అవార్డులు & గౌరవాలు | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

అవార్డులు & గౌరవాలు | ఫిబ్రవరి 2022

రతన్ టాటాకు అస్సాం అత్యున్నత పౌర పురస్కారం

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటాను అస్సాం ప్రభుత్వం తమ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం 'అస్సాం బైభవ్‌తో' సత్కరించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముంబైలోని తాజ్ వెల్లింగ్టన్ మ్యూస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మిస్టర్ టాటాకు 'అస్సాం బైభవ్‌ను' ప్రదానం చేశారు.

Advertisement

యోహాన్ పూనావల్లకు "బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్" అవార్డు

యోహాన్ పూనావల్ల గ్రావిట్టస్ ఫౌండేషన్ యొక్క ఉర్జా అవార్డ్స్ 2022 ఐదవ ఎడిషన్‌లో “బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” అందుకున్నారు. ఈ అవార్డును శ్రీమతి అమృతా ఫడ్నవిస్ చేతుల మీదగా అందుకున్నారు. ఉర్జా అవార్డు వినోదం, క్రీడలు, వ్యాపారం, సామాజిక కార్యకలాపాలు మరియు విద్యా రంగాలకు చెందిన నాయకులు మరియు ప్రముఖులకు అందించబడుతుంది.

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022 యొక్క ప్రతిష్టాత్మక వేడుక ఫిబ్రవరి 20న ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుక తెలుగు చిత్రం 'పుష్ప: ది రైజ్' ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యింది. ఇక ఉత్తమ నటుడుగా 83 చిత్రం కోసం రణవీర్ సింగ్ అవార్డు అందుకోగా ఉత్తమ నటిగా మిమీ చిత్రానికి గాను కృతి సనన్ అవార్డు దక్కించుకుంది. అలానే 'కాండీ' ఉత్తమ వెబ్ సిరీస్ గా ఎంపికయ్యింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ వెబ్ సిరీస్ నటుడు అవార్డు అందుకున్నాడు.

బోల్ట్జ్‌మన్ మెడల్ పొందిన మొదటి భారతీయుడుగా ప్రొఫెసర్ దీపక్ ధర్

పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు చెందిన ప్రొఫెసర్ దీపక్ ధర్‌కు ప్రతిష్టాత్మక బోల్ట్జ్‌మన్ మెడల్ లభించింది. దీనితో ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయుడుగా చరిత్రకెక్కాడు. స్టాటిస్టికల్ ఫిజిక్స్‌పై నూతన పరిశోధనలు చేసే వ్యక్తులకు ప్రతి మూడు ఏళ్లకోసారి, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఈ మెడల్ ను అందజేస్తుంది.

Advertisement

Post Comment