Education Loans in Telugu : విద్యా రుణం కోసం దరఖాస్తు చేయండి
Student Loans

Education Loans in Telugu : విద్యా రుణం కోసం దరఖాస్తు చేయండి

తెలుగులో విద్యా రుణాల సమాచారం పొందండి. స్టూడెంట్ లోన్ కోసం దరఖాస్తు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్న ఎడ్యుకేషన్ మరియు స్టూడెంట్ లోన్ల వివరాలు తెలుసుకోండి. దేశంలో అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి.

Advertisement

భారతీయ బ్యాంకులు విదేశీ విద్య కోసం కూడా రుణాలు అందిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లతో, సులభతరమైన తిరిగి చెల్లింపు వాయిదాలతో అందుబాటులో ఉన్న వివిధ విద్యా రుణాల పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆన్‌లైన్‌లో స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి

విద్యా రుణాల మార్గదర్శకాలు & చెల్లింపు నియమాలు

ఒక ఏభై ఏళ్లు వెనక్కిపోతే.. చదువు కోసం అప్పు ఏందిరా అనేవాళ్ళు. ఇప్పుడు చదువు కోసమే అప్పు అంటున్నారు. ఈ ఏభై యేళ్లలో చదువు విడిచేందుకు వీలులేని ఖరీదైన అవసరంగా మారింది. కుటుంబ ఆదాయంలో దాదాపు సగానికి పైగా పిల్లల చదువులు, కుటుంబ ఆరోగ్యం కోసం వెచ్చిస్తున్నారు అనేది అనేక జాతీయ సర్వేలు వెల్లడించిన నిజం.

నాటికీ, నేటికీ విద్య అనేది మనిషి యొక్క కనీస అవసరం. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరిటా ప్రభుత్వాలు ఎంతో కొంత ఆర్థిక చేయూతని అందిస్తున్నాయి కాబట్టి సరిపోయింది. లేకుంటే నిరుపేద, మధ్యతరగతి పిల్లల భవిత ఏ చోట బందీయ్యి ఉండేదో..!

గత ఇరవై యేళ్ళుగా విద్య ప్రధాన వ్యాపార వనరుగా మారింది. పుట్టగొడుగులు మాదిరి పుట్టుకొచ్చిన కార్పొరేట్ స్కూళ్ల మాయలో తల్లిదండ్రులు బందీలయ్యారు. ఇదే సమయంలో పాలకుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిరాదరణకు గురైంది. దీనితో విద్యా రంగం పూర్తిస్థాయిలో ప్రైవేట్ శక్తుల వశమైంది.

ఈరోజుల్లో ఒక గుర్తింపు ఉన్న కార్పొరేట్ స్కూల్లో పిల్లోడిని యూకేజీ చదివించాలి అంటే లక్షల్లో వారికీ ముట్టజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఉన్నత విద్య కోసం అయితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది.

ఈ డిమాండ్ ఉంది కాబట్టే, ఈ రోజు దేశంలో అన్ని బ్యాంకులు కేజీ నుండి పీజీ వరకు విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థి ఆర్థిక పరిస్థితి, జాయిన్ అయ్యే కాలేజ్, చేరే కోర్సును అనుచరించి, ఏభైవేల కనీస ఋణం నుండి కోటి రూపాయల వరకు బ్యాంకులు మరియు బ్యాంకింగు యితరా ఫైనాన్స్ సంస్థలు దేశీయ మరియు విదేశీయ విద్యకు రుణాలు అందిస్తున్నాయి.

విద్యా రుణం తీసుకునే ముందు ఈ అంశాలను తెలుసుకోండి

ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు అన్న సామెత వినే ఉంటారు. ఈ రెండు కార్యాలు ముగిశాక స్థూలంగా మిగిలేది అప్పు మాత్రమే. ఈ కేటగిరిలో ఇప్పుడు విద్య కూడా చేరింది. విద్యా రుణం అనేది భవిష్యత్ పెట్టుబడిగా పరిగణించాలా లేదా భవిష్యత్ లాభాన్ని ఇప్పుడే ఖర్చు చేయడమా అనేది ఎప్పటికి తేలని అంశం.

విద్యా రుణం సహాయంతో ఒక గొప్ప విద్య సంస్థలో ఉన్నత విద్య చదవాలనే ఆలోచన బాగున్నా, తీరా విద్య పూర్తిచేశాక, చేసిన అప్పు తిరిగి చెల్లించేందుకు ఎన్నాళ్ళు శ్రమించాలనేది మరో అంశం. అప్పు దేని కోసం చేసినా, దాన్ని చివరికి అప్పుగానే పరిగణించాలి. కావున ఈ అప్పు చేసే ముందు కొన్ని అంశాలు పరిశీలిద్దాం.

విద్యా రుణం ఎంత వరకు అవసరం...?

నేడు, రేపు అన్ని ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల పేరిట విద్యార్థులకు ఆర్థిక చేయూతని అందిస్తున్నాయి. ఈ సహాయం సాధారణ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు సరిపోతుంది.

అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి, దేశంలో ఉండే ప్రీమియర్ ఇనిస్టిట్యూట్లలో ఉన్నత విద్య అభ్యసించాలని ఆలోచించే వారికీ, జాబ్ ఓరిఎంటేడ్ కోర్సులలో జాయిన్ అయ్యేవారికి మరియు ఇతర నైపుణ్య అభివృద్ధి కోర్సులు పూర్తిచేయాలని అనుకునే వారికీ ప్రభుత్వం ఇచ్చే ఈ సహాయం ఒక లెక్కన సరిపోదు. వీరు తప్పనిసరిగా కోర్సుకు సంబంధించిన వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది.

ఇలాంటి సమయాల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులు తప్పనిసరి విద్యా రుణాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇలాంటి వారందరూ విద్యా రుణం పొందే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో కోర్సు ఎంపిక నుండి రీపేమెంట్ వరకు చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ప్రధానంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ అంశాల్ని ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి.

ఉద్యోగ అవకాశాలు ఉండే కోర్సులకే విద్యా రుణాలు

విద్యా రుణంకు దరఖాస్తు చేసే సమయంలో కోర్సు ఎంపిక ప్రధాన భూమిక పోషిస్తుంది. విద్యా రుణాన్ని మీరు భవిష్యత్ పెట్టుబడిగా పరిగణిస్తే కోర్సు ఎంపిక విషయంలో మేధోమథనం జరగాలి. ఎంపిక చేసుకునే కోర్సుకు, ప్రస్తుతం ఉండే డిమాండ్ రాబోయే కాలంలో ఉంటుందా, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయా, కోర్సు పూర్తయిన వెంటనే స్థిరపడే అవకాశం ఉంటుందా, ఒకవేళ స్థిరపడితే అధిక మొత్తంలో జీతభత్యాలు అందుకునే వీలు ఉందా, అలానే కెరీరులో అత్యున్నత స్థానానికి ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయా వంటి అంశాలను ఆలోచించుకోవాలి.

దానికంటే ముందే ఎంపిక చేసుకున్న కోర్సుకు బ్యాంకులు రుణాలు ఇచ్చే అవకాశం ఉందొ లేదో కూడా తెలుసుకుని తీరాలి. ఎంపిక చేసుకున్న కోర్సు పై మీకున్న ఆసక్తి, ఉద్యోగ మార్కెట్టులో దానికి ఉండే డిమాండును బేరీజు వేచి ఉత్తమ నిర్ణయం తీసుకోండి.

 ప్రీమియర్ ఇనిస్టిట్యూట్ల విద్యార్థులకు ప్రాధాన్యత

విద్యా రుణంతో ముడిపడిన మరో అంశం విద్యాసంస్థ ఎంపిక. బ్యాంకులు సాధారణంగా ప్రీమియర్ ఇనిస్టిట్యూట్లలో చదివే విద్యార్థులకు చాల మట్టుకు విద్యా రుణాలను మంజూరు చేస్తాయి. దీనికి గల ప్రధాన కారణం ఆయా విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు త్వరగా కెరీర్ పరంగా స్థిరపడతారు అనే భరోసా ఉండటం. దాదాపు అన్ని బ్యాంకులు తాము విద్యా రుణం మంజూరు చేసే విద్యాసంస్థల జాబితా అందుబాటులో ఉంచుతున్నాయి. కావున విద్యార్థి ప్రవేశం పొందేటప్పుడే ఇలాంటి అంశాలన్నీ బేరీజు వేచుకోవాల్సి ఉంటుంది.

విద్యా రుణాల వడ్డీ రేట్లు & రుణ మార్జిన్

విద్యా రుణాలకు అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీలు అమలు చేయవు. ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేటును వసులు చేస్తాయి. వడ్డీ రేటు పెరిగే కొలది రాబొయ్యే రోజుల్లో రుణ భారం పెరుగుతూ పోతుంది. కావున రుణం కోసం దరఖాస్తు చేసే ముందు గమనించాల్సిన వాటిలో వడ్డీ కూడా లిస్ట్ చేయాలి.

దానితో పాటుగా లోను పోసెస్సింగ్ చార్జీలు, ఇతర దరఖాస్తు రుసుము అన్ని ముందుగానే తెలుసుకుని తీరాలి. ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటుతో, పరిమిత అదనపు రుసుములతో విద్యా రుణం ఆఫర్ చేస్తుందో, ఆ బ్యాంకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.

అలానే మీ విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 ఇ కింద పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ పన్ను మినహాయింపుకు అర్హత పొందడానికి, మీరు భారతీయ షెడ్యూల్డ్ బ్యాంకుల నుండి లేదా ఆర్బిఐ గుర్తింపు కలిగిన ఆర్థిక సంస్థల నుండి విద్యారుణం తీసుకోవల్సి ఉంటుంది. ఈ పన్ను మినహాయింపు మీకు గరిష్టంగా 8 ఏళ్ళ వరకు లభిస్తుంది. అలానే కేంద్ర ప్రభుత్వం వెనక బడిన కులాల వారికీ పన్ను రాయితీ అవకాశం కల్పిస్తుంది.

దీనిలో మరో అంశం "లోన్ మార్జిన్". బ్యాంకులు అన్నీ కోర్సుకు అవసరమయ్యే పూర్తి రుణ మొత్తాన్ని మంజూరు చేయవు. కొంత లోను మార్జిన్ అమలు చేస్తాయి. ఈ మార్జిన్ 5% నుండి 15% వరకు ఉంటుంది. దీని అర్ధం 5% నుండి 15% వరకు ఫీజు భారాన్ని, విద్యార్థి సొంతంగా భరించాల్సి ఉంటుంది. వీటిని చెల్లించే స్థితిలో ఉండే విద్యార్థులను పక్కన పెడితే, పూర్తి కోర్సు కవర్ అయ్యే విధంగా విద్యారుణం అవసరమయ్యే వారు ఈ అంశాన్ని కూడా ముందుగా గమనించుకోవాల్సి ఉంటుంది.

విద్యా రుణాల రీపేమెంట్ & హాలిడే పీరియడ్

ఇప్పటి వరకు పెట్టుబడిగా కనిపించే విద్యారుణం, రీపేమెంట్ అంశానికి వచ్చేసరికి అప్పుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే దాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి. అందుకే ఈ అంశాన్ని మన లిస్టులో ముందు వరుసలో పెట్టాలి.

విద్యా రుణం తీసుకునే ముందు ఆలోచించు కోవాల్సిన ముఖ్య విషయాల్లో ఇది ఒకటి. రీపేమెంట్ ప్రక్రియ మీరు తీసుకున్న రుణ మొత్తం ఆధారంగా 7 నుండి 15 ఏళ్ళ వరకు ఉండే అవకాశం ఉంది. అంటే మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు దీనికి చెందిన ఈఏంఐలు చెల్లించాల్సి వస్తుంది. ఇది మీ భవిష్యత్ మనుగడకు భారమయ్యే అవకాశం లేకపోలేదు.

ఈ మొత్తం ప్రక్రియలో విద్యా రుణం ద్వారా మీరు పొందిన ఏకైక బెనిఫిట్, ఒక మంచి విద్యాసంస్థలో మీరు కోరుకున్న కోర్సు పూర్తి చేయడం. ఈ కోర్సు చేసాక మీరు ఏం చేస్తారనేది బ్యాంకులకు అనవసరం. మీరు కోర్సు పూర్తిచేసిన 6 నుండి 12 నెలల తర్వాత నుండి లోను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అనగా రీపేమెంట్ కోసం మీరు ముందుగానే సిద్దమయ్యి ఉండాలి.

దాదాపు అన్ని బ్యాంకులు కోర్సు పూర్తియినా నుండి తిరిరి చెల్లింపు మొదలయ్యే వరకు 6 నుండి గరిష్టంగా 12 నెలల వరకు హాలిడే పీరియడ్ ఆఫర్ చేస్తున్నాయి. అనగా కోర్సు పూర్తిచేసిన ఏడాదిలో మీరు కెరీరులో స్థిరపడాల్సి ఉంటుంది. కావున ఈ అంశాలల్ని ఒకటి పదిమార్లు అలోచించి తుది నిర్ణయం తీసుకోండి.

Advertisement

Post Comment