కోడ్‌అకాడమీ ఆన్‌లైన్ కోర్సులు : 11 ప్రోగ్రామింగ్ భాషలు నేర్చుకోండి
Online Education Useful websites

కోడ్‌అకాడమీ ఆన్‌లైన్ కోర్సులు : 11 ప్రోగ్రామింగ్ భాషలు నేర్చుకోండి

కోడ్‌అకాడమీ అనేది ఒక అమెరికన్ ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫామ్, ఇది పైథాన్, జావా, గో, జావాస్క్రిప్ట్, రూబీ, SQL, C ++, స్విఫ్ట్ మరియు సాస్‌తో పాటు 14 వేర్వేరు ప్రోగ్రామింగ్ భాషలలో కోడింగ్ ట్యుటోరియల్స్ అందిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్'లు నేర్చుకునే ఆలోచన ఉన్నవారికి కోడ్‌అకాడమీ ఉత్తమమైన ఎంపిక.

Advertisement

కోడ్‌అకాడమీ ప్రోగ్రామింగ్ భాషలతో పాటుగా వెబ్ డిజైనింగ్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, గేమ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, కోడింగ్ ఫౌండషన్స్, డెవలపర్ టూల్స్ మరియు మిషిన్ లెర్నింగ్ వంటి అనుబంధ కోర్సులను కూడా అందిస్తుంది. ఈ కోర్సులు కొన్ని పరిమితులతో ఉచితంగా మరియు నిర్దిష్ట చెల్లింపులతో ప్రో కోర్సులను కూడా అందిస్తుంది.

కోడ్‌అకాడమీ కోర్సులు

HTML & CSS C++
Python R
JavaScript C#
Java PHP
SQL Go
Bash/Shell Swift
Ruby Kotlin

కోడ్‌అకాడమీ ద్వారా దాదాపు 50 మిలియన్లకు పైగా కోడింగ్ నేర్చుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా కోడింగ్ నేర్చుకునే వారికీ కోడ్‌అకాడమీలో మూడు రకాలైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అవి 1) బేసిక్ ప్లాన్ 2) ప్రో ప్లాన్ 3) టీమ్స్ ప్లాన్

బేసిక్ ప్లాన్ : ఈ ప్లాన్ లో ఎటువంటి చెల్లింపు లేకుండా కొన్ని నిర్దిష్ట పరిమితులలో ఉచితంగా కోర్సులు అందిస్తుంది. కోడెకాడమీ వెబ్సైటులో మీ ఇమెయిల్ ఐడీతో అకౌంట్ రూపొందించుకోవడం ద్వారా ఈ సౌలభ్యం అందిపుచ్చుకోవచ్చు. బేసిక్ ప్లాన్ లో ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించి బేసిక్ నాలెడ్జ్ మాత్రమే అందిస్తారు. ఇందులో కోర్సు గైడెన్స్, టెక్నికల్ సపోర్ట్, అపరిమిత మొబైల్ ప్రాక్టీస్ ఆప్షన్, రియల్ ప్రాజెక్టు ప్రాక్టీస్, కోర్సు పూర్తిచేసిన సర్టిఫికెట్ సదుపాయాలు లభించవు.

ప్రో ప్లాన్ : ప్రో ప్లాన్ లో ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించి పూర్తిస్థాయి ప్రీమియం కంటెంట్ అందిస్తారు. ఈ కోర్సులు సంబంధిత సబ్జెక్టు సంబంధించి పూర్తిస్థాయి ప్రోఫిసినల్ జ్ఞానాన్ని అందిస్తాయి. ఈ కోర్సులకు సంబంధించి అపరిమిత మొబైల్ ప్రాక్టీస్, స్టెప్ బై స్టెప్ కోర్సు గైడెన్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, టెక్నికల్ కోర్సు సపోర్టుతో పాటుగా పూర్తిచేసిన కోర్సులకు సర్టిఫికెట్ కూడా అందిస్తారు.

టీమ్స్ ప్లాన్ : టీమ్స్ ప్లాన్ దాదాపు ప్రో ప్లానును పోలి ఉంటుంది. కాకుంటే ప్రో ప్లాన్ ఒక సభ్యుడు మాత్రమే ఉపయోగించేందుకు అనుమతి ఉంటుంది. టీమ్స్ ప్లాన్ విషయానికి వస్తే ఎంతమంది సభ్యులైన ఉపయోగించుకోవచ్చు. వీటి పాటుగా టీమ్ పెరఫామెన్స్ రిపోర్టులు అందిస్తారు. అదే విధంగా కోర్సులను సభ్యులకు నచ్చే సమయాల్లో షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది.

కోడ్‌అకాడమీ కోర్సుల కీ పాయింట్స్

  • ప్రీమియం కోడింగ్ నేర్చుకునేందుకు ఉత్తమ ఎంపిక
  • అన్ని కోడింగ్ భాషలు ఒకే వేదిక ద్వారా నేర్చుకునే అవకాశం
  • బేసిక్ ప్లాన్ ద్వారా ఉచితంగా కోడింగ్ నేర్చుకునే అవకాశం
  • ప్రతి కోర్సుకు పూర్తిస్థాయి డెడికేటెడ్ ఫార్మ్ సపోర్ట్ లభిస్తుంది
  • లైవ్ కోడ్ ప్రాక్టీస్ సదుపాయం లభిస్తుంది, మొబైల్ ద్వారా కూడా ప్రాక్టీస్ చేసే సదుపాయం ఉంది
  • పూర్తి చేసిన కోర్సులకు సర్టిఫికెట్ అందిస్తారు

కోడ్‌అకాడమీ కోర్సుల ప్రతికూలతలు

  • బేసిక్ ప్లాన్ లో అందించే కోర్సులు ప్రాథమిక స్థాయిలో ఉంటాయి
  • కోర్సులు సభ్యులు తమ అనుకూలమైన సమయాల్లో నేర్చుకునే సదుపాయం లేదు
  • సబ్జెక్టు సంబంధిత అంశాలు నావిగేట్ చేయడం కష్టం
  • కోర్సులను స్కిప్ చేసే సదుపాయం లేదు
  • ప్రో ప్లాన్స్ కు ఉచిత ట్రయిల్ సదుపాయం, మనీ బ్యాక్ గ్యారెంటీ లేదు

కోడ్‌అకాడమీ కోర్సులు ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు కొంచెపు పక్కన పెడితే, ఆన్‌లైన్ ద్వారా కోడింగ్ నైపుణ్యాలు నేర్చుకునే ఆలోచన ఉన్నవారికి కోడ్‌అకాడమీ ఉత్తమ ఎంపిక అవుతుంది.

Advertisement