర్షిప్ పేరు యూజీసీ పీజీ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ & ఎస్టీ స్టూడెంట్స్
ఎవరు అర్హులు ప్రొఫిషినల్ పీజీ కోర్సులలో చేరిన ఎస్సీ & ఎస్టీ విద్యార్థులకు
స్కాలర్షిప్ కవరేజ్ 2 సంవత్సరాలు
స్కాలర్షిప్ స్లాట్‌లు 1000
దరఖాస్తు ముగింపు తేదీ 15-01-2024
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 31-01-2024
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 31-01-2024

ఈ పధకం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గుర్తింపు కల్గిన విశ్వవిద్యాలయాలు / ఇనిస్టిట్యూట్లు/ కళాశాలలు మరియు సెంట్రల్ / స్టేట్ గవర్నమెంట్ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు / సంస్థలు / కాలేజీలు మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్లలో చదువుకునే విద్యార్థులకు వర్తిస్తుంది. ఈ స్కాలర్షిప్ గరిష్టంగా రెండేళ్లు అందిస్తారు. రెండవ ఏడాది స్కాలర్షిప్ రెన్యువల్ కావాలంటే విద్యార్థి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

యూజీసీ పీజీ ఎస్సీ, ఎస్టీ స్కాలర్షిప్ పరిమితి

కోర్సులు  స్కాలర్షిప్ విలువలు
ఎం/ఎంటెక్ కోర్సులకు 7,800/- per month (78,000/-)
ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు 4,500/- per month (45,000/-)

ఎలిజిబిలిటీ

యూజీసీ గుర్తింపు పొందిన స్టేట్ & సెంట్రల్ అనుబంధ యూనివర్సిటీలు, డ్రీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు మరియు అటానమస్ యూనివర్సిటీలలో ప్రోఫిసినల్ పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు చదివే ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు అర్హులు. పీజీ అడ్మిషన్ పొందే సమయానికి విద్యార్థి వయస్సు గరిష్టంగా 30 ఏళ్ళు మించకూడదు. ఈ స్కాలర్షిప్ రెగ్యులర్ పీజీ స్టూడెంట్లకు మాత్రమే అందిస్తారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ కోర్సులకు వర్తించదు.

దరఖాస్తు విధానం

అర్హుత కల్గిన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉండే దరఖాస్తులు పలు దశల వెరిఫికేషన్ తర్వాత విద్యార్థి వయస్సు మరియు మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ అందిస్తారు. దరఖాస్తు చేసే ముందు మొబైల్ నెంబర్ లింక్డ్ ఆధార్ కార్డు, మొబైల్ లింక్డ్ బ్యాంకు అకౌంట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అకాడమిక్ సర్టిఫికెట్లు అందుబటులో ఉంచుకోండి. ఈ స్కీమ్ చెందిన పూర్తి సమాచారం యూజీసీ పోర్టల్ యందు అందుబాటులో ఉంటుంది.

Post Comment