విదేశీ విద్య కోసం విద్యా రుణాలు, స్కాలర్‌షిప్‌లు
Abroad Education Scholarships Student Loans

విదేశీ విద్య కోసం విద్యా రుణాలు, స్కాలర్‌షిప్‌లు

విదేశీ చదువుల కోసం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో ఉండే స్కాలర్షిప్లు, విద్యా రుణాల పూర్తి సమాచారం పొందండి.

Advertisement

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడమే ప్రధాన సమస్య. ఇండియా నుండి బయలుదేరిన నుండి తిరిగి ఇండియాకు చేరే వరకు అవసరమయ్యే మొత్తం ఆర్థిక అవసరాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలి.

ఇదే అంశాన్ని వీసా ఇంటర్వ్యూ సమయంలో కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళా ఫైనాన్సిల్ అసిస్టెన్స్ కోసం విద్యా రుణాలపై ఆధారపడితే వాటికీ సంబంధించి పూర్తి ప్రణాలికను వీసా ఇంటర్వ్యూ సమయానికి పూర్తిచేసి ఉండాలి. వీసా ఖర్చుల నుండి ప్రయాణ ఖర్చుల వరకు, యూనివర్శిటీ ఫీజుల నుండి జీవన వ్యయాల వరకు పూర్తి బడ్జెట్ అవసరాలను అంచనా వేచుకోవాలి.

విదేశీ చదువుల కోసం ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. వీటికి అర్హుత పొందని వారు, సొంత ఖర్చులతో వెళ్ళామో లేదా విద్యా రుణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం

Jagananna Videshi Vidya Deevenaఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు కులాలకు చెందిన విద్యార్థుల విదేశీ చదువులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. గతంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరుతో అందించే ఈ పథకంను ప్రస్తుతం జగనన్న విదేశీ విద్యా దీవెనగా అమలు చేస్తున్నారు.

ఈ పథకం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 200 యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మాత్రమే అందిస్తున్నారు. 100 లోపు ర్యాంకు కలిగిన యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కోర్సు ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. 101 -200 మధ్య యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు 50శాతం ఫీజు లేదా గరిష్టంగా 50 లక్షల వరకు చెల్లిస్తారు.

8 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉండే విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 35 ఏళ్లలోపు ఉండాలి. విదేశాల్లో ఉన్నత విద్య చేయాలనే నిరుపేద విద్యార్థుల కలను ఈ పథకం నిజం చేయనుంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, పిలిప్పీన్స్, సింగపూర్ వంటి దేశాలలో మానేజ్మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు జగనన్న విదేశీ విద్యా దీవెన అవకాశం కల్పిస్తుంది.

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి పథకం

Telangana overseas scholarshipతెలంగాణ ప్రభుత్వం ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ కులాలకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యకోసం 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ పథకంను మూడు పేర్లతో అందిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరుతొ, బీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి పేరుతొ, మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం పేరుతొ అందిస్తుంది.

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి సహాయాన్ని రెండు విడుతలలో అందజేస్తారు. మొదటి విడుత విద్యార్థి విదేశంలో ల్యాండ్ అవ్వగానే జమచేస్తారు. మొదటి సెమిస్టరు పూర్తియ్యాక రెండవ విడుత సహాయాన్ని అందిస్తారు. అదే విధంగా ఈ పథకం ద్వారా విద్యార్థికి ఏదైనా జాతీయ బ్యాంకు నుండి 10 లక్షల వరకు విద్యార్థి లోను తీసుకునే అవకాశం కల్పిస్తారు.

5 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉండే విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. విదేశాల్లో ఉన్నత విద్య చేయాలనే నిరుపేద విద్యార్థుల కలను ఈ పథకం నిజం చేయనుంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూ జిలాండ్, జపాన్, ఫ్రాన్స్ మరియు దక్షిణ కొరియా వంటి దేశాలలో మానేజ్మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఈ పథకం కింద దరఖాస్తు చేసే అభ్యర్థులు చెల్లిబాటు అయ్యే పాసుపోర్టు, వీసా కలిగి ఉండాలి. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే యూనివర్సిటీ ప్రవేశ పరీక్షా లేదా టోఫెల్, ఐఇఎల్టిఎస్ మరియు జిఆర్ఇ, జిమాట్ వంటి ప్రవేశ పరీక్షలలో అర్హుత సాధించి ఉండాలి. విదేశీ విద్య సాయం విద్యార్థి జాయిన్ అయ్యే యూనివర్సిటీ, దేశం మరియు కోర్సుపైన ఆధారపడి ఉంటుంది.

Advertisement

Post Comment