Advertisement
SSC CHSL 2023 : ఇంటర్ అర్హుతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Latest Jobs SSC

SSC CHSL 2023 : ఇంటర్ అర్హుతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్ కార్యాలయాల్లో లోయర్ డివిజనల్ క్లర్క్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లును నియమించేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నియామక పరీక్షను నిర్వహిస్తుంది.

ఇంటర్మీడియట్ (10+2) స్థాయిలో నిర్వహించే ఈ నియామక పరీక్షకు దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువత నుండి పోటీ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు 7th పే స్కేల్ ప్రకారం 19900/-(పే లెవెల్ 2) నుండి 25500/-(పే లెవెల్ 4) పరిధిలో చెల్లిస్తారు. ఇంటర్ పూర్తిచేసి 18 నుండి 27 ఏళ్ళ మధ్య ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.

వివిధ కొలువుల ఆధారంగా పే స్కేల్

  • లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA): పే లెవల్-2 (రూ. 19,900-63,200).
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO): లెవల్-4 (రూ. 25,500-81,100) మరియు లెవెల్-5 (రూ. 29,200-92,300).
  • డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ‘A’: పే లెవల్-4(రూ. 25,500-81,100).

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ 2023 ముఖ్యమైన తేదీలు

మొత్తం ఖాళీలు 4,522 పోస్టులు
దరఖాస్తు ప్రారంభం 09 మే 2023
దరఖాస్తు ఆఖరు తేదీ 08 జూన్ 2023
సీహెచ్ఎస్ఎల్ టైర్ I ఆగష్టు 2023
సీహెచ్ఎస్ఎల్ టైర్ -

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ ఎలిజిబిలిటీ

  • జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
  • వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 27 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
  • విద్య అర్హుత : ఇంటర్మీడియట్ /10+2 ఉత్తీర్ణతయినా అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 100/-
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మినహాహించారు

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ దరఖాస్తు ప్రక్రియ

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ పరీక్ష యొక్క దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు నుండి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అభ్యర్థి యొక్క వ్యక్తిగత, విద్య, చిరునామా సమాచారాన్ని పొందుపర్చాల్సి ఉంటుంది. రెండవ దశలో పరీక్షకు సంబంధించి పోస్టు ఎంపిక, మీడియం, ఎగ్జామ్ సెంటర్ వంటి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

మూడవ దశలో పైన పొందుపర్చిన వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. చివరిగా అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

తెలుగు రాష్ట్రాలలో ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ సెంటర్లు
ఎగ్జామ్ సెంటర్ SSC రీజనల్ కేంద్రం సమాచారం (సౌత్ రీజియన్)
చిరాలా, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం,
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
Regional Director (SR), Staff Selection Commission, 2 nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in)

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ నమూనా

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ నియామక ప్రక్రియ మూడు దశలలో నిర్వహిస్తారు. మొదటి దశలో టైర్ I పేరుతొ సీబీటీ విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో డిస్క్రిప్టివ్ విధానంలో టైర్ II పరీక్షను జరుపుతారు. రెండవ దశలో మెరిట్ సాధించిన వారు చివరిగా టైర్ III పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. టైర్ III లో పోస్టుల వారీగా స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ లలో ఏదోఒకటి ఉంటుంది.

  • టైర్ -1: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
  • టైర్- II: పెన్ మరియు పేపర్ మోడ్ (డిస్క్రిప్టివ్ మోడ్)
  • టైర్- III :  స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ / డాక్యుమెంట్ వెరిఫికేషన్.

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ I ఎగ్జామ్ ఫార్మేట్

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ I స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. గంట నిడివితో జరిగే ఈ నియామక పరీక్షలో మొత్తం వంద ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. ప్రశ్నలు జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, జనరల్ అవెర్నెస్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంశాలకు సంబంధించి ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1/2 తొలగిస్తారు

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
ఇంగ్లీష్ లాంగ్వేజ్  (పార్ట్ I) 25 50 60 నిముషాలు
జనరల్ ఇంటిలిజెన్స్ (పార్ట్ II) 25 50
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (పార్ట్ III) 25 50
జనరల్ అవెర్నెస్ (పార్ట్ IV) 25 50

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ II ఎగ్జామ్ ఫార్మేట్

టైర్ I లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు టైర్ II నిర్వహిస్తారు. టైర్ II ఆఫ్‌లైన్'లో డిస్క్రిప్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. పరీక్షా ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో రాసేందుకు అనుమతిస్తారు. రెండు భాషల్లో కలిపిరాసే పేపర్లు పరిగణలోకి తీసుకోరు. 60 నిముషాల వ్యవధితో 100 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 200 నుండి 250 పదాలతో ఎస్సే / ప్రెసిస్ /లేఖ / లేదా అప్లికేషన్ వంటివి రాయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ సీట్ యందు హాల్ టికెట్ నెంబర్, సంతకం మినహా ఎటువంటి వ్యకిగత వివరాలు రాసేందుకు అనుమతించారు. ఈ పరీక్షలో అభ్యర్థులు 33% కనీస అర్హుత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

సబ్జెక్టు & పేపర్ ఎగ్జామ్ మోడ్ మార్కులు సమయం
ఎస్సే / ప్రెసిస్ /లేఖ / లేదా అప్లికేషన్ పెన్ & పేపర్ 100 60 నిముషాలు

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ III ఎగ్జామ్ ఫార్మేట్

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ టైర్ I, టైర్ II లలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్కిల్ టెస్టుకు ఎటువంటి మార్కులు కేటాయించారు. కానీ ఈ పరీక్షలో అభ్యర్థులు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ కమిషన్ రీజనల్ కేంద్రాల్లో లేదా సబ్ రీజనల్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. స్కిల్ టెస్టులో 2 డెసిమిల్స్ వరకు తప్పులను లెక్కిస్తారు.

స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్

డేటా ఎంట్రీ ఆపరేటర్లకు స్కిల్ టెస్ట్ తప్పనిసరి. ఈ టెస్ట్ నుండి ఎవరికి మినహాయింపు ఉండదు. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థుల డేటా ఎంట్రీ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో భాగంగా గంట సమయంలో 8000 కీ ఇంప్రెషన్స్ చేయాల్సి ఉంటుంది. ప్రతి 15 నిముషాల్లో 2000 పదాలు కలిగిన పాసేజ్'ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సిన పరీక్షా. దీనికి ఎటువంటి మార్కులు కేటాయించారు.

కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సి & ఎజి) కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A పోస్టు కోసం పోటీపడే అభ్యర్థులు డేటా ఎంట్రీ టెస్టులో గంట సమయంలో 15000 కీ ఇంప్రెషన్స్ చేయాల్సి ఉంటుంది. ప్రతి 15 నిముషాల్లో 3700 నుండి 4000 పదాలు కలిగిన పాసేజ్'ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.

టైపింగ్ టెస్ట్

లోయర్ డివిజనల్ క్లర్క్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్లకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో రాసేందుకు అనుమతిస్తారు. ఇంగ్లీష్ భాషను ఎంపిక చేసుకున్న వారు ప్రతి నిముషానికి 35 పదాలు (w.p.m) టైపు చేయాల్సి ఉంటుంది. హిందీ బాషను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు నిమషానికి 30 పదాలు (w.p.m) టైపు చేయాల్సి ఉంటుంది. గంట వ్యవధిలో 10500 (ఇంగ్లీష్ )/ 9000 (హిందీ) పదాలు టైపు చేయాల్సి ఉంటుంది.

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ క్వాలిఫై మార్కులు & తుది ఎంపిక

ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ అన్ని టైర్స్ లలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు సంబంధించి ఎంపికను మార్చుకునేందుకు చివరిసారి అవకాశం కల్పిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంతృప్తిపర్చని అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తియ్యాక తుది షార్ట్ లిస్ట్ తయారీలో నిమగ్నమౌతారు. టైర్ I, టైర్ II లకు పోస్టుల విడివిగా అర్హుత మార్కులు ప్రకటిస్తారు. కేటగిరి వారీగా ప్రతి టైర్'లో మెరిట్ సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. టైర్ II లో అందరు అభ్యర్థులు తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మార్కులు సమమయ్యేటప్పుడు టైర్ II పేపర్ల మెరిట్ ను ప్రామాణికంగా తీసుకుంటారు.

అప్పటికి సమమైతే టైర్ IIలో సాధించిన మొత్తం మార్కులను పరిగణలోకి తీసికుంటారు. అప్పటికి సమమైతే ఎక్కువ వయస్సు అభ్యర్థులకు ప్రాధన్యత ఇస్తారు. ఇంకా సమస్య పరిస్కారం కాకుంటే అభ్యర్థుల పేర్లలో ఆల్ఫాబెట్ అక్షరాలను ఆధారంగా చేసుకుని చోటు కల్పిస్తారు.

కేటగిరి క్వాలిఫైయింగ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 30%
ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ 25%
ఇతరులు 20%
 దరఖాస్తు చేయండి ఎస్‌ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ సిలబస్ 
మాదిరి ప్రశ్న పత్రాలు మాదిరి ఆన్లైన్ పరీక్ష

Post Comment